Sunday, 30 March 2025

కమర్షియల్ హిట్ సినిమాలు వేరు. గొప్ప సినిమాలు వేరు...


సిడ్నీ లుమెట్ అనే ఒక హాలీవుడ్ డైరెక్టర్ ఒక మాట చెప్పారు... 

"గొప్ప సినిమాలనేవి వాటికవే సంభవిస్తాయి. నువ్వు 'నువ్వు అనుకున్న సినిమా' -లేదా- 'నువ్వు రాసుకున్న సినిమా' మాత్రమే డైరెక్ట్ చేస్తావు. గొప్ప సినిమాలని డైరెక్ట్ చెయ్యలేవు!" 

ఫర్ ఎగ్జాంపుల్... మణిరత్నం "గీతాంజలి" తీశారు. అంత గొప్ప లవ్ స్టోరీ ఆయన మళ్ళీ తీయగలగాలి కదా? తీశారా? అది ఆయన చేతుల్లో లేదు. 

ఇంకో ఎగ్జాంపుల్ ఆర్జీవీ. "సత్య" అనే గొప్ప సినిమా ఆయన చేశారు. అంత గొప్ప సినిమా మళ్ళీ తీయలేదెందుకు ఆర్జీవీ? 

దటీజ్ ద పాయింట్. 

గొప్ప సినిమాలనేవి వాటికవే తయారవుతాయి. దె జస్ట్ హాప్పెన్. డైరెక్టర్స్ మామూలుగా సినిమాలు చేస్తారు అంతే.  

కట్ చేస్తే -

కమర్షియల్ హిట్ సినిమాలు వేరు. గొప్ప సినిమాలు వేరు. 

- మనోహర్ చిమ్మని 

Thursday, 27 March 2025

అసలు అంత చిన్న పాత్ర చెయ్యాల్సిన అవసరమేంటి అనుపమకు?


ప్రదీప్ రంగనాథన్ హీరోగా, అశ్వత్ మరిముత్తు డైరెక్ట్ చేసిన మొన్నటి "డ్రాగన్" సినిమాలో అనుపమ పరమేశ్వరన్ చేసిన పాత్ర పర్సనల్‌గా నాకు అస్సలు నచ్చలేదు. 

మంచి వెయిట్ ఉన్న పాత్ర కదా అనొచ్చు ఎవరైనా. కాని, సినిమాలో అనుపమ క్యారెక్టర్‌కు అంత నిడివి లేదు. ఎడిటింగ్‌లో కూడా కుదించారేమో, చెప్పలేం. టీజర్, ట్రయలర్ అండ్ ప్రమోషన్స్‌లో కూడా ఇంకో కొత్త హీరోయిన్ కాయదు లోహార్‌కు ఇచ్చినంత ఇంపార్టెన్స్ అనుపమకు ఇవ్వలేదు. 

ఇంత రిస్క్ తీసుకొని, ఇద్దరు హీరోయిన్స్ ఉన్న ఆ చిత్రాన్ని అనుపమ చేయటం అనేది ఏ రకంగా చూసినా, ఇన్ మై హంబుల్ ఒపీనియన్, తప్పు నిర్ణయమే. 

కట్ చేస్తే -

అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా - ముంబై నుంచి ఒక కొత్త హీరో ఆమెకు జంటగా - ఒక మంచి క్లాసిక్ లవ్ స్టోరీ డైరెక్ట్ చెయ్యాలనుకుంటున్నాను.        

ఈ సబ్జెక్ట్ కోసం నా దృష్టిలో ఇంకో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా, టాప్ ప్రయారిటీలో నేను అనుపమనే అనుకోడానికి రెండు కారణాలున్నాయి: 

మొదటి కారణం... 2015 లో తన డెబ్యూ సినిమా "ప్రేమమ్" నుంచి మొన్నటి "డ్రాగన్" వరకు సుమారు 30 సినిమాల్లో నటించిన అనుపమ పరమేశ్వరన్‌లో అందం పెరిగిందే తప్ప తగ్గలేదు. అనుపమ అంటే ఆడియెన్స్‌లో క్రేజ్ కూడా ఇంకా ఇంకా పెరిగింది.  

రెండోది... అనుపమ యాక్టింగ్ నాకు యాక్టింగ్‌లా అనిపించదు. సెక్సీ వాయిస్ అండ్ లుక్స్. అండ్... అయామ్ హర్ ఫ్యాన్. 

- మనోహర్ చిమ్మని  

Monday, 24 March 2025

1% క్లబ్ అంత ఈజీ కాదు!


"Most of us aren’t the same person every year." 

మనతో కలిసి పనిచేసేవాళ్ళ తాజా వర్కింగ్ స్టయిల్ని బట్టే మన ప్లాన్ ఉండాలన్నది నేను నేర్చుకొన్న కొత్త పాఠం.

మనం ఏదో ఉరుకుతామంటే కుదరదు. మన అంచనాలకు అందకుండా - మనల్ని వెనక్కి లాగే ఫాక్టర్స్ చాలా ఉంటాయి. 

కట్ చేస్తే - 

ఇప్పుడు ఫీల్డులో నిలదొక్కుకున్నవాళ్లలో 99% మంది ఇలాంటివి ఎన్నో తట్టుకున్నవాళ్ళే అన్నది వాస్తవం. వాళ్లకిదే ప్రపంచం కాబట్టి తప్పదు. తట్టుకున్నారు, సాధించారు. కాని, ఈ నేపథ్యంలో వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని త్యాగాలు చేశారో, ఎంత జీవితం కోల్పోయారో ఎవరికి తెలుసు?    

అలాంటి "డూ ఇట్ నౌ" మైండ్‌సెట్ టీమ్‌లో ప్రతి ఒక్కళ్ళకీ ఉండాలన్నది నా పాయింట్. కాని, ఉండదు.

మన టీమ్‌లోనివాళ్ళు, బయటివాళ్ళు, మనకు అసలు సంబంధం లేనివాళ్ళు... వీళ్లందరి వ్యక్తిగత ఆలోచనావిధానం, జీవనశైలి మన అంచనాల్ని, మన నిర్ణయాల్నీ శాసిస్తుంటాయి. 

పరోక్షంగా వీళ్లందరి నిర్ణయాల మీద మన ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది!        

అంతకంటే దారుణం లేదు. అంత సమయం నేను వృధా చేసుకోలేను.  

ఒక అద్భుతమైన ఫీల్డుని చెత్త ఫీల్డు అని బయటివాళ్ళు అనుకునేలా చేసే ఫాక్టర్స్ వేరే ఉంటాయి. ఆ ఫాక్టర్స్ వల్లనే ఎవరైనా బాధపడేదీ, ఎదుటివాళ్లను బాధపెట్టేదీ. 

ఈ వాస్తవాన్ని గుర్తించినవాళ్ళే సినిమాను ప్రేమిస్తారు.  సినిమాల్లో ఉంటారు. 

- మనోహర్ చిమ్మని 

Wednesday, 19 March 2025

భారీగా డబ్బు, ఫేమ్, కాంటాక్ట్స్ మాత్రమే కాదు...


కొంతమంది ఉద్యోగం ఉంటే చాలు, ప్రాణంతో ఉన్నట్టుగా ఫీలవుతారు. కొంతమంది అది ఎంత మంచి ఉద్యోగమైనా సరే, ఎప్పుడెప్పుడు దాన్నుంచి బయటపడదామా అని చూస్తుంటారు. 

యువన్ శేఖర్ రెండో రకానికి చెందిన యువకుడు. 

టెస్టింగ్ టూల్స్ విభాగంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా మంచి జీతం, ఒక రేంజ్ పొజిషన్‌లో ఉన్నప్పుడే ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి ఎంట్రప్రెన్యూర్‌గా రంగప్రవేశం చేశాడు శేఖర్. 

రియల్ ఎస్టేట్, రొయ్యల చెరువులు, వైన్స్, స్టాక్స్... ఇలా కనిపించిన ప్రతిచోటా ఇన్వెస్ట్ చేస్తూ వ్యాపార రంగంలో ముందుకురికాడు. కొన్ని కలిసొచ్చాయి, కొన్ని ఎదురు దెబ్బ కొట్టాయి. 

అయినా సరే, పెద్దగా భయపడలేదు. షేక్ అవ్వలేదు. ముందుకే నడవాలనుకున్నాడు. 

ఇంకేదైనా బిగ్ బిజినెస్‌లో ప్రవేశించాలనుకున్నాడు. భారీ లెవెల్లో డబ్బు రొటేషన్ ఒక్కటే కాదు... వీఐపీలు, సెలెబ్ సర్కిల్స్‌లో కనెక్ట్ కావడం వంటివి సాధ్యమైన ఒకే ఒక్క రంగం సినిమా బిజినెస్ అన్నది గ్రహించాడు. బాగా అధ్యయనం చేశాడు.

బిజినెస్ అంటేనే రిస్క్. కాని, బిజినెస్‌తో పాటు - తన వ్యక్తిత్వానికి, విజన్‌కు బాగా సూటయ్యే ఇంకెన్నో అదనపు అడ్వాంటేజెస్ ఉన్న సినిమా రంగం తనకు బెస్ట్ అనుకున్నాడు. 

ఫిక్స్ అయిపోయాడు. 

కట్ చేస్తే -  

"యువన్ సూర్య ఫిలిమ్స్" రిజిస్టర్ అయింది. బిజినెస్ బేసిక్స్ అర్థం చేసుకోడం కోసం, ఒక పైలట్ ప్రాజెక్టుగా, అంతా కొత్త ఆర్టిస్టులతో ఒక రోడ్-క్రైమ్-డ్రామా మొదలెట్టాడు. 36 రోజులు ఏకధాటిగా షూటింగ్ చేసి, గుమ్మడికాయ కొట్టాడు. 

శరవేగంగా ఇప్పుడు పోస్ట్-ప్రొడక్షన్ జరుపుకొంటున్న ఆ సినిమా... ఎర్ర గులాబి. 

ఈ సినిమాకు దర్శకున్ని నేనే... యువర్స్ ట్రూలీ, మనోహర్ చిమ్మని.   

నాలాగే, యువన్ శేఖర్ కూడా ఈ రంగాన్ని ఎంచుకోడానికి ఇంకో బలమైన కారణం ఉంది... 

భారీగా డబ్బు, ఫేమ్, కాంటాక్ట్స్ మాత్రమే కాదు... మనలాంటి ప్యాషనేట్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఇంకో పది మందికి లైఫ్ ఇవ్వడానికి కూడా ఈ సినిమా రంగాన్ని మించిన అద్భుతమైన ప్లాట్‌ఫామ్ ఇంకోటి లేదు. 

ఈ శనివారం, 22 వ తేదీ నాడు, ప్రముఖ యువ నిర్మాత చేతులమీదుగా ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం. ఆ వివరాలు కొన్ని గంటల్లో సోషల్ మీడియాలో వస్తాయి.  

- మనోహర్ చిమ్మని

పి యస్:
మా ఇద్దరి కోంబోలో రెండో సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. 


Sunday, 16 March 2025

రచనతోనే నా తొలిప్రేమ


తెలుగులో నా అభిమాన కథానికా రచయితలు చాలామందే ఉన్నారు. కాని, నేను ఎక్కువగా ఇష్టపడేది మాత్రం - బుచ్చిబాబు, చలం. 

ఎవ్వరి ప్రత్యేకత వారిదే. ఎవ్వరి రచనాశైలి, ఎవ్వరి ముద్ర వారిదే. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని నేను అనను. కాని - భాష, వ్యక్తీకరణ, కథనం... ఈ మూడింటి విషయంలో మాత్రం వీరి తర్వాతే ఎవ్వరైనా అని నా వ్యక్తిగత భావన.  

బుచ్చిబాబు రాసిన ఒక అద్భుతమైన కథ "నన్ను గురించి కథ వ్రాయవూ" నన్ను దశాబ్దాలుగా ఎంతలా వెంటపడి వేధించిందంటే, ఆ కథాస్పూర్తితోనే మొన్న అనుకోకుండా, ఫిబ్రవరి 14 నాడు, నేనే ఒక పెద్ద కథ రాసి, పూర్తిచేసి, నా మిత్రుడు గుడిపాటికి పంపించేంతగా. 

కట్ చేస్తే -

ఇప్పుడు నేను కథానికలు విరివిగా రాయడం మొదలెట్టాను. ఒక నవల కూడా రాస్తున్నాను. నా సినిమాలు, ఇతర వ్యవహారాలు... వాటి దారి వాటిదే. 

కాని... 

రచనతోనే నా తొలిప్రేమ. 

చాలా ఏళ్ళుగా అసలు పట్టించుకోలేదు. మర్చిపోయాను. లాభమేంటి అనుకున్నాను. కాని, చాలా నష్టపోయాను. 

నా అంతరాంతరాల్లో, ఎక్కడో పాతాళంలో, ఎప్పటినుంచో తొక్కిపెట్టి ఉంచిన నా ఈ భావనను బయటకు తీసి, నన్ను చెడామడా ఉతికి ఆరేసి, నన్ను మళ్ళీ ఈవైపు తిప్పిన ఒక స్నేహి గురించి ఎంత చెప్పినా తక్కువే.       

అందుకే - కొంచెం ఆలస్యంగానైనా, మళ్ళీ ఇప్పుడు నా రచనతోనే కొత్తగా ప్రణయం మొదలెట్టాను. ఇంక ఈ ప్రయాణానికి ముగింపు లేదు.  

- మనోహర్ చిమ్మని           

Wednesday, 12 March 2025

"ఎక్స్" ఒక్కటి చాలు!


ఏం ప్రమోట్ చెయ్యాలనుకున్నా, ఏది సాధించాలనుకున్నా ఎక్స్ ఒక్కటి చాలు. 

సోషల్ మీడియా కోసం మనం కాదు. మన కోసం సోషల్ మీడియా.  

మినిమలిజమ్‌లో ఇది నా ఫస్ట్ స్టెప్. 

ఇన్‌స్టాగ్రామ్, బ్లాగ్, ఫేస్‌బుక్ ఎటెస్ట్రా... అన్నిటికీ గుడ్ బై. వీటికోసం నేను పెట్టే కొన్ని నిమిషాల సమయం కూడా - నాకు స్క్రిప్టులు రాసుకోడానికి, డెడ్‌లైన్‌తో కూడిన నా ఇతర సినిమా పనులకు - ఎంతో కొంత తప్పక ఉపయోగపడుతుంది.  

బియాండ్ సినిమా... ఇంకెన్నో పనులూ బాధ్యతలూ ఉన్నాయి నాకు.  

కట్ చేస్తే - 

ఒక్కో దశలో, అప్పటి పరిస్థితులను, అప్పటి అవసరాలను బట్టి మన ఆలోచనలు మారుతుంటాయి. మన ప్రయారిటీస్ మారుతుంటాయి. మన నిర్ణయాలు మారుతుంటాయి. 

ఇదీ అలాంటి నిర్ణయమే. 


- మనోహర్ చిమ్మని. 

Thursday, 6 March 2025

కొన్ని అనుమానాలు గమ్మత్తుగా ఉంటాయి!


నా ఇష్టాలూ నా అనందాలూ అన్నీ మర్చిపోయి, అందరు తండ్రుల్లాగే ఇన్నిరోజులూ - నా పిల్లల కోసం, నా కుటుంబం కోసం చాలా కష్టపడ్డాను.  

ఇప్పుడూ మా ఇద్దరబ్బాయిల చదువులు, కెరీర్ బాధ్యత నావైపు నుంచి దాదాపు పూర్తయిపోయింది. సో, ఇకనుంచి నా గురించి నేను పనిచేసుకోవాలనుకున్నాను. నా కోసం నేను బ్రతకాలనుకొని నిర్ణయించుకొన్నాను. 

గత కొన్ని నెలలుగా అదే చేస్తున్నాను. 

50+ తర్వాత కొత్తగా నాకు తెలీని ఇంకో ఫీల్డులో అ ఆ ల నుంచి ప్రారంభించడం ఇష్టంలేక - నాకు తెలిసినవాటిల్లోనే కొంచెం భారీ ఫీల్డునే మళ్ళీ టచ్ చేశాను...  

సినిమాలు.

ఫిలిం డైరెక్షన్.  

ఒక యాంగిల్లో ఇది గ్యాంబ్లింగే. కాని, ఇంకో యాంగిల్లో పరోక్షంగా ఎన్నో విషయాల్లో పనికొచ్చే ఒక మంచి క్రియేటివ్ ప్లాట్‌ఫామ్. ఒకప్పుడు నాకు బాగా ఇష్టమైన ప్యాషన్. ఇప్పుడు బాగా ఆదాయం వచ్చే ప్యాషన్. మంచి పేజ్-త్రీ సర్కిల్స్‌లో తిరగే అవకాశం కూడా ఈ ఫీల్డులోనే సాధ్యం. 

అందుకే ఈ సంవత్సరం కనీసం ఒక 2 సినిమాలు చేయాలనుకున్నాను. ఒక సినిమా షూటింగ్ ఆల్రెడీ జనవరి 30 నాడే పూర్తిచేశాను. ఇప్పుడు సిచువేషన్ చూస్తోంటే - కనీసం ఇంకో 2 సినిమాలు ఈజీగా చేస్తా అనిపిస్తోంది.

స్ట్రెస్-ఫ్రీగా, కొత్త చిక్కుల్లో ఇరుక్కోకుండా, యాక్టివ్‌గా, ఎనర్జెటిక్‌గా ఉన్నంతవరకు ఎన్ని సినిమాలయినా చెయ్యొచ్చు.

68 దాటిన మణిరత్నం చెయ్యట్లేదా? 70 దాటిన జేమ్స్ కెమెరాన్  చెయ్యట్లేదా? 90 దాటిన క్లింట్ ఈస్ట్‌వుడ్ చెయ్యట్లేదా? వీళ్లందరి ముందు, అయాం జస్ట్ ఎ బచ్చా.  

కాని, విషయం అది కాదు.          

కట్ చేస్తే - 

ఇందాకే చెప్పినట్టు, ఏదో ఒకటో రెండో సినిమాలు చేస్తూ, ఈ ప్రాసెస్‌ను పూర్తిగా ఎంజాయ్ చేద్దామనుకున్నాను మొదట్లో. నా ఫ్యూచర్ కోసం కొంత డబ్బు సంపాదించుకుందామనుకున్నాను. అయితే - ఇది ఇక్కడ రాసినంత సింపుల్ కాదు. 

మారిన ఈ డిజిటల్ యుగపు కండిషన్స్‌లో నానా కథలు పడాలి. సోషల్ మీడియాలో మనకంటూ ఒక ఉనికిని, ఒక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకోవాలి. దీనికోసం ఎప్పుడూ ఏదో ఒక బజ్ క్రియేట్ చేస్తుండాలి. ఈ బజ్‌లో భాగంగా - అప్పుడప్పుడూ ఇలా బ్లాగులు రాస్తుండాలి. ఫిలిం మేకింగ్ గురించి నాకు తెలిసింది ఏదో ఒకటి రాస్తుండాలి. సినిమా నేపథ్యం ఉన్న అమ్మాయిలు, హీరోయిన్స్, ఇతర ఆర్టిస్టులు-టెక్నీషియన్స్ ఫోటోలు కూడా ఏదో ఒక ఎఫెక్టివ్ క్యాప్షన్‌తో అప్పుడప్పుడూ పోస్ట్ చేస్తుండాలి. 

ఇదంతా చెయ్యడానికి - నాకు అవసరమైన స్టఫ్ ఎప్పటికప్పుడు అందిస్తూ, నా టీమ్ నాకు సహకరిస్తుంటుంది. 

నిత్య డౌటర్స్ ఇదంతా నమ్మరు. ఇదంతా వాళ్లకు అనవసరం. వాళ్ళు అనుకున్నదే వేదం. వాళ్ళు అనుకున్నదే నిజం.   

"నువ్వెప్పుడూ కొత్త ప్రేమలకోసం చూస్తుంటావు. ఉన్నవాళ్ళను వదిలేసి, వేరే ఇంకెవరి కోసమో వెతుకుతుంటావు. అసలలా ఆ అమ్మాయిల ఫోటోలు ఎందుకుపెట్టాలి? అలా పోస్టు చేయడం వెనుక అసలు నీ ఐడియా ఏంటో నాకు తెలుసు..." 

ఇలా, కొందరి నుంచి కామెంట్స్ వస్తుంటాయి.   

ఇంక దీనికి నేనేం చెప్పాలి? ఏం చెప్పినా వింటారా?  

సో, బెటర్... నో కామెంట్!   

- మనోహర్ చిమ్మని       

Saturday, 1 March 2025

సినిమా ఫీల్డు ఒక యుద్ధభూమి


ఒక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసి ఫస్ట్ కాపీ తీసుకురావడానికి నెలరోజులు చాలు.  

ఇది నేను చెప్తున్న విషయం కాదు. 1980ల్లోనే దాసరి నారాయణరావు లాంటి డైరెక్టర్స్ ఎందరో చేసి చూపించారు. అప్పుడు ఫిలిం నెగెటివ్ వాడుతున్నరోజుల్లోనే వాళ్ళు అంత వేగంగా పనిచేశారు. ఇప్పుడున్న లేటెస్ట్ డిజిటల్ టెక్నాలజీ ఇస్తున్న సౌకర్యాలతో ఇది ఇంకా ఈజీ అవ్వాలి. కాని మనం రోజురోజుకీ దీన్ని ఇంకా కాంప్లెక్స్ చేసుకోవడం ఏదైతే ఉందో... కొంచెం ఆలోచించాల్సిన అంశం. 

దీన్నుంచి ఒక్కటే ఒక్క మినహాయింపు... గ్రాఫిక్ వర్క్ ఎక్కువగా ఉన్న సినిమాలు. 

మిగిలినవి ఏ స్థాయి సినిమాలైనా 30 రోజులు పోస్ట్ ప్రొడక్షన్‌కు చాలు. పూరి జగన్నాధ్, ఆర్జీవీ వంటి డైరెక్టర్స్ కూడా వారి సినిమాల ద్వారా ఇది చాలా సింపుల్‌గా చేసి చూపించారు. దాదాపు ఓ మూడేళ్ళ క్రితం అనుకుంటాను... ఒక రజినీకాంత్ సినిమాను కూడా జస్ట్ 4-5 నెలల్లో పూర్తిచేసి, రిలీజ్ చేశారు. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌కు పట్టింది కూడా జస్ట్ నెలరోజులే.   

కట్ చేస్తే -  

ఇది అసాధ్యమైన పని కాదు. దీనికి కావల్సింది మూడే మూడు అంశాలు:

ఒక సరైన ప్లాన్. 
పని చెయ్యడానికి ఒక ఫోకస్డ్ టీమ్.
ఈ పని కోసం అవసరమైన ఫండ్స్. 

ఈ మూడింట్లో ఏ ఒక్కటిలేకపోయినా కష్టం. ఒక సినిమాను వేగంగా ముందుకుతీసుకెళ్ళలేము. ఇంకో సినిమా మీద పూర్తి ఫోకస్ పెట్టలేము. ఇది ఇంకోరకమైన స్టకప్. ఇలాంటి స్టకప్ వల్ల ముందు పడిన శ్రమంతా వృధా అవుతుంది.          

అందుకే అంటారు... "Film is a battleground" అని. ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో సమస్యలు కొత్త యాంగిల్లో దాడి చేస్తూనే ఉంటాయి. మనం అలర్ట్‌గా ఉండాలి, సమస్యలతో యుద్ధం చేస్తూ ముందుకెళ్తూనే ఉండాలి.   

- మనోహర్ చిమ్మని