ఎల్లుండి - 22 డిసెంబర్ నుంచి కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం) లో ప్రారంభం కానున్న 35 వ హైద్రాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ ఈసారి మరింత ఆసక్తికరంగా ఉండబోతోంది.
మొత్తం 340 స్టాల్స్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా - తమిళనాడు, కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పబ్లిషర్స్, పుస్తక విక్రేతలు పాల్గొంటున్నారు.
11 రోజులపాటు ఒక పండుగలా జరిగే ఈ బుక్ ఫెస్టివల్‌లో ఇప్పటివరకు ఉన్న సందర్శకుల రికార్డు 10 లక్షలు. ఈ రికార్డు ఈసారి బ్రేక్ అయ్యే అవకాశాలున్నాయి.
బై ది వే - ఈ గ్రాండ్ గాలా బుక్ ఫెయిర్‌ను మన ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తున్నారు!
బై ది వే - ఈ గ్రాండ్ గాలా బుక్ ఫెయిర్‌ను మన ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తున్నారు!
కట్ చేస్తే -
రచయితలకు కూడా ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు బుక్ ఫెయిర్ అధ్యక్షులు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ చెప్పారు.
రచయితలకు కూడా ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు బుక్ ఫెయిర్ అధ్యక్షులు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ చెప్పారు.
ఇక, కేసీఆర్ గారి మీద వచ్చిన పుస్తకాల కోసం ప్రత్యేకంగా "మన ముఖ్యమంత్రి స్టాల్" పేరుతో ఒక ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటుచేస్తున్నారు.
ఇటీవలే గౌరవ మంత్రి కేటీఆర్ లాంచ్ చేసిన నా పుస్తకం "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" కూడా ఈ స్టాల్‌లో లభిస్తుంది.
నా మిత్రుడు, సీనియర్ జర్నలిస్టు, పాలపిట్ట లిటరరీ మ్యాగజైన్ ఎడిటర్, గుడిపాటి "పాలపిట్ట బుక్స్" స్టాల్‌లో కూడా కూడా ఈ పుస్తకం లభిస్తుంది.
నా మిత్రుడు, సీనియర్ జర్నలిస్టు, పాలపిట్ట లిటరరీ మ్యాగజైన్ ఎడిటర్, గుడిపాటి "పాలపిట్ట బుక్స్" స్టాల్‌లో కూడా కూడా ఈ పుస్తకం లభిస్తుంది.
కిండిల్ లాంటి ఇతర ఎన్నో రకాల డిజిటల్ బుక్స్ వచ్చినప్పటికీ... పుస్తకం పుస్తకమే. ఆ టచ్ లేకుండా చదివిన ఆనందం వుండదు. అందుకేనేమో - అమెజాన్ వంటి భారీ ఆన్‌లైన్ స్టోర్స్‌లో ఇప్పటికీ డిజిటల్ బుక్స్ కన్నా ఫిజికల్ బుక్స్ అమ్మకాలే ఎక్కువ!
వచ్చే 11 రోజుల్లో కనీసం ఒక రెండు సాయంత్రాలు బుక్ ఎగ్జిబిషన్లో గడపడానికి నాలాంటి పుస్తకప్రియులంతా రెడీ అవుతున్నారు.
మరి మీరో?
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani