మొన్నటి నా బ్లాగ్ పోస్టు ఒకదాని కింద వచ్చిన 2 కామెంట్స్‌ను ఇక్కడ ఉన్నదున్నట్టుగా కాపీ పేస్ట్ చేస్తున్నాను:
"మీరు ఒక్కరే సినిమా రిస్క్ లేని పెట్టుబడి అని చెప్పేది.
అటువైపు ఆ గ్రేట్ ఆంధ్ర , తుపాకీ లాంటి వెబ్సైట్ చిన్న సినిమా ఎత్తిపోయింది అని , ఆహా తప్ప ఎవరు దేకడం లేదని .
పెట్టిన పైసలు అన్ని మూసి నది పాలైనట్టే అని చెప్తున్నాయి .
వారానికి చిన్న సినిమాలు 10 వస్తున్నాయి , ఒక్కటంటే ఒక్కటి కూడా కనపడ్డం లేదు సోమవారానికి .
మీరు చెప్పేదానికి, వాస్తవంగా బయట కనిపించేది చాలా తేడా కనిపిస్తుంది."
***
"సినిమా... ఇప్పుడు భారీ లాభాల్ని తెచ్చే ఆదాయమార్గం కూడా! అలాగే అది భారీనష్టాల్ని తెచ్చే ప్రమాదమార్గం కూడాను.
(Just an opinion, you need not publish this comment)"
***
కట్ చేస్తే -
కట్ చేస్తే -
వారానికి 10 వ్యాపారాలు కూడా ప్రారంభమవుతాయి. ఎన్ని సక్సెస్ అవుతున్నాయి?
వెబ్‌సైట్స్, యూట్యూబ్ చానెల్స్ వంద చెప్తాయి. రివ్యూయర్స్ వంద రాస్తారు. వాళ్ళందరికీ సొంత ఎజెండాలుంటాయి.
ఇప్పుడు లేటెస్టుగా హిట్ అయిన "సామజవరగమన" చిన్న సినిమానే కదా?! ఇప్పటికే 40 కోట్లు దాటి కలెక్ట్ చేసింది.
కట్ చేస్తే -
సినిమాను కూడా ఒక వ్యాపారంలా భావించి, తగిన అవగాహనతో, మార్కెట్ అధ్యయనంతో జాగ్రత్తగా చేస్తే... సినిమా ఫ్లాప్ అయినా డబ్బులు ఎక్కడికీ పోవు. నాలుగు రకాల ఇన్‌కమ్ అవెన్యూస్ ఉన్నాయి.
హిట్ అయితే, హిట్ అయిన రేంజ్‌ను బట్టి భారీ లాభాలొస్తాయి.
దీనికి పెద్ద సినిమానా, చిన్న సినిమానా అన్న తేడాలేం లేవు.
ఇదంతా ఎక్కడో నాలుగు గోడలమధ్య కూర్చొని రాస్తున్న థియరీనో, ఊహలో కాదు.
బ్లాగ్ పోస్టుకో, కామెంట్‌కో కౌంటర్ కాదు.
వాస్తవం.
చిన్న నిర్మాతలయినా, పెద్ద నిర్మాతలయినా - ఈ అవగాహనతో తీసినవాళ్ళే నిలదొక్కుకుంటారు, నిలబడతారు.
టెంప్ట్ అయి డబ్బు తగలేసుకునేవాళ్ళు పోతారు.
దట్ సింపుల్.
దీనికి ఒక్కటే ఒక్క మినహాయింపు ఏంటంటే... ఎంత అవగాహనతో ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకున్నా, ఎంత కాలిక్యులేటెడ్ రిస్కుతో చేసినా, బిజినెస్ అన్న తర్వాత అప్పుడప్పుడూ దెబ్బలు తగులుతుంటాయి. సినిమా బిజినెస్ కూడా అలాంటిదే.
దీనికి ఒక్కటే ఒక్క మినహాయింపు ఏంటంటే... ఎంత అవగాహనతో ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకున్నా, ఎంత కాలిక్యులేటెడ్ రిస్కుతో చేసినా, బిజినెస్ అన్న తర్వాత అప్పుడప్పుడూ దెబ్బలు తగులుతుంటాయి. సినిమా బిజినెస్ కూడా అలాంటిదే.
కట్ చేస్తే -
ప్రపంచంలో ఎక్కడైనా సరే... నెలకు వంద వ్యాపారాలు ప్రారంభమవుతే - వాటిలో సక్సెస్ అయ్యేవి 2 నుంచి 5 శాతం మించవు.
తప్పు ఆ వ్యాపారానిది కాదు.
వ్యాపారి అవగాహన, మైండ్‌సెట్.
వ్యాపారి అవగాహన, మైండ్‌సెట్.
సినిమా కూడా ఒక వ్యాపారమే.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani