ఏదో "షో పుటప్" కోసం, "ముందు ఆఫీసుంటేనే పనులవుతాయి" అన్న పాతకాలం మైండ్‌సెట్‌కు నేను పూర్తిగా వ్యతిరేకం.
ఇప్పటివరకు నేను చేసిన మూడు నాలుగు సినిమాల విషయంలో కూడా - ముందు వాటి టైటిల్ ఎనౌన్స్ చేసిన తర్వాతనే ఫండింగ్ వంటి ఇతర ఏర్పాట్లు చేసుకున్నాను.
ఆ తర్వాతే, నాకిష్టమైన చోట, ఒక మంచి ఇండిపెండెంట్ హౌజ్‌లో ఆఫీసు తీసుకొని సినిమాలు చేశాను.
దీనికి భిన్నంగా ఈసారి ఒక వెల్ ఫర్నిష్డ్ ఆఫీసు నుంచి నా తాజా సినిమా ప్రిప్రొడక్షన్ పనులు ప్రారంభించాను.
"నీకు అది పొడుస్తాం, ఇది పొడుస్తాం" అని నానా హామీలిచ్చినవాళ్లెవ్వరూ అర ఇంచ్ పని కూడా చెయ్యలేకపోయారు.
మీద నుంచి నానా కామెంట్స్, నెగెటివిటీ, మైండ్‌గేమ్స్.
"నీకు అది పొడుస్తాం, ఇది పొడుస్తాం" అని నానా హామీలిచ్చినవాళ్లెవ్వరూ అర ఇంచ్ పని కూడా చెయ్యలేకపోయారు.
మీద నుంచి నానా కామెంట్స్, నెగెటివిటీ, మైండ్‌గేమ్స్.
అంత అవసరమా?
ఇవన్నీ నా స్కూల్ కాదు.
ఏం పట్టించుకోకుండా నా పనులు నేను సీరియస్‌గా చేసేసుకుంటూ వెళ్తున్నాను.
ఎవరో ఒకరి మీద డిపెండ్ అయ్యి నేను అంతకు ముందు సినిమాలు చెయ్యలేదు. నా ఏర్పాట్లు నేనే చేసుకున్నాను.
స్వయంగా నాకు అంత స్థోమత, అంత శక్తి ఉన్నాయి.
కట్ చేస్తే -
థాంక్స్ టు బ్లాక్ బస్టర్ సినిమా "బేబి" ఇచ్చిన ఇన్‌స్పిరేషన్... థాంక్స్ టు ఈరోజు నన్ను తీవ్రంగా బాధపెట్టిన మరొక అర్థం లేని చర్చ...
వార్‌ఫుట్‌లో నా పనులను ఈ క్షణం నుంచే మరింత వేగవంతం చేస్తున్నాను. ఏకకాలంలో నా రెండో తాజా సినిమా ప్రిప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించాను.
థాంక్స్ టు నా మిత్రుడు, చైర్మన్ బి పి ఆర్ గారికి కూడా... For all his encouragement...
ఎప్పుడెప్పుడు షూటింగ్ ప్రారంభించి ఈ నాలుగు గోడల మధ్యనుంచి బయటపడిపోతానా అని ఎదురుచూస్తున్నాను.
For me, life is freedom.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani