అందులో అప్పుడప్పుడూ వెళ్ళి చిప్సూ అవీ కొనుక్కునేవాణ్ణి.
దాంట్లో చిప్స్ తూకం వేసి ప్యాక్ చేసి ఇచ్చే ఒక తమిళియన్ బాయ్ నన్ను బాగా అబ్జర్వ్ చేసేవాడు. బాగా పలకరించేవాడు.
అక్కడున్న 5 నిమిషాల్లో నన్ను సినిమాలకు సంబంధించి ఏదో ఒకటి అడుగుతుండేవాడు. వాడి ఉత్సాహం చూసి, నేను కూడా ఓపిగ్గా చెప్పేవాన్ని.
కట్ చేస్తే -
సుమారు 14 ఏళ్ళ తర్వాత ఉన్నట్టుండి ఫేస్‌బుక్‌లో నాకు కనెక్ట్ అయ్యి "నేను ఫలానా" అని పరిచయం చేసుకున్నాడు అదే కుర్రాడు.
"మిమ్మల్ని చూసి, మీతో మాట్లాడిన తర్వాతే నేను సినిమాల్లోకి రావాలనుకున్నాను అప్పుడే. కాని, మీకు చెప్పలేకపోయాను. తర్వాత, చెన్నై వెళ్ళి ఫిలిం ఇండస్ట్రీలో చేరాను. ఇప్పుడు నేను కెమెరామెన్‌గా చేస్తున్నాను. మీరే నాకు ఇన్‌స్పిరేషన్... అంటూ చెప్పుకొచ్చాడు.
నేను షాక్.
నాకు తెలీకుండానే నావల్ల ఇంకొకడు ఈ పద్మవ్యూహంలో ఇరుక్కున్నాడన్నమాట! :-)
నాకు తెలీకుండానే నావల్ల ఇంకొకడు ఈ పద్మవ్యూహంలో ఇరుక్కున్నాడన్నమాట! :-)
అతని పేరు కూడా సెంథిలే కావడం ఇంకో గమ్మత్తు.
(తెలుగు ఇండస్ట్రీలో పాపులర్ డిఓపి సెంథిల్, నేను మొదటిసారిగా బ్లాక్‌బస్టర్ పబ్‌లో కలుసుకున్నాం. అప్పుడతను "ఆర్య" సినిమాకు పనిచేస్తున్నాడు. అది వేరే కథ.)
- మనోహర్ చిమ్మని
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani