మిస్టర్ ఇండియా సినిమాలో అనిల్ కపూర్ వేసుకున్న షర్టు, ప్యాంటు, కోటు, టోపీలను న్యాచురల్‌గా ఉండాలని ముంబై చోర్ బజార్లో కొనుక్కొచ్చారట.
అదొక్కటే డ్రెస్. అలాంటివే రెండు మూడు డ్రెస్‌లు చోర్ బజార్లో దొరకలేదు.
ఆ ఒక్క డ్రెస్‌నే అనిల్ కపూర్ షూటింగ్ అయిపోయేదాకా వేసుకున్నాడట. సుమారు 5 ఏళ్లయినా - ఆ డ్రెస్ ఇంకా అనిల్ కపూర్ అల్మరాలో ఉంది. 35 ఏళ్ళ తర్వాత ఇప్పుడు కూడా ఆ డ్రెస్ అనిల్ కపూర్‌కు సరిపోతుంది. అప్పుడప్పుడూ వేసుకొని చూసుకుంటాట్ట.
అనిల్ కపూర్ ఫిట్‌నెస్ అలాంటిది!
తాత అయినా - 35 ఏళ్ళ క్రితం ఎలా వున్నాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడు.
తాత అయినా - 35 ఏళ్ళ క్రితం ఎలా వున్నాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడు.
కట్ చేస్తే -
ఇవ్వాళ అనిల్ కపూర్ పుట్టినరోజు.
గొప్ప విషయం ఏంటంటే - అనిల్ కపూర్ హీరోగా పరిచయమైన తొలిచిత్రం ఒక తెలుగు సినిమా.
వంశవృక్షం.
పరిచయం చేసింది మన దర్శకుడు బాపు.
ఫిట్‌నెస్ విషయంలో నన్ను ఇన్‌స్పైర్ చేసే అతికొద్దిమందిలో అనిల్ కపూర్ ఒకరు. ఇప్పుడతని వయస్సు 66.
I wish Anil Kapoor a very happy birthday.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani