కథ ఎలా చెబుతున్నావన్నదే పాయింట్...
కంటెంట్ ఈజ్ ద కింగ్ అని మరోసారి రుజువయింది.
#Baby... రాత్రి చూశాను.
సాయి రాజేశ్ కల్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు.
ఇప్పటి యూత్ జీవనశైలిలో చాలా సింపుల్‌గా కొట్టిపారేయాల్సిన ఒక సున్నితమైన అంశం పట్టుకొని ఇంత ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేసి సక్సెస్ చేయడం అంత ఈజీ కాదు. ఏమాత్రం తేడా వచ్చినా కథ వేరేలా ఉండేది.
కట్ చేస్తే -
వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా తన మొదటి సినిమాలోనే ఇంత బోల్డ్ క్యారెక్టర్‌ను ఒప్పుకొని చేయడం, మెప్పించడం అప్రిషియేట్ చెయ్యాల్సిన విషయం. బిగ్ కంగ్రాట్స్ టు వైష్ణవి.
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ బ్లాక్ బస్టర్ టేస్ట్ చూశారు. చాలా సిన్సియర్‌గా కష్టపడ్డారు. కిర్రాక్ సీత ఇప్పుడు సినిమాల్లో ఇంక బాగా బిజీ అవుతుంది. ఈ సినిమా విజయానికి మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ ఆర్ ఆర్ కూడా బాగా సపోర్ట్ చేసింది.
దర్శకుడు సాయి రాజేశ్ మూడేళ్ళు ఈ సినిమా కోసం కష్టపడ్డాడు అంటేనే విషయం అర్థమవుతోంది... కల్ట్ సినిమాలు అంత ఈజీగా రావని!
Congratulations to Director, Producer and Team.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani