యూక్రేన్‌లో ఉన్న నా స్నేహితురాలు, ఆర్టిస్టు, ఇంటర్నేషనల్ మోడల్ కాత్యా ఐవజోవాను రష్యా-యూక్రేనియన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన కొత్తలో క్యాజువల్‌గా ఒక ప్రశ్న అడిగాను...
"మీ రెండు దేశాల మధ్య ఈ గొడవ ఎన్ని రోజులుండొచ్చు?" అని.
"ఇది యుద్ధం... యుద్ధం ముగియడానికి సంవత్సరాలు కూడా పడుతుంది. చెప్పలేం!" అందామె.
కాత్యా మాటల్ని నేను అంత సీరియస్‌గా తీసుకోలేదప్పుడు. కాని, చూస్తుంటే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలై అప్పుడే సంవత్సరం దాటింది!
ఇప్పుడు నా స్నేహితురాలు కాత్యా నేరుగా యుద్ధ క్షేత్రంలో పాల్గొంటోంది. యుద్ధ సమయంలో పైనుంచి రష్యన్ బాంబింగ్స్ జరుగుతుండగానే - వందల కిలోమీటర్లు తానే కారు డ్రైవ్ చేస్తూ - తన కుటుంబాన్ని యూక్రేన్ సరిహద్దులు దాటించి, యూరోప్‌లో దించి, వెనక్కి వచ్చింది.
యుద్ధంలో ఇప్పుడెక్కడుందో తను...
ఏమాత్రం వీలున్నా ఈరోజు నాకు కనెక్ట్ అవుతుంది కాత్యా.
ఏమాత్రం వీలున్నా ఈరోజు నాకు కనెక్ట్ అవుతుంది కాత్యా.
ఏప్రిల్ 22... ఈరోజు కాత్యా పుట్టినరోజు.
కట్ చేస్తే -
యూక్రేనియన్ ప్రెసిడెంట్ వొలదిమిర్ జెలెన్స్‌కీ ప్రెసిడెంట్ కాకముందు... నటుడు, డాన్సర్, కమెడియన్, స్క్రీన్ రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ కూడా!
ఆ తర్వాతే పొలిటీషియన్.
"లవ్ ఇన్ ద బిగ్ సిటీ", "లవ్ ఇన్ వేగాస్", "8 ఫస్ట్ డేట్స్" మొదలైనవి జెలెన్స్‌కీ హీరోగా నటించిన యూక్రేన్ సినిమాలు.
"డాన్సింగ్ విత్ ద స్టార్స్" అనే టీవీ డాన్స్ షోలో డాన్సర్‌గా పోటీలో పాల్గొన్నాడు. "సర్వెంట్ ఆఫ్ ద పీపుల్" అనే టీవీ కామెడీ షోలో కమెడియన్‌గా కూడా నటించాడు జెలెన్స్‌కీ.
తనకున్న ఈ నేపథ్యంతోనే యూక్రేన్‌లో ఒక పాపులర్ ఫిల్మ్ ఆర్టిస్ట్‌గా పాలిటిక్స్‌లోకి ప్రవేశించాడు జెలెన్స్‌కీ.
అన్నట్టు... జెలెన్స్‌కీ భార్య ఒలెనా కియాష్కో ఆర్కిటెక్ట్, స్క్రీన్ రైటర్ కూడా!
ఇంకో గొప్ప విషయమేంటంటే - తను నటించిన కామెడీ సీరియల్ "సర్వెంట్ ఆఫ్ ద పీపుల్" పేరుతోనే 2018 లో పార్టీ స్థాపించి, కేవలం 3 నుంచి 4 నెలల్లోనే... యస్... కేవలం 3 నుంచి 4 నెలల్లోనే - అప్పటివరకు ఉన్న సీనియర్ పొలిటీషియన్ ప్రెసిడెంట్ పిత్రో పరషెంకోను చిత్తుగా ఓడించి యూక్రేన్‌కు 6 వ ప్రెసిడెంట్ అయ్యాడు జెలెన్స్‌కీ!
తర్వాతంతా చరిత్రే.
ఇప్పుడు యూక్రేనియన్ ప్రెసిడెంట్ వొలదిమిర్ జెలెన్స్‌కీ వయస్సు 45.
కట్ చేస్తే -
పాలిటిక్స్‌లో, "తక్కువ సమయం ఉంది .. ఇది సాధ్యం కాదు" అనుకోడానికి వీళ్లేదని చెప్పే ఒక గొప్ప ఉదాహరణ ఇది.
ఇలాంటి ఉదాహరణలు మన దేశంలో కూడా ఉన్నాయి. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో కూడా...
సో - అసెంబ్లీ ఎన్నికలుగాని, పార్లమెంట్ ఎన్నికలు గాని - వీటిలో ఏదైనా సరే, సాధించాలనుకునేవారికి సమయం లేదనుకోవద్దు.
ఇప్పుడు చాలా సమయం ఉంది.
ఇప్పుడు చాలా సమయం ఉంది.
కావల్సింది గట్టి సంకల్పం, సరైన స్ట్రాటెజీ, తిరుగులేని ఎగ్జిక్యూషన్.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani