తను ఎన్నుకున్న విభాగంలో ఏ కొంచెం స్పార్క్ ఉన్నా, సిన్సియర్‌గా... 'కొంచెం స్మార్ట్'గా... ప్రయత్నిస్తే - ప్రతి ఒక్కరికీ తప్పకుండా ఆ 'ఒక్క చాన్స్' దొరుకుతుంది.
ఆ తర్వాత దాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారు... ఆ మొదటి చాన్స్‌తో మరిన్ని అవకాశాలు ఎలా సంపాదించుకొంటారు, ఆ తర్వాత కూడా ఫీల్డులో ఎలా కొనసాగుతారు... ఇవన్నీ ఒక్కొక్కరి పర్సనల్ టాలెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది.
నెట్‌వర్కింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, పాజిటివ్ యాటిట్యూడ్, ఏది ఏమైనా సరే అనుకున్న లక్ష్యం నుంచి ఫోకస్ మరల్చకపోవడం... వంటి కొన్ని బేసిక్ లక్షణాలు అందరికీ ఒకలా ఉండవు.
నిజానికి, 99 శాతం మందికి ఈ లక్షణాలు అసలుండవు.
కాని, ఏ ఫీల్డులో అయినా పైకిరావడానికి ఇవే చాలా ముఖ్యం.
సినీ ఫీల్డులో మరీ ముఖ్యం.
ఈ లక్షణాలన్నీ ఎంతో కొంత ఉండే ఆ ఒక్క శాతం మంది మాత్రమే విన్నర్స్ అవుతారు. వీరిలో కొంతమంది... కనీసం ఆ ట్రాక్‌లోనైనా ఉంటారు.
ఆ ట్రాక్ పేరు... 1% క్లబ్.
ఈ 1% క్లబ్‌లో చేరగల సత్తా ఉన్నవారే అనుకున్నది సాధించగలుగుతారు. ఆ ప్రయత్నంలో పడిపోయినా మళ్ళీ లేస్తారు. లక్ష్యం సాధిస్తారు. గమ్యం చేరుకుంటారు.
ఒక్క సినిమా ఫీల్డు అనే కాదు... ఏ ఫీల్డులో అయినా సరే, విన్నర్స్ ఎప్పుడూ ఆ 1% క్లబ్ లోంచే వస్తారు...
కట్ చేస్తే -
థాంక్స్ టు కరోనా... ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు చాలా పెరిగాయి. ఒక్క కొత్తవారికనే కాదు. ప్రతి ఒక్కరికీ అవకాశాలు పెరిగాయి.
ఉదా: ఓటీటీలు, వెబ్ సీరీస్‌లు.
రెమ్యూనరేషన్స్ పరంగా కూడా... ఒకప్పుడు వేలల్లో ఉన్నవి ఇప్పుడు లక్షల్లోకి చేరుకున్నాయి.. లక్షల్లో ఉండేవి ఇప్పుడు కోట్లల్లోకి ఎగిశాయి.
ఇంతకు ముందు సినిమాలు వేరు, ఇప్పుడు సినిమాలు వేరు.
Content is king. Money is the ultimate goal.
ఓవర్‌నైట్‌లో సెలబ్రిటీ స్టేటస్ తెచ్చిపెట్టగల ఒక పాష్ ప్రొఫెషన్.
సరిగ్గా ఉపయోగించుకోగలిగిన అతి కొద్దిమందికి... ఒక ఎలైట్ వరల్డ్.
ఓటీటీల్లో రెగ్యులర్‌గా సినిమాలు, వెబ్ సీరీస్‌లు చూడ్డం అనేది కూడా ఇప్పుడు దాదాపు ప్రతి ఇంటా ఒక మామూలు రొటీన్ అయిపోయిన నేపథ్యంలో చాలా విషయాలు అందరికీ తెలుస్తున్నాయి.
థాంక్స్ టు సోషల్ మీడియా... ఫిలిం ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, ఇతర సెలెబ్స్ అంతా మరింత దగ్గరైపోయారు.
చాలా విషయాల్లో అందరూ రియలైజ్ అవుతున్నారు. చాలా విషయాలు అందరికీ అవగాహనకొస్తున్నాయి.
'థంబ్‌నెయిల్ బ్యాచ్' ల ఫేక్ కంటెంట్ ఏంటి, రియాలిటీస్ ఏంటి అన్నది చాలామంది తెలుసుకోగలుగుతున్నారు.
ఈ నేపథ్యంలో... సినిమాల పట్ల, సినీఫీల్డు పట్ల చాలామందిలో ఒకప్పటి దృక్పథాలు చాలా చాలా మారిపోయాయి.
సినిమాల్లోకి ప్రవేశించడానికి గాని, పంపించడానికి గాని ఇంతకుముందులా ఇప్పుడెవ్వరూ పెద్దగా సంకోచించట్లేదు.
డబ్బు, క్రేజ్, పాపులారిటీ ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు?
నిజానికి సినిమా ఫీల్డు ఎప్పుడూ మంచిదే. సాధించగలిగేవాడికి ఇదొక మెకన్నాస్ గోల్డ్.
వాడుకున్నోనికి వాడుకున్నంత!
దాని స్ట్రక్చర్ తెలుసుకొని, దానిలో ఇమడగలగటం ముఖ్యం.
ఫీల్డులోకి సరైన ఎంట్రీ ముఖ్యం. నా "ఇన్-ఫిలిం కోచింగ్" కాన్‌సెప్ట్ ద్వారా ఆ ఎంట్రీ నేనిస్తున్నాను.
"Be bold.
Either you will find a way,
or you will create a way.
But you will not create an excuse!"
- Manohar Chimmani
https://www.manoharchimmani.blog/p/books.html
https://www.manoharchimmani.blog/p/books.html
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani