ఒక సినిమా ప్లాన్ చేసి, దాని షూటింగ్ పార్ట్ పూర్తిచెయ్యడం అనేది అంత చిన్న విషయం కాదు. చేతిలో 100% ఫండ్స్ ఉన్నప్పుడు కూడా ఎన్నెన్నో ఆటంకాలొస్తాయి. అలాంటిది... మొన్న 26 డిసెంబర్ నుంచి, 30 జనవరి వరకు, 36 రోజులపాటు నాన్-స్టాప్‌గా పనిచేసి, మన సినిమా "ఎర్ర గులాబి" షూటింగ్ పూర్తిచేశాం.
ఒక 'రోడ్-క్రైమ్-థ్రిల్లర్' జోనర్ సినిమాను ఇంత ఫాస్ట్‌గా చెయ్యగలగటం కూడా అంత ఈజీ కాదు. కాని, మనం చెయ్యగలిగాం.
టీమ్‌లో ఎవరెవరు ఎంత కష్టపడ్డారు, ఎవరి కంట్రిబ్యూషన్ ఎంత అన్నది అందరికీ తెలిసిందే. నిజంగా ఒక రెనగేడ్ టీమ్‌గా, ఒక సిండికేట్‌గా, నాకు పూర్తి సపోర్ట్ ఇచ్చి, నాతో కలిసి రాత్రింబవళ్ళు కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు.
పరోక్షంగా మాకు సహకరించిన ఎందరో మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ కూడా మా టీమ్ అందరి తరపున బిగ్ థాంక్స్.
కట్ చేస్తే -
1. "ఎర్ర గులాబి" సినిమా "ఫస్ట్ లుక్" & "మోషన్ పోస్టర్" రిలీజ్‌తో మన సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది మార్చి 5 నాడు ఉంటుంది. ఒక వీఐపి చేత వీటిని రిలీజ్ చేయిస్తున్నాం.
2. "ఎర్ర గులాబి" సినిమాలోని తెలంగాణ ఫోక్ సాంగ్‌ను "ఫస్ట్ లిరికల్ సాంగ్"గా మార్చి 9, ఆదివారం నాడు మరొక వీఐపీతో రిలీజ్ చేయిస్తున్నాం.
ఈ రెండూ రెండు వేర్వేరు ఈవెంట్స్.
వీటి డేట్స్, రిలీజ్ చేసే వీఐపీ గెస్ట్‌ల పూర్తి వివరాలు మా ప్రొడ్యూసర్ యువన్ శేఖర్‌తో ఫైనల్‌గా ఇంకోసారి చర్చించి, మళ్ళీ త్వరలోనే చెప్తాను. వీఐపీల డేట్స్‌ను బట్టి, ఈ డేట్స్ స్వల్పంగా ఒకటి రెండు రోజులు మారవచ్చు.
కట్ చేస్తే -
వీటి డేట్స్, రిలీజ్ చేసే వీఐపీ గెస్ట్‌ల పూర్తి వివరాలు మా ప్రొడ్యూసర్ యువన్ శేఖర్‌తో ఫైనల్‌గా ఇంకోసారి చర్చించి, మళ్ళీ త్వరలోనే చెప్తాను. వీఐపీల డేట్స్‌ను బట్టి, ఈ డేట్స్ స్వల్పంగా ఒకటి రెండు రోజులు మారవచ్చు.
కట్ చేస్తే -
3. మొన్న దస్పల్లాలో లాంచ్ అయిన నా ఫేవరేట్ ప్రాజెక్టు "Yo!/10 ప్రేమ కథలు" షూటింగ్ మార్చి 30, ఉగాది నాడు ప్రారంభించాలనుకుంటున్నాం. పండగ రోజు కుదరదు అనుకుంటే, ఆ తర్వాతి మంచిరోజు నుంచి ప్రారంభిస్తాం.
4. దాదాపు 80% షూటింగ్ వరంగల్‌లో ప్లాన్ చేసిన నా ఇంకో ప్రెస్టేజియస్ ప్రాజెక్టు "Warangal Vibes"ను 28 ఏప్రిల్ నుంచి ప్రారంభిస్తున్నాం. ఈ సినిమా మిగిలిన 20% షూటింగ్ నిర్మల్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది.
కట్ చేస్తే -
ఇప్పటివరకూ నాకు సహకరిస్తూ వస్తున్న నా ఆత్మీయ ఇన్వెస్టర్ మిత్రులు, శ్రేయోభిలాషులందరితో ఒక మంచి గెట్-టుగెదర్ లంచ్ మీటింగ్‌ను మార్చి ఫస్ట్ వీక్‌లో ప్లాన్ చేస్తున్నాను. అందరం తప్పక కలుద్దాం.
"కలిసి పనిచేద్దాం. కలిసి ఎదుగుదాం."
- మనోహర్ చిమ్మని
sir, can you share your march 5 and march 9 promotion events youtube link, all the best
ReplyDelete