"ఎర్రగడ్డ బావా!"
మొన్నటిదాకా తెలంగాణ గవర్నమెంట్‌లో డిప్యూటీ సెక్రెటరీగా పనిచేసిన నా యూనివర్సిటీ ఫ్రెండ్ ప్రతాప్ ఇందాకే నాకు కాల్ చేశాడు. వాడి ప్రశ్నకు జవాబివ్వగానే 2 నిమిషాలు పడీపడీ నవ్వాడు. అనుబంధంగా మరికొన్ని జోక్స్ వేసుకుని నవ్వుకొన్నాము.
కట్ చేస్తే -
మా ఆఫీస్ అడ్రసుకు సంబంధించి పై సమాధానం విన్న ప్రతి పది మందిలో 9 మంది నవ్వుతారు. ఎందుకన్నది నేను వివరించి చెప్పాల్సిన పన్లేదు.
జోక్స్ ఎలా ఉన్నా, ఇప్పుడు నేను ఎమ్‌డి గా పనిచేస్తున్న ఈ ఆఫీసు ఒక రియల్ ఎస్టేట్ ఆఫీసు. నా మిత్రుడు పరమేశ్వర రెడ్డి గారిది. ఆయనకింకా 3 ఆఫీసులున్నాయి ఇదే కాంప్లెక్స్‌లో. ప్రమోషన్ విషయంలో తనకు సహాయంగా ఉంటానని నన్నొక కంపెనీకి ఎండిగా చేశారు. అది వేరే విషయం.
దీన్నే నేనిప్పుడు నా ఫిలిం ప్రొడక్షన్ హౌజ్‌గా పూర్తి స్థాయిలో వాడుతున్నాను.
ఆల్రెడీ 3 సినిమాలు, 2 వెబ్ సీరీస్‌లు, 2 మ్యూజిక్ వీడియోల నిర్మాణం కోసం ప్రి-ప్రొడక్షన్ వర్క్ ఇదే ఆఫీసులో సీరియస్‌గా జరుగుతోంది. ఇతర క్రియేటివ్ & కంటెంట్ రైటింగ్ సర్విసెస్ కూడా ఇదే ఆఫీస్‌లో ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. కొన్ని ఈవెంట్స్ ప్లానింగ్‌లో కూడా బిజీగా ఉన్నాం.
హాట్ న్యూస్ ఏంటంటే - ఈ నెలలోనే మా ఆఫీసుని సుచిత్ర వైపు షిఫ్ట్ చేస్తున్నాం.
ఒక ఇండిపెండెంట్ డూప్లెక్స్ హౌజ్ లోకి.
ఒక ఇండిపెండెంట్ డూప్లెక్స్ హౌజ్ లోకి.
"ఫిలిం ఇండస్ట్రీకి దూరమవుతుంది" కదా అని కొందరు మిత్రులన్నారు. 12 కిలోమీటర్లు పెద్ద దూరం కాదన్నది నా అభిప్రాయం.
ముంబైలో ఒక్కో ఫిలిం ప్రొడక్షన్ ఆఫీసు సిటీకి ఒక్కో మూలన ఉంటుంది.
కంఫర్ట్ ముఖ్యం.
ముఖ్యంగా - సీరీస్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు అన్ని విధాలుగా మన సౌలభ్యం మనకు ముఖ్యం.
మనతో అవసరమున్నవాళ్ళు మన దగ్గరికొస్తారు. మనకు అవసరమున్నవాళ్ళ దగ్గరికి మనం వెళ్తాం. అవసరమైనప్పుడు, మధ్యలో ఎక్కడైనా హోటెల్లో కూడా మీటింగ్స్ పెట్టుకోవచ్చు.
ఆఫీసు ఫిలిమ్‌నగర్‌లో ఉన్నదా, ఎర్రగడ్డలో ఉన్నదా, సుచిత్రలో ఉందా అన్నది కాదు పాయింట్.
ఏం చేస్తున్నాం, ఏం సాధించబోతున్నాం అన్నదే అసలు పాయింట్.
- మనోహర్ చిమ్మని
ఏం చేస్తున్నాం, ఏం సాధించబోతున్నాం అన్నదే అసలు పాయింట్.
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani