Monday, 30 March 2015

ఒక ఆలోచన .. ఒక ఆఫర్!

కిక్‌స్టార్టర్, ఇండీగోగో అనేవి ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందిన యు ఎస్ బేస్‌డ్ "క్రౌడ్ ఫండింగ్" వెబ్‌సైట్‌లు.

అయితే -

ఒక సినిమా నిర్మాణం కోసమో, మరేదయినా ప్రాజెక్టు కోసమో - ఒక్కో డాలర్ అయినా సరే, 'ఫండింగ్' చేసేవాళ్లని అసలు "Crowd" అని ఎలా అనగలుగుతాం? ఆ పధ్ధతిన వాళ్ళిచ్చే డబ్బంతా "Crowd Funding" ఎలా అవుతుంది?


నిజానికి - ఎంతో ప్యాషన్‌తో ఫండింగ్ చేసే ఈ పధ్ధతిని చాలా గౌరవంగా "Proud Funding" అనాలి.

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా, ఈ క్రౌడ్ ఫండింగ్ పధ్ధతి అమెరికాలోనూ, ఇంకెన్నో పాశ్చాత్య దేశాల్లో యమ సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఒక్క మన దేశంలో తప్ప.

కిక్‌స్టార్టర్, ఇండీగోగో వంటి సైట్స్ మన దేశంలోనూ ఒకటి రెండు వచ్చినా అంతగా ప్రాచుర్యం పొందలేదు. కారణాలు రెండు: ఒకటి రిజర్వ్ బ్యాంక్ రూల్స్. రెండు: 'మిస్ యూజ్ చేయడం' అనబడే మన వాళ్ల సర్వసహజమైన కాపీరైట్ హక్కు!

ఉదాహరణకు, మనవాళ్లు సినిమాల "శాటిలైట్ రైట్స్" ను ఎంత రేంజ్‌లో మిస్ యూజ్ చేయాలో అంతా చేశారు. చివరికిప్పుడు అసలు శాటిలైట్ రైట్స్ అనేవే లేకుండా పోయాయి!

కట్ టూ మన టాపిక్ - 

ఈ క్రౌడ్ ఫండింగ్ పధ్ధతినే, ఒక చిన్న బాధ్యతాయుతమయిన ట్విస్ట్‌తో, మన దగ్గర కూడా సక్సెస్ చేయవచ్చునేమోనని నాకనిపించింది. అలా అనిపించిన నా అలోచననలనే ఒక ఆఫర్‌గా అతిత్వరలో మీ ముందుకి ఓ చిన్న బ్లాగ్ రూపంలో తెస్తున్నాను.

అదే -

మైక్రో బడ్జెట్ ఫిలిం ఫండింగ్!

సింపుల్‌గా MBFF.

ముందే చెప్పినట్టు - ఇదొక ఆలోచన. సినీ ఫీల్డు పట్ల ప్యాషన్, చిన్న స్థాయిలోనయినా సినిమాల్లో ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచన ఉన్నవారికి ఒక ఆఫర్. మొత్తం సినిమా బిజినెస్‌ను ప్రత్యక్షంగా స్టడీ చేయడానికి ఇదొక అవకాశం కూడా.

'అదేంటి .. ఎలా' అన్నది అతిత్వరలో, ఇక్కడే, ఇదే బ్లాగ్‌లో ..  

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani