ఇరానీ హోటల్. కాఫీ డే.
కేబీఆర్ పార్క్. నెక్లెస్ రోడ్డు.
ఐమాక్స్ లాబీలు. ట్యాంక్ బండ్.
యాత్రి నివాస్. సినీ ప్లానెట్
స్టూడియోలు, ల్యాబ్స్
ప్రివ్యూ థియేటర్లు, పబ్స్... ఈ డిజిటల్ సోషల్ మీడియా యుగంలో... చాలా వ్యాపారాలకు, వృత్తులకు అసలు ఆఫీస్ అవసరం లేదు.
సినిమాలకు కూడా.
కట్ చేస్తే -
ట్రెడిషనల్ పధ్ధతిలో, ఎప్పుడూ ఒకే నాలుగు గోడల మధ్య కూర్చుని పని చేయడానికి ఇప్పుడు ఎవరూ ఇష్టపడటంలేదు.
ముఖ్యంగా... లో అండ్ మిడ్ రేంజ్ సినిమాల విషయంలో ఇప్పుడు ఈ ట్రెండ్ పాక్షికంగానయినా అమలవుతుండటం ఒక మంచి పరిణామం.
కట్ చేస్తే -
ట్రెడిషనల్ పధ్ధతిలో, ఎప్పుడూ ఒకే నాలుగు గోడల మధ్య కూర్చుని పని చేయడానికి ఇప్పుడు ఎవరూ ఇష్టపడటంలేదు.
ముఖ్యంగా... లో అండ్ మిడ్ రేంజ్ సినిమాల విషయంలో ఇప్పుడు ఈ ట్రెండ్ పాక్షికంగానయినా అమలవుతుండటం ఒక మంచి పరిణామం.
సినిమా నిర్మాణానికి సంబంధించిన పని ఏదయినా ఇప్పుడు ఊహించని విధంగా సూపర్ ఫాస్ట్‌గా జరిగిపోతున్న రోజులివి. మొబైల్, వాట్సాప్, ఫేస్‌బుక్, ఈమెయిల్, స్కైప్, జూమ్... ఇలా ప్రతి ఆధునిక మీడియా సాధనం సినిమా నిర్మాణానికి ఏదోరకంగా బాగా ఉపయోగపడుతోంది.
కొత్త నటీనటులు, టెక్నీషియన్ల ఎన్నిక దాదాపు ఆన్‌లైన్ ద్వారానే జరిగిపోతోంది. ఫోటోలు, వీడియో క్లిప్స్ ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్నప్పుడు .. ఇంక ప్రత్యేకంగా ముంబై, ఢిల్లీ లకు వెళ్లాల్సిన అవసరమేలేదు. స్క్రీన్‌టెస్టులంటూ వారాలకి వారాలు అవుటాఫ్ ద సిటీ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు.
షార్ట్ లిస్ట్ చేసుకున్నవాళ్లని చూడ్డానికి మాత్రం ఒక్కసారి మాత్రం డైరెక్ట్ ఆడిషన్ అవసరమౌతోంది. దాని కోసం ప్రత్యేకంగా ఆఫీస్ అవసరం లేదు.
ఇక కథా చర్చలు, మేకింగ్ ప్లానింగ్స్, అన్నీ కాఫీడేల్లో, నెక్లెస్ రోడ్ చెట్లక్రింద, ఐమాక్స్‌లో, కేబీఆర్ పార్కులో, టాంక్‌బండ్ మీదా, బ్యాచిలర్ రూముల్లో, డాబాల మీది పెంట్ హౌజుల్లో... ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా స్మూత్‌గా జరిగిపోతున్నాయి.
కేవలం సినిమా షూటింగ్ సమయంలో మాత్రం ఒక్క నెలపాటు... ఏ గెస్ట్‌హౌజ్ లోనో, లేదంటే... ఓనర్స్ అభ్యంతర పెట్టని ఏ బ్యాచిలర్ పెంట్ హౌస్ లోనో, లేదంటే... ఓ నెల పాటు ఒక ఎయిర్ బి ఎన్ బి ఫ్లాట్ తీసుకొని గాని... పనులు పూర్తిచేసుకోగలిగితే చాలు.
పోస్ట్ ప్రొడక్షన్‌కి మళ్లీ మామూలే. ఎక్కడ పని జరుగుతోంటే అక్కడే అవసరమైన టీమ్ మెంబర్లు వాలిపోతారు. అంతే. ఫైనల్ కాపీ రెడీ!
ఇక - బిజినెస్ కోసం అయితే ఇప్పుడు అసలు ఆఫీసే అక్కర్లేదు! పని, వాళ్ళ ఆఫీసుల్లోనే కాబట్టి మనకు ప్రత్యేకంగా ఆఫీసు అవసరం లేదు.
So...
So...
మనల్ని నిరంతరం డైనమిక్‌గా ఉంచి, ఎనర్జీ లెవెల్స్ పెంచే ఇంతమంచి నేచురల్ లొకేషన్స్‌ని మించిన ఆఫీస్ ఏముంటుంది? ఇలాంటిచోట్ల పనిజరిగినప్పుడే ఆలోచనలు కూడా ఎప్పటికప్పుడు మెరుపుల్లాంటివి వస్తాయి.
పైగా, నెలకో లక్ష రూపాయలు ఆఫీసు మెయింటేన్ చేసే ఖర్చులు మిగుల్తాయి. ఆ లక్షతో హాయిగా ఒక పూట షూటింగ్ చేసుకోవచ్చు.
ఇదంతా హాలీవుడ్‌లో ఎప్పటినుంచో ఉంది, ఇప్పుడూ ఉంది.
కేన్స్ వంటి ఫిలిం ఫెస్టివల్స్‌లోనూ, హాలీవుడ్‌లోనూ సంచలనాలు సృష్టించిన "ఎల్ మరియాచి", "బ్లెయిర్‌విచ్ ప్రాజెక్ట్", "పారానార్మల్ యాక్టివిటీ", "బిఫోర్ సన్‌రైజ్", "ఫర్ లవర్స్ ఓన్లీ", "న్యూలీ వెడ్స్"... వంటి ఎన్నో ఇండిపెండెంట్ సినిమాలకు వాటి నిర్మాణ సమయంలో ఆఫీసుల్లేవు.
మన ఇండియాలో కూడా చరిత్ర సృష్టించిన ఎన్నో సత్యజిత్ రే, గోవింద్ నిహలానీ, మహేశ్ భట్ లాంటి దర్శకుల సినిమాలకు అసలు ఆఫీసులు లేవు. వాళ్ళు ఎక్కడ కలిస్తే అదే ఆఫీసు!
సక్సెస్‌కు, ఆఫీసు లేకపోడానికి అసలు సంబంధం లేదు. ఎన్నో (ఇండిపెండెంట్, క్రౌడ్‌ఫండెడ్, లో, మిడ్ రేంజ్ బడ్జెట్) బ్లాక్ బస్టర్ కమర్షియల్ సినిమాలు ఈ నిజాన్ని ప్రూవ్ చేశాయి.
అంతా జస్ట్ మన మైండ్‌సెట్.
అయితే - ఇక్కడ మనం గొప్పల కోసం షో చేసుకోవటమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఇదంతా ఎవరూ పాటించరు.
కట్ చేస్తే -
నేను "లైక్‌మైండెడ్ టీమ్" అని ఎప్పుడూ నా ఆలోచనలకు సూటయ్యే టీమ్‌ను వెతుక్కుంటూ ఉండటం వెనకున్న కొన్ని అతిముఖ్యమైన కారణాల్లో ఇది ఒకటి.
నాలుగు గోడల మధ్య కూర్చొని - వాడి గురించి వీడి గురించి సొల్లు మాట్లాడుకొంటూ టైమ్ వేస్ట్ చేసుకోవటం కంటే అసలు ఆఫీసు లేకపోవడం బెటర్.
బడ్జెట్ చాలా మిగుల్తుంది. దాన్ని చివర్లో ఫిలిం ప్రమోషన్‌కు వాడుకోవచ్చు.
నేను కూడా త్వరలోనే నా కొత్త "డిజిటల్ ఆఫీసు"కి షిఫ్ట్ అయిపోతున్నాను.
డిజిటల్ ఆఫీసంటే ఇంకేదో కాదు...
ఫోకస్డ్‌గా పనిచేయడానికి పనికిరాని ట్రెడిషనల్ ఆఫీసు లేకపోవడమే డిజిటల్ ఆఫీస్!
ఆఫీసు లేకుండానే మిలియనేర్లు, బిలియనేర్లు అయినవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. అంతర్జాతీయంగా చాలా ప్రొఫెషన్స్‌లో ఇప్పుడిదే ట్రెండ్ నడుస్తోంది.
I almost on the verge of achieving this by the end of this year. 2023.
నేను కూడా త్వరలోనే నా కొత్త "డిజిటల్ ఆఫీసు"కి షిఫ్ట్ అయిపోతున్నాను.
డిజిటల్ ఆఫీసంటే ఇంకేదో కాదు...
ఫోకస్డ్‌గా పనిచేయడానికి పనికిరాని ట్రెడిషనల్ ఆఫీసు లేకపోవడమే డిజిటల్ ఆఫీస్!
ఆఫీసు లేకుండానే మిలియనేర్లు, బిలియనేర్లు అయినవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. అంతర్జాతీయంగా చాలా ప్రొఫెషన్స్‌లో ఇప్పుడిదే ట్రెండ్ నడుస్తోంది.
My dream is to dissolve my office altogether, go paperless, and basically only have my laptop as an office.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani