స్విమ్మింగ్‌పూల్ ఆడియోలో ఇక మొత్తం నాలుగు పాటలుంటాయన్నమాట. మూడు పాటలు ముందే రికార్డయ్యాయి. వారం క్రితం నాలుగో పాట కూడా హాట్ హాట్‌గా రికార్డ్ చేశాం.
అదే .. స్విమ్మింగ్‌పూల్ సినిమాకు ప్రమోషనల్ సాంగ్.
యాక్చువల్‌గా ఈ ఐడియా ముందు నుంచి ఉన్నది కాదు. నానా ట్రెడిషనల్ పధ్ధతులు ఇండస్ట్రీలో ఇంకా కొనసా..గుతూ ఉండటం వల్ల, పోస్ట్ ప్రొడక్షన్ పనులు నేను అనుకున్న స్పీడ్‌లో జరగటం లేదు. ఈ స్వల్ప ఆలస్యాన్ని కవర్ చేయడం కోసం అనే కాకుండా - బిజినెస్‌కూ, సినిమా సక్సెస్‌కు కూడా ఉపయోగపడుతుందన్న ఉద్దేశ్యంతో ఈ మధ్యే ఆ పాట గురించి అనుకున్నాను.
నా ఈ కొత్త ఐడియాకు సూటయ్యే లిరిక్ రైటర్‌ను ఇప్పటికిప్పుడు వెదుక్కొని రాయించుకొనే టైమ్ లేక, పాటని నేనే రాశాను.
ఈ పాట పూర్తిగా ఇంగ్లిష్‌లో ఉంటుంది.
సోలో ఫిమేల్ వాయిస్. ప్లస్ .. మంచి మెలొడీ.
ఈ ప్రమోషనల్ సాంగ్ ట్రాక్‌ని యు ఎస్ లో ఉన్న ఒక నేటివ్ అమెరికన్ ఫ్రెండ్‌తో ముందు పాడించాను. తను ట్రాక్ బాగా పాడింది. ఇక్కడ రికార్డింగ్ ఒకవేళ నేను అనుకున్నట్టు రాకపోతే - నా ఫ్రెండ్ పాడిన ఆ ట్రాక్ సపోర్ట్‌తో, ఒక నేటివ్ అమెరికన్ సింగర్‌తోనే పాడించడానికి నిర్ణయించుకున్నాను కూడా.
మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌చంద్ర కూడా అందుకు ఓకే అన్నాడు.
కానీ ఆ అవసరం రాలేదు.
మన తెలుగు గాయని లిప్సిక చాలా బాగా పాడింది.
కట్ టూ యూట్యూబ్ -
ఎలాగో ప్రమోషనల్ సాంగ్ రికార్డింగ్‌ని షూట్ చేశాం. షూట్‌కి అసలు హీరోయిన్ ప్రియ వశిష్ట వస్తుందా రాదా అన్న టెన్షన్ చివరి నిమిషం వరకూ ఉంది. కానీ, కొంచెం ఆలస్యంగానయినా స్టూడియోకు రీచ్ కాగలిగింది ప్రియ.
మొత్తానికి .. ఏ మాత్రం హడావిడి లేకుండా, చాలా సింపుల్‌గా, ప్రమోషనల్ సాంగ్ రికార్డింగ్ షూట్ ఒక్క నలభై నిమిషాల్లో పూర్తిచేశాం.
హీరో అఖిల్ కార్తీక్ సిన్సియర్ కోపరేషన్ గురించి ఎప్పుడూ చెప్పడం బాగుండదు. వెరీ కూల్ అండ్ పర్‌ఫెక్ట్. ఎప్పట్లాగే.
మళ్లీ పాయింట్‌కొస్తే -
ఈ ప్రమోషనల్ సాంగ్ వీడియోను ఎడిట్ చేశాక, ఈ వీకెండ్‌లోపే దీన్ని యూట్యూబ్‌కి ఎక్కించాలనుకుంటున్నాను.
కొంచెం ఎక్జయిటింగ్‌గా ఉంది నాకే. అయితే ఈ ఎగ్జయిట్‌మెంట్ నా గురించి కాదు. ప్రదీప్‌చంద్ర గురించి!
ఎందుకంటే - ప్రదీప్ ఫిజికల్ అపియరెన్స్‌ను చూసి ఆయన సంగీత జ్ఞానాన్ని, ఆయన్ని సంగీత దర్శకుడిగా పరిచయం చేసిన నా నిర్ణయాన్నీ టోటల్ నెగెటివ్‌గా అంచనా వేసినవాళ్లు చాలా మంది ఉన్నారు.
ఈ జడ్జ్‌మెంట్ చేయడానికి వీళ్లేమీ శంకరాభరణం శంకరశాస్త్రులో, విశ్వనాథ్ గారి మరో సినిమాలో మమ్మూట్టిలో కారు. ఈ కామన్‌సెన్స్ (లెస్) కామెడీ ట్రాక్ గురించి మరోసారి మరో బ్లాగ్‌పోస్ట్‌లో రాస్తాను.
ఫినిషింగ్ టచ్ ఏంటంటే - ఈ ప్రమోషనల్ సాంగ్‌కు వెర్షన్ 2 కూడా ఉంటుంది.
అదెలాఉంటుందన్నది ఇప్పటికి సస్పెన్స్!

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani