కట్ చేస్తే -
ఆకాలంలో బుధ్ధుడికి బోధివృక్షం కింద కూర్చున్నప్పుడు 49 రోజుల్లో జ్ఞానోదయం అయిందని చదివాను.
మహానుభావుడు... 49 రోజుల్లోనే సర్వం ఒక అవగాహనకొచ్చింది ఆయనకు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత సింపుల్‌గా అసలు కాని పని.
"ఇంక ఇంతకు మించి మనం నేర్చుకొనేది ఏముంటుంది" అనుకుంటాం. కాని, దాని జేజమ్మలాంటి సిచువేషన్ కూడా వెంటనే వస్తుంది.
"ఈ వ్యక్తిని మించి మనల్ని బాధపెట్టేవారు ఇంక లైఫ్‌లో రారు... వచ్చే పరిస్థితికి మనం ఇంక చోటిచ్చే ప్రసక్తే లేదు" అనుకొంటాం. కాని, తప్పక వస్తారు. మనం ఎదుర్కొంటాం.
ఇవన్నీ అనుభవం మీదే తెలుస్తాయి.
విచిత్రంగా - కొంతమందికి మాత్రం ఈ జ్ఞానోదయం బై డిఫాల్ట్ అయి ఉంటుందనుకొంటాను. అదృష్టవంతులు. వీరి దరిదాపుల్లోకి ఏ నాన్సెన్స్ వ్యక్తులూ, పరిస్థితులూ రాలేవు. అన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళు అంత గుడ్డిగా దేన్నీ నమ్మరు. క్షణాల్లో విషయాన్ని తేల్చేస్తారు.
ఇలాంటివాళ్లంటే నాకు చాలా గౌరవం.
సమయం విలువ వీళ్ళకు తెలిసినంత బాగా 99 శాతం మందికి తెలియదు.
సమయం విలువ వీళ్ళకు తెలిసినంత బాగా 99 శాతం మందికి తెలియదు.
కొంచెం లిబరల్‌గా, మాస్‌గా చెప్పాలంటే - ఇదే లోకజ్ఞానం. లేదా లౌక్యం. ఇదొక్కటి ఉంటే చాలు. ఏ కష్టం మన జోలికి రాదు.
కాని, అంత ఈజీగా ఇది అందరికీ అబ్బదు.
కట్ చేస్తే -
ఎప్పటికప్పుడు ఏదో ఒక వ్యక్తినో, ఒక పరిస్థితినో ఎదుర్కొన్నాక "అబ్బ... ఈ దెబ్బతో జ్ఞానోదయం అయ్యింది" అనుకొంటాము.
కాని అది నిజం కాదు.
మనకు తెలీకుండానే మళ్ళీ మళ్ళీ ఇంకో జ్ఞానోదయం కోసం ఎదురుచూస్తుంటాము.
అందుకే - ఇవ్వాటితో అసలు జ్ఞానానికే గుడ్‌బై చెప్పేశా!
ఇంక గొడవే లేదు... 🙂
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani