ఎంతసేపూ పక్క భాషల సినిమాలను పొగుడుతూ, తెలుగు సినిమాలను తిడుతూ కొంతమంది మేధావులు, రచయితలు, సోషల్ మీడియా రచయితలు అతి చెత్త పెస్సిమిస్టిక్ రాతలు రాస్తుంటారు.
రీమేక్స్ కూడా - పింక్ ను పింక్‌లా తీయలేదని, లూసిఫర్‌ను లూసిఫర్‌లా తీయలేదని, నటసామ్రాట్‌లా రంగమార్తాండ తీయలేదనీ... చాలా ఆవేశం, బాధ కక్కేస్తుంటారు.
తెలుగు సినిమాల్లో అది ఉండదనీ, ఇది ఉండదనీ నానా రకాల ఆక్రోశం వెళ్లగక్కుతుంటారు.
సినిమా ప్రధానంగా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా. వినోదాన్నందించే సాధనం.
ఫిలిం మేకర్స్ ఎలా తీయాలనుకుంటారో అలా తీస్తారు సినిమాని. అది ప్రొడ్యూసర్-డైరెక్టర్స్ ఇష్టం. ఎలా తీస్తే డబ్బులొస్తాయని వాళ్ళు భావిస్తారో అలా తీస్తారు. వాళ్ల అంచనాలు ఫెయిలైతే పోయేది కూడా వాళ్ళ డబ్బే, వాళ్ళ పేరే.
వాళ్ళ డబ్బు, వాళ్ళ పేరుని రిస్క్ చేస్తూ వాళ్లకిష్టమైనట్టు సినిమాలు తీసుకుంటారు. చూసేవాళ్ళు చూస్తారు, చూడని వాళ్ళు చూడరు.
ప్రేక్షకులకు, సోకాల్డ్ మేధావులకు, సెల్ఫ్ డిక్లేర్డ్ రివ్యూయర్స్‌కు, సోషల్ మీడియా రైటర్స్‌కు ఆప్షన్ ఉంది... చూడొద్దు అనుకుంటే చూడకుండా ఉండటానికి.
కట్ చేస్తే -
సినిమా తీయడం అంటే ఫేస్‌బుక్‌లో పోస్టుపెట్టినంత ఈజీ కాదు.
ఇలా సోషల్ మీడియాలో "తెలుగు సినిమాలు బాగుండవు" అని వాపోయే మేధావులు, రచయితలు, రివ్యూయర్స్ సంఖ్య చాలా చాలా తక్కువ. చెప్పాలంటే ఒక వంద రెండొందలకు మించదు.
ఇలాంటి వారి ద్వారా తెగే టికెట్స్ సంఖ్య కూడా తక్కువే. అసలా సంఖ్య లెక్కలోకే రాదు.
ఏ తెలుగు సినిమానయితే వీరంతా తక్కువచేసి లాజిక్ లేని రాతలు రాస్తున్నారో... ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు దేశంలోని అన్ని భాషల ఫిలిం ఇండస్ట్రీలు, హాలీవుడ్‌లోని ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీలు, ఫిలిం మేకర్స్ కూడా ఆ తెలుగు సినిమా వైపే చూస్తున్నాయన్న నిజం వీరికి తెలుసా?
వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో - ప్రపంచంలోని ఏ మూలలో ఉన్నవారైనా ఎక్కడి సినిమానైనా చూడొచ్చు. భాష ఇప్పుడసలు సమస్యే కాదు. ఎవరికి నచ్చిన సినిమా వారు చూడొచ్చు.
సినిమా ఇలా తీయాలి, ఇలా ఉండాలి అని చెప్పేవాళ్లు రంగంలోకి దూకవచ్చు. సినిమాలు తీయొచ్చు. టెక్నాలజీ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది. పెద్ద కష్టం కాదు.
కట్ చేస్తే -
సినిమా అనేది ఒక కౌన్సెలరో, లైఫ్ కోచో, ప్రవచనకారో కాదు... చక్కబెట్టడానికి, సందేశాలివ్వడానికి.
అరుదుగా కొన్ని అలా ఫ్లాష్‌లా వస్తుంటాయి. ఎంజాయ్ చెయ్యాలి. అన్ని సినిమాలూ అలాగే, ఆ ధోరణిలోనే ఉండాలనుకోవడంలో అర్థం లేదు.
At the end of the day, filmmaking is a business. Big business.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani