మన ఖమ్మం నుంచి లండన్ వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. బీవీఆర్ టెక్ పేరుతో సొంతంగా కంపెనీ స్థాపించి, ఇండిపెండెంట్ కన్‌సల్టెన్సీ కూడా చేస్తున్నాడు.
ఇవన్నీ చేస్తూ - ప్రస్తుతం NRI BRS, లండన్ ఇంచార్జ్‌గా కూడా యాక్టివ్‌గా పనిచేస్తున్నాడు.
బి ఆర్ యస్ పార్టీకున్న వేల మంది వాలంటరీ సోషల్ మీడియా వారియర్స్‌లో ఒకరు.
నిగర్వి... ఎలాంటి ఈగోల్లేవు.
లండన్‌లో మంచి పొజిషన్‌లో ఎక్కడో గ్లోబ్‌లో పైనున్నా, పూర్తిగా నేలమీదుండే మనిషి.
కట్ చేస్తే -
మన తెలంగాణ మొత్తం జనాభా సుమారుగా ఒక 4 కోట్లు అనుకుంటే - అందులో కనీసం ఒక 20 శాతం మందికి ఆన్‌లైన్‌లో నిరంతరం టచ్‌లో ఉంటాడు మన నవీన్.
అంత సీనుందా అనకండి... చాలా ఉంది.
ఇవి నేను చెప్తున్న లెక్కలు కావు. మార్క్ జుకెర్‌బర్గ్ "ఫేస్‌బుక్" చెప్తున్న లెక్కలు!
నవీన్ సగటున రోజుకు సుమారు 300+ పోస్టులు ఒక్క ఫేస్‌బుక్‌లోనే పెడుతాడంటే నమ్మగలరా? కాని నిజం.
ఈ పోస్టులన్నీ వందకి వంద శాతం -
కేవలం తెలంగాణ గురించే... కేసీఅర్ గురించే... కేసీఆర్ సాధిస్తున్న అద్భుత విజయాల గురించే. కేసీఆర్ ప్రభుత్వంలోని మంత్రుల నుంచి, కింది స్థాయి వరకు వివిధ స్థాయిల్లోని అధికారులు, ఉద్యోగులు చేస్తున్న పనుల గురించే.
కేటీఆర్ గురించే... పట్టణాభివృద్ధి, ఇండస్ట్రీస్, ఐటి శాఖల మంత్రిగా కేటీఆర్ సాధించి చూపిస్తున్న విజయాల గురించే.
బీఆరెస్ గురించే... ఆ పార్టీ సృష్టిస్తున్న సంచలనాల గురించే. సృష్టించబోయే ప్రకంపనాల గురించే.
ఇవన్నీ పాజిటివ్ పోస్టులే కావడం ఇంకో ప్రత్యేకత.
తెలుగు, ఇంగ్లిష్ న్యూస్‌పేపర్స్ లోంచి, అధికారిక సైట్స్ లోంచి, వివిధ మంత్రిత్వ శాఖల, విభాగాల, కార్పొరేషన్ల అధికారిక సోషల్ మీడియా ఎకౌంట్స్ నుంచి ఉపయుక్తమైన సమాచారం, క్లిప్పింగ్స్ ఎప్పటికప్పుడు తీసుకొంటూ ఈ పని చేస్తాడు నవీన్.
ఈ 18 గంటల్లో ఒక 8 గంటలు తన ఉద్యోగానికి, కన్సల్టెన్సీకి కెటాయించినా... మిగిలేది ఇంకో 10 గంటలే. ఈ 10 గంటల్లో ఒక్క ఫేస్‌బుక్‌లోనే 300 పోస్టులు అంటే, ఒక్కో పోస్టు పోస్ట్ చెయాటానికి సగటున 2 నిమిషాలన్నమాట!
సంవత్సరం క్రిందటే ట్విట్టర్‌లో లక్ష ట్వీట్స్ పైగా చేసి రికార్డ్ క్రియే చేశాడు నవీన్. ఇప్పటికి అవి కూడా లక్షన్నరకు చేరుకునుంటాయి.
ఇన్‌స్టాగ్రామ్‌ను కూడా వదల్లేదు నవీన్.
సోషల్ మీడియాలో నేను ఎప్పుడు ఏ ప్లాట్‌ఫామ్ ఓపెన్ చేసినా... నాకు ఫస్ట్ కనిపించే పోస్టు నవీన్‌దే ఉంటుంది. ఇది నేనొక్కన్ని చెప్పే మాట కాదు. నాతో చాలామంది చెప్పారు.
మా ఆఫీసులో స్టాఫ్ ఒకరు తనకు ఏదైనా "తెలగాణ రియల్ ఎస్టేట్"కు సంబంధించిన కంటెంట్ కావాలంటే వెంటనే భువనగిరి నవీన్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్‌కు వెళ్తాడు!
> గత 28 రోజుల్లో నవీన్ పోస్టుల రీచ్: 10.9 మిలియన్స్!
అంటే - కోటి తొమ్మిది లక్షల మందికి నవీన్ పోస్టులు రీచ్ అయ్యాయి.
> నవీన్ పోస్టులతో ఎంగేజ్ అయినవారి సంఖ్య: 1 మిలియన్!
అంటే - 10 లక్షల మంది నవీన్ పోస్టులను చదవటం, లైకులు కొట్టడం, కామెంట్ చెయ్యటం, షేర్ చెయ్యటం చేశారు!
దీపికా పడుకొనే, ఆలియాభట్, మహేశ్, అల్లు అర్జున్ లాంటి సెలబ్రిటీలకు మిలియన్స్‌లో ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి ఇలాంటి అంకెను కొందరు సెలబ్రిటీలు ఈజీగా రీచ్ కావచ్చు.
కాని, కేవలం ఒక 11,200 మంది ఫాలోవర్స్‌తో ఇన్ని మిలియన్స్‌లో తన పాజిటివ్ పొలిటికల్ & డెవలప్‌మెంటల్ పోస్టుల ద్వారా ప్రజలకు రీచ్ కావడం అనేది అంత చిన్న విషయం కాదు.
ఇదంతా ఒక్క ఫేస్‌బుక్ లోనే.
అది కూడా - గత అక్టోబర్‌లో ప్రొఫెషనల్ మోడ్‌కు మారినప్పటి నుంచి... ఎలాంటి బూస్ట్ లేకుండా!
ఇంకా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ కూడా ఉన్నాయన్నది గమనించాలి.
అది కూడా - గత అక్టోబర్‌లో ప్రొఫెషనల్ మోడ్‌కు మారినప్పటి నుంచి... ఎలాంటి బూస్ట్ లేకుండా!
వందకి వంద శాతం పూర్తిగా ఆర్గానిక్ రీచ్!!
ఇంకా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ కూడా ఉన్నాయన్నది గమనించాలి.
నిస్వార్థంగా, ఒక రోబోలా నవీన్ ఇంత కృషి చేయడం అన్నది అంత సులభమైన విషయం కాదు. అందరూ చేయగలిగేది కూడా కాదు.
కొన్నేళ్ళ క్రితం మేమిద్దరం ఆన్‌లైన్‌లో కనెక్ట్ అయ్యింది కూడా ఈ విషయం నేపథ్యంగానే.
కట్ చేస్తే -
"ఎందుకిదంతా?" అని భువనగిరి నవీన్ కుమార్‌ను ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు.
"ఎందుకిదంతా?" అని భువనగిరి నవీన్ కుమార్‌ను ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు.
తను నమ్మిన ఆశయం కోసం.
తన రాష్ట్రం తెలంగాణ కోసం.
ఇప్పుడు తన దేశం కోసం.
తన రాష్ట్రం తెలంగాణ కోసం.
ఇప్పుడు తన దేశం కోసం.
తనకిష్టమైన నాయకులు -
కేసీఆర్ కోసం,
కేటీఆర్ కోసం...
కొన్ని నెలల్లోనే జరగనున్న ఎలక్షన్స్‌లో - మరొకసారి అద్భుత విజయం సాధించి - ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు హాట్రిక్ సాధించడం కోసం కూడా.
కేసీఆర్ కోసం,
కేటీఆర్ కోసం...
కొన్ని నెలల్లోనే జరగనున్న ఎలక్షన్స్‌లో - మరొకసారి అద్భుత విజయం సాధించి - ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు హాట్రిక్ సాధించడం కోసం కూడా.
ఈ లక్ష్యంతోనే రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూసుకెళ్తున్న మన భువనగిరి నవీన్‌కు ఈ సందర్భంగా నా హార్దిక అభినందనలు.
నవీన్ నా మిత్రుడు కావడం వ్యక్తిగతంగా నాకు గర్వకారణం.
Best wishes, Naveen bhai! You simply rock...
***
నవీన్ గురించి నా బ్లాగ్‌లో ఇంతకు ముందు నేను రాసిన పోస్టులు) 👇🏻
నిరంతరం తెలంగాణం! | ఏ దేశమేగినా, ఎందు కాలిడినా | ఒక కమిట్‌మెంట్... 100,900 ట్వీట్స్!
***
నవీన్ గురించి నా బ్లాగ్‌లో ఇంతకు ముందు నేను రాసిన పోస్టులు) 👇🏻
నిరంతరం తెలంగాణం! | ఏ దేశమేగినా, ఎందు కాలిడినా | ఒక కమిట్‌మెంట్... 100,900 ట్వీట్స్!
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani