Saturday, 10 December 2022

కేసీఆర్ మరొక బృహత్తర యజ్ఞం!



టీఆరెస్ ప్రారంభంలో కూడా ఇలాగే కేసీఆర్‌ను, తెరాసను చాలా కామెంట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించే ముందువరకు కూడా చాలా దారుణంగా ఎగతాళి చేశారు.

తర్వాతేమైంది? 

బీఆరెస్ విషయంలో అంతకు 29 రెట్లు ఉంటుంది ఎగతాళి, కామెంట్స్ ధాటి.  

అందులో పెద్ద వింతేం లేదు. ఎవరు చేసేపని వాళ్ళు చేస్తారు. వాళ్లకు చేతనైంది అది... అంతే.  

కట్ చేస్తే - 

ఎవరో ఒకరు, ఎక్కడో ఒక ప్రారంభం అయితే జరగాలి కదా... 

అందుకే మరొక బృహత్తర యజ్ఞం తలపెట్టారు కేసీఆర్. 

ఈసారి దేశం కోసం.   

ఇలాంటి ప్రారంభమే 2001లో ఆనాడు జలదృశ్యంలో కేసీఆర్ చేయకుండివుంటే ఈరోజు తెలంగాణ ఉండేదా? 

అలాంటి సంకల్పంతోనే - దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పు, సమాఖ్య స్పూర్తి లక్ష్యంగా - ఇప్పుడు కేసీఆర్ సిద్ధమయ్యారు.

ఈ నేపథ్యంలోనే నిన్న తెలంగాణ భవన్‌లో బీఆరెస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. రేపు 14 డిసెంబర్ నాడు భారత రాష్ట్ర సమితి (బీఆరెస్) ఆఫీసు భారత రాజధాని ఢిల్లీలో ప్రారంభం కాబోతోంది. 

గూస్‌బంప్స్ కదా... 

అబ్ కీ బార్... కిసాన్ సర్కార్! 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani