దేశంలోని చాలా రాష్ట్రాల్లో - ఎవ్వరైనా సరే - నయాపైసంత పనిచేస్తే 1000 రూపాయల పని చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. ఎక్కడెక్కడి దొంగ ఫోటోలో తెచ్చిపెట్టి "మేం చేశాం!" అని నిస్సిగ్గుగా చెప్పుకొంటున్నారు.
ఇక్కడ తెలంగాణలో ఎన్నో రంగాల్లో ఎన్నెన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, జాతీయ-అంతర్జాతీయ స్థాయిల్లో మెచ్చుకోబడి గుర్తింపు పొందుతున్న అనేక ప్రాజెక్టులు, పనులు పూర్తిచేసి కూడా - వాటన్నిటి గురించి 10% కూడా పబ్లిసిటీ లేదు.
పబ్లిసిటీ అంటే కేవలం మన సోషల్ మీడియా సర్కిల్స్‌లో మనకి మనం పోస్టులు పెట్టుకోవడం ఒక్కటే కాదు. రాష్ట్రమంతా రీచ్ కావాలి. దేశంలోని ప్రతి ప్రాంతంలోకి చొచ్చుకుపోవాలి.
ఇది చాలా సీరియస్‌గా తీసుకొని ఆలోచించాల్సిన అంశం. వెంటనే ఈ దిశలో 10X స్పీడ్‌లో చర్యలు తీసుకోవడం చాలా అవసరం.
ఇంకో ఆరు నెలల్లోనే ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో - ఈ 2 విషయాల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచనలతో, వ్యూహాలతో... మంత్రి, బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎంత త్వరగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటే అంత మంచిది.
"The best politics is right action."
- Mahatma Gandhi
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani