పై వాక్యాన్ని ఎంత బాగా నమ్ముతానో, అంత కంటే బాగా నేను నమ్మే నిజం ఇంకోటి కూడా ఉంది.
అది .. మనకు తెలియని ఏదో ఒక "శక్తి".
ఆ శక్తి లేకుండా మనమంతా లేము. మన చుట్టూ ఉన్న ఈ అద్భుతమైన ప్రకృతీ లేదు.
ఆ శక్తి రూపం మనకు తెలియదు. ఆ శక్తి ఉద్దేశ్యం ఏంటో కూడా మనకు తెలియదు.
ఎవరికి వారు ఏదో ఒక పేరు పెట్టుకొని ఆ శక్తిని నమ్మడంలో తప్పేమీ లేదు. ఇంకొకరిని ఇబ్బంది పెట్టనంతవరకూ నిజంగా అదొక మంచి డిసిప్లిన్.
నేను కన్వీనియెంట్‌గా ఫీలయ్యి, నాకు నచ్చిన ఒక పేరుతో, ఆ శక్తిని నేనూ నమ్ముతున్నాను. అది వేరే విషయం. దాని గురించి మరోసారి వివరంగా రాస్తాను.
ఇదంతా ఎలా ఉన్నా .. శతాబ్దాలుగా చాలా మంది మహామహులైన రచయితలు, తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, మేధావులమనుకున్నవారి విషయంలో నేను చదివి తెలుసుకొన్న, ఇటీవలికాలంలో వ్యక్తిగతంగా గమనించిన పచ్చి నిజం కూడా ఇంకోటుంది.
అసలు దేవుడు అన్న కాన్‌సెప్ట్‌నే నమ్మకుండా, జీవిత పర్యంతం విశృంఖలంగా గడిపిన ఎందరో చివరికి ఏదో ఒక ఆధ్యాత్మిక ఆశ్రమంలో చేరిపోయారు!
సో, మళ్లీ మనం కొత్తగా ఒక చక్రాన్ని కనిపెట్టాల్సిన అవసరం లేదు. అనుభవం మీద అన్నీ మనకే తెలుస్తాయి.
అందుకే ఈ విషయంలో అనవసరంగా లాజిక్కుల జోలికి పోవడం వృధా.
ఆ సమయాన్ని మరోవిధంగా సద్వినియోగం చేసుకోవడం బెటర్.
కట్ టూ "కాజ్ అండ్ ఎఫెక్ట్" -
'జీవితం వైరుధ్యాలమయం' అంటారు.
ఇంత చిన్న బ్లాగ్‌లో పైన రాసిన పది వాక్యాల్లోనే ఎన్నో వైరుధ్యాలున్నాయి. అలాంటప్పుడు - మన జీవితంలోని ప్రతి దశలోనూ, ఆయా దశల్లోని మన ఎన్నో ఆలోచనల్లోనూ కొన్నయినా వైరుధ్యాలు తప్పక ఉంటాయి.
వాటిల్లో చాలావాటికి కారణాలుండవు. ఒకవేళ ఉన్నట్టు అనిపించినా, అవి బయటికి కనిపించేవే తప్ప అసలు కారణాలు కాకపోవచ్చు.
అలాంటి ఎన్నో వైరుధ్యాల మధ్య, గత కొన్నేళ్లుగా, నా జీవితం కూడా ఊహకందని కుదుపులతో నడుస్తోంది. లాజిక్కులకందని కల్లోలాలతో కొనసాగుతోంది.
వ్యక్తిగతం, వృత్తిగతం, ఆర్థికం, సాంఘికం, ఆధ్యాత్మికం .. అన్నీ.
ఎందరివల్లో ఎన్నో ఊహించని బాధలు పడ్డాను. కోలుకోలేని ఎదురుదెబ్బలు తిన్నాను. ఫలితంగా, నాకు అతిదగ్గరివాళ్లయిన కొందరు మిత్రులు, బంధువులు ఏదోవిధంగా, ఏదో ఒక స్థాయిలో బాధపడ్డానికి కూడా పరోక్షంగా నేను కారణం అయ్యాను.
అయినా సరే - ఈ ప్రపంచం "కాజ్ అండ్ ఎఫెక్ట్" సూత్రం మీదే ఎక్కువగా నడుస్తుందని నేను ఇప్పటికీ నమ్ముతాను.
అయితే, ఎన్నోసార్లు నేను వేగంగా గోడకు విసిరికొట్టిన బంతి అంతే వేగంగా వెనక్కి తిరిగిరాలేదు. ఆశ్చర్యంగా ఆ గోడకి బొక్కచేస్తూ బంతి బయటికి వెళ్లిపోయింది!
దీన్ని ఏ లాజిక్ ఒప్పుకుంటుంది?
ఎవరు నమ్ముతారు?
కానీ గత కొన్నేళ్లుగా నా జీవితంలో జరుగుతున్న నిజం మాత్రం ఇదే.
బట్, ఈరోజు నుంచి సీన్ మారబోతోంది. "కాజ్ అండ్ ఎఫెక్ట్" సూత్రం మీద నాకున్న నమ్మకంతోనా, లేదంటే ఆ నమ్మకం నాలో ఏర్పడటానికి కూడా కారణమైన ఆ "శక్తి" తోనా?
నాకు తెలీదు.
సీన్ మాత్రం ఈరోజు నుంచే మారబోతోంది.
పూర్తిగా, పాజిటివ్‌గా ..
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani