కాని, ఆ లొకేషన్ నన్ను చాలా ఆకట్టుకొంది. అసలు అలాంటి ఒక ప్లేస్‌లో, సిటీకి దూరంగా, ప్రకృతి మధ్య, జస్ట్ ఒక 15 మంది... ఎలా అంత అభిరుచితో అంత బాగా ఇళ్ళు కట్టుకొని ఉన్నారన్నది ఇప్పటికీ నాకు జవాబు దొరకని ప్రశ్నే.
కాలనీ చుట్టూ కొండలు, చెట్లు.
కనుచూపు మేరలో ఇంక వేరే ఇళ్ళు లేవు.
కనుచూపు మేరలో ఇంక వేరే ఇళ్ళు లేవు.
బహుశా ఇప్పుడిప్పుడే మెల్లగా ఆ కాలనీ సిటీకి కనెక్ట్ అవుతున్నదేమో నాకు తెలీదు. ఒక 2 ఏళ్ళుగా ఈ మధ్య నేను మళ్ళీ అటు వెళ్ళలేదు. మధ్యలో వైజాగ్ వెళ్ళినా, నాకు అంత బాగా నచ్చిన ఆ "తపోవనం"కు మళ్ళీ వెళ్ళలేకపోయాను.
కట్ చేస్తే -
కట్ చేస్తే -
ఆ మధ్య నేను పబ్లిష్ చేసిన "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" పుస్తకం కోసం ఒక కాన్సెప్ట్ అనుకొని, రాయటం ప్రారంభించింది ఆ కాలనీలో మా స్టుడెంట్ ఇంట్లోని గెస్ట్ రూం నుంచే.
దాంతో పాటు ఒక ఫిలిం స్క్రిప్ట్ కూడా ఆ 2 రోజుల్లోనే ప్రారంభించి... హుక్, ప్లాట్ పాయింట్, కొన్ని కీ-సీన్స్ కూడా రాసుకున్నాను.
ఫ్యూచర్‌లో నేను సినిమా ఏదైనా చేస్తే, నాకు నచ్చిన ఈ తపోవనంలో కనీసం ఒక 2 రోజులు షూట్ చెయ్యాలని గట్టిగా అనుకున్నాను.
ఇప్పుడా సమయం వచ్చింది.
ఫిబ్రవరి-మార్చి అంతా షూటింగ్ షెడ్యూల్ అయి ఉంది.
అక్కడ కాలనీలో ఉన్న దాదాపు ప్రతి ఇల్లు, ప్రతి చెట్టూ, ప్రతి మొక్కా, ప్రతి యాంగిల్ నాకింకా గుర్తున్నాయి. అక్కడున్న ఒక బుజ్జి బండరాయిని కూడా నేనింకా మర్చిపోలేదు. ఆ బండను కూడా చాలా అందంగా ఎలాగో ఫ్రేమ్‌లోకి తీసుకోవాలి.
ఫిబ్రవరి-మార్చి అంతా షూటింగ్ షెడ్యూల్ అయి ఉంది.
అక్కడ కాలనీలో ఉన్న దాదాపు ప్రతి ఇల్లు, ప్రతి చెట్టూ, ప్రతి మొక్కా, ప్రతి యాంగిల్ నాకింకా గుర్తున్నాయి. అక్కడున్న ఒక బుజ్జి బండరాయిని కూడా నేనింకా మర్చిపోలేదు. ఆ బండను కూడా చాలా అందంగా ఎలాగో ఫ్రేమ్‌లోకి తీసుకోవాలి.
కాని, అసలక్కడ నేను షూటింగ్ చేస్తానా లేదా అన్నది ఇప్పుడు నాకో బిగ్ కొశ్చన్...
ఎందుకంటే -
What to do Raju garu...
- మనోహర్ చిమ్మని
ఎందుకంటే -
శుభ్రత, పరిశుభ్రత, మొక్కలు, గ్రీనరీ... ఇలాంటివాటికి పెట్టింది పేరు నా స్టుడెంట్ దంపతులు. డీసెన్సీ, డిగ్నిటీ వారి డీయన్యేలోనే ఇన్-బిల్ట్‌గా ఉందా అన్నట్టుగా ఉంటారిద్దరూ. మరి మన ఫిలిం షూటింగ్ అంటే కనీసం ఒక 60 మంది టీమ్ ఉంటారు. ఎంత సుకుమారంగా పనిచేసినా కూడా అక్కడ నానా కంగాళీ అవుతుంది. ప్రతిరోజూ ప్యాకప్ చెప్పేదాక ఎంతో కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇంకా బోల్డన్ని ఉంటాయి.
నా స్టుడెంట్ దంపతులు, వాళ్ళ నేబర్స్ ఇవన్నీ భరిస్తారా?
లేదంటే, అక్కడ క్రియేట్ అయిన నాస్తాల్జియా కేవలం ఒక నాస్తాల్జియాగానే నాలో మిగిలిపోతుందా?
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani