ఎక్కడో ఒకటీ అరా వచ్చినా, ఆ స్థాయిలో లేవు.
సిల్‌సిలాలో అమితాబ్ "రంగ్ బర్‌సే" తర్వాత, ఈ మధ్యకాలంలో నన్ను బాగా ప్రభావితం చేసిన హిందీ హోలీ పాట యే జవానీ హై దివానీ సినిమాలోని "బలమ్ పిచ్‌కారీ" పాట!
ఈ సినిమా దర్శకుడు ఆయన్ ముఖర్జీ చాలా యంగ్. ఈ సినిమా సబ్జెక్ట్ ఎన్నికే ఒక హైలైట్. ఆ సబ్జెక్టును నిర్మాతల చేత ఒప్పించి, తను అనుకున్న విధంగా తెరమీద ప్రెజెంట్ చేయడం అనేది ఆయన్ ముఖర్జీ విషయంలో ఓ గొప్ప అచీవ్‌మెంట్.
సినిమా చూడాలి. ఇలాంటి ట్రెండీ సినిమాలు తెలుగులో ఎందుకు రాలేకపోతున్నాయో అర్థం చేసుకోవాలి. పాతరాతి యుగం నాటి పధ్ధతిలో కాకుండా - చాలా వేగంగా, ఫిలిమ్‌మేకింగ్‌లో వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ, చాలా తక్కువ బడ్జెట్‌లో, ఇలాంటి మంచి ట్రెండీ సినిమాలు తీసే ఒక ఫాక్టరీని ప్రారంభించే ఆలోచనలో ఉన్నాను. స్విమ్మింగ్‌పూల్ కాపీ వచ్చాక ఆ పనులు కూడా ప్రారంభించవచ్చు. అదలా వదిలేద్దాం.
కట్ టూ మన స్విమ్మింగ్‌పూల్ -
ఆయన్ ముఖర్జీ సినిమాలోని ఈ పాటను ఎంజాయ్ చెయ్యాలంటే, తప్పకుండా ఈ సినిమా చూసి ఉండాలి. దీపిక ఒక సమగ్ర నటిగా టాప్ రేంజ్‌కి ఎదిగింది ఈ సినిమాతోనేనని నేననుకుంటాను.
స్విమ్మింగ్‌పూల్ లోని ఒక సీన్లో - ఒక క్యారెక్టర్ టీవీ చూస్తున్నప్పుడు ఓ చానెల్లో ఈ పాట వస్తున్నట్టు ఓ చిన్న బిట్ చూపించాను. ఈ పాటంటే నాకు అంత ఇష్టం!
నా మిత్రులు, శ్రేయోభిలాషులు, నా స్విమ్మింగ్‌పూల్ టీమ్ .. అందరికీ హోలీ శుభాకాంక్షలు!
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani