నాకు టెన్షన్ ఎక్కువైనప్పుడు ఏదో ఒక కొత్త ఐడియా వస్తుంది.
తర్వాత అది పరమ చెత్త ఐడియా అయినా ఆశ్చర్యం లేదు.
అది వేరే విషయం.
కాని, ఇలాంటి అత్యంత స్ట్రెస్‌ఫుల్ కండిషన్స్‌లో వచ్చిన ఐడియా ఏదైనా వెంటనే ఆచరణలో పెట్టేస్తాను. ఇలా చేయడం వల్ల నాకు ఎంతో కొంత స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది.
సో, ఇప్పటి నా మల్టి టాస్కుల అష్టావధానం నేపథ్యంలో ఇప్పుడే మళ్ళీ ఓ కొత్త ఆలోచన వచ్చింది.
వెంటనే ఈ ఆలోచనను అమల్లో పెట్టబోతున్నాను.
బహుశా రేపటినుంచే.
కట్ చేస్తే -
ఈ ప్రపంచంలో
అత్యంత అసాధ్యమైన పని ఒక్కటే.
మనం ఎన్నటికీ ప్రారంభించని పని!
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani