కట్ చేస్తే -
ఇంకో 26 రోజుల్లో 2022 ముగుస్తోంది. మళ్ళీ న్యూ ఇయర్, న్యూ రిజొల్యూషన్స్ వగైరా మామూలే.
అయితే - ఆ రొటీన్ హడావిడి కంటే ముందు ఒక్క 20 నిమిషాల సమయం తీసుకొని - ఎలాంటి డిస్టర్బెన్స్ లేని ఒక చోట కూర్చొని - మొబైల్ స్విచ్చాఫ్ చేసి - ఒక చిన్న రివ్యూ చేసుకోవచ్చు.
నిజంగా పెన్నూ, పేపర్ పట్టుకొని కూర్చుంటే 10 నిమిషాలైనా సరిపోతుంది.
2022 లో, ఈ రోజువరకు, (1) పర్సనల్‌గా - (2) ప్రొఫెషనల్‌గా - (3) సోషల్‌గా... మనం ఏం సాధించాం?
అవి భారీ విజయాలే కానక్కర లేదు. మనకు సంతోషాన్నిచ్చే ఏ చిన్న అంశమైనా కూడా కావచ్చు.
మన జీవితంలోని ఈ మూడు ముఖ్యమైన విభాగాల్లో - మనం గుర్తుపెట్టుకొనే స్థాయి వున్న, మనకు ఆనందాన్నిచ్చిన, మన పర్సనల్ గ్రోత్‌కి ఉపయోగపడిన విజయం... కనీసం ఒక్కొక్కటి వున్నా ఫరవాలేదు.
ఖచ్చితంగా వుంటాయి.
అలాగే ఒక్కో బాధాకరమైన అంశం కూడా ఉండొచ్చు. వాటి గురించి కూడా రివ్యూ చేసుకోవడం అవసరం.
ఈ రివ్యూ ఉంటే రేపు 2023 ఆటొమాటిగ్గా బ్రహ్మాండంగా వుంటుంది.
చలో, టైమర్ సెట్ చేసుకొని, మొబైల్ స్విచ్చాఫ్ చెయ్యండి... జస్ట్ 20 నిమిషాలు...
ఆల్ ది బెస్ట్!
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani