మనిషిని "సోషల్ యానిమల్" అన్నాడో తత్వవేత్త.
సంఘంలోని ఇతర వ్యక్తుల ప్రమేయం లేకుండా ఏ ఒక్కడూ ఉన్నత స్థాయికి ఎదగలేడు. కనీసం బ్రతకలేడు.
ఇది ఎవ్వరూ కాదనలేని నిజం.
మనం ఎంచుకున్న ఫీల్డులో ఉన్నత స్థితికి ఎదగడానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంఘంలోని ఎంతోమంది సహకారం - లేదా - ప్రమేయం మనకు తప్పనిసరి.
ఈ వ్యక్తులే మన నెట్ వర్క్.
మన నెట్‌వర్క్ ని బట్టే మనం చేసే పనులు, వాటి ఫలితాలు ఉంటాయి. మన నెట్ వర్క్ లో సరయిన వ్యక్తులు లేకుండా ఫలితాలు మాత్రం సరయినవి కావాలంటే కుదరదు.
మనకు పనికి రాని నెగెటివ్ థింకర్స్, మనల్ని వాడుకుని వదిలేసే ముదుర్లు, మన సహాయంతోనే ఎదిగి, మనల్నే వేలెత్తి చూపే మోసగాళ్లు... ఇలాంటి జీవాలు ఏవయినా ఇప్పటికే మన నెట్‌వర్క్ లో ఉంటే మాత్రం వాటిని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది.
ఇలా చెప్పటం చాలా ఈజీ. కానీ, ఈ జీవుల్ని గుర్తించటానికి కొన్ని అనుభవాలు, కొంత టైమ్ తప్పక పడుతుంది. అయినా సరే, తప్పదు.
ఈ విషయంలో ఎలాంటి మొహమాటాలకు పోయినా జీవితాలే అతలాకుతలమైపోతాయంటే అతిశయోక్తికాదు.
అలాంటి అనుభవాలు ఒక్క సినీ ఫీల్డులోనే నేను ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చింది.
మహా కవి శ్రీ శ్రీ అన్నట్టు, "ఇంకానా ఇకపై చెల్లదు!"
ఇంక ఎలాంటి మొహమాటాల్లేవు.
ముఖ్యంగా, ఇప్పుడు నేను ప్రారంభించబోతున్న కొత్త సినిమాలు, వెబ్ సీరీస్, ఈవెంట్స్, వర్క్‌షాప్స్ మొదలైనవి వ్యక్తిగతంగా నాకెంతో ప్రతిష్టాత్మకమైనవి.
ఇంకో విధంగా చెప్పాలంటే ఒక పెద్ద ఛాలెంజ్. ఇంక ఇలాంటి సమయంలో కాంప్రమైజ్, మొహమాటం అనేవి ఎలా సాధ్యం?
వాటికి స్థానం లేదు. ఉండదు.
కట్ టూ మన నెట్‌వర్క్ -
ఏ చిన్న పనిలోనయినా సరే, ఎంత చిన్న లక్ష్యమయినా సరే, ఎంతో పెద్ద గోల్ అయినా సరే - సక్సెస్ సాధించాలనుకొనే ప్రతి ఒక్కరూ - తమకు ఉపయోగపడే నెట్‌వర్క్ ను నిరంతరం పెంచుకుంటూ ఉండాలి.
ట్విట్టర్, ఫేస్‌బుక్ ఈ విషయం లో చాలా ఉపయోగపడతాయి.
ఇంకెన్నో ఉన్నా కూడా, ఈ రెండే బాగా పాపులర్ అని నా ఉద్దేశ్యం.
ఊరికే లైక్ లకు, కామెంట్లకు మాత్రమే సమయం వృధాచేయకుండా ఈ కోణంలో కూడా ఫేస్‌బుక్ ని ఉపయోగించటం అలవాటు చేసుకోవటం చాలా మంచి అలవాటు అవుతుంది.
ఈ వాస్తవాన్ని మనం ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది అని ప్రత్యేకంగా చెప్పటం అవసరమా?

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani