ఓ పదిరోజుల కిందటి యూట్యూబ్ వీడియో ఇప్పుడే చూశాను. అందులో ఏబియన్ చానెల్ న్యూస్‌కాస్టర్ చెప్పిందే చెప్తూ చాలా బాధపడిపోతున్నాడు... అతని పేరు వెంకటకృష్ణ అనుకుంటాను.
ఈడీ రిమాండ్ రిపోర్ట్ అట... మొత్తం 36 మంది అట... 170 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారట. ఆ ఫోన్లన్నిటి విలువ కోటి ముప్పై ఎనిమిది లక్షలట.
వాటిల్లో ఎమ్మెల్సీ కవిత 2 నంబర్స్ ఉన్నాయట... ఆ 2 నంబర్లను 10 ఫోన్లలో వాడారట. ఆ పది ఫోన్లను కవిత ధ్వంసం చేశారట.
నంబర్లూ వున్నాయి, ఆ 170 మొబైల్ ఫోన్ల IMEI నంబర్స్ కూడా ఉన్నాయి.
ఇంక సమస్యేముంది? మొత్తం ఈ వ్యవస్థలన్నీ వాళ్ళ జేబుల్లోనే కదా వున్నాయి? చట్టం తన పని తాను చేసుకుపోతుంది కదా?
ఈ స్క్రిప్ట్ అంతా నిజంగా నిజమైతే - ఉన్న ఆధారాల నుంచి డేటా తీయటం అంత కష్టం కాదని నిపుణులు చెప్తూనే వున్నారు. అయినా, వీళ్ళు పాడిందే పాడుతున్నారు.
కట్ చేస్తే -
ఈ టెక్నికల్ అంశాలన్నీ సామాన్య జనానికి తెలియదు. పట్టించుకోరు.
సామన్య జనం బుర్రల్లో విషం ఎక్కించాలి. వాళ్ళ దృష్టిలో కొందరిని అన్‌పాపులర్ చెయ్యాలి. మైండ్ గేమ్ ఆడాలి.
అదే చేస్తున్నారు.
ఈ విషయంలో వాళ్ళు చాలా ఈజీగా సక్సెస్ సాధిస్తున్నారు.
గత 8 ఏళ్ళుగా బీజేపీ సక్సెస్ టెంప్లేట్ ఇదే...
పచ్చి అబద్ధాలను క్రియేట్ చేయటం! వాటిని ప్రచారం చేయటం!!
దీనికి వెంటనే అత్యంత జాగ్రత్తగా చెక్ పెట్టాల్సిన అవసరం చాలా వుంది. అది, కేవలం ఏ ఒక్కరి పేరో కాపాడటం కోసం మాత్రమే కాదు... మొత్తం దేశాన్ని కాపాడుకోవడం కోసం.
మూడోసారి కూడా దేశం ఇలాంటి ప్రమాదంలో పడకుండా ఉండటం కోసం.
ఈ పనిచేయగల సమర్థుడు ఇప్పుడు దేశంలో ఒక్కరే ఉన్నారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నారు.
ఆ ఒక్కరు ఎవరో మీకు తెలుసు.
కల్వకుంట్ల చంద్రశేఖరరావు...
కేసీఆర్.
కల్వకుంట్ల చంద్రశేఖరరావు...
కేసీఆర్.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani