జూబ్లీ హిల్స్ దస్పల్లాలో నవంబర్ 28 నాడు ఒక సినిమా ప్రారంభించాము. ఇంకో 40 రోజుల్లో షూటింగ్‌కి అన్ని ప్రిప్రొడక్షన్ ఏర్పాట్లు చేసుకున్నాము. కాని, వారంలోనే తెలిసింది... సాంకేతికంగా సినిమా ఆలస్యం కావచ్చని.
దానికి తోడు, నేను అనుకున్న చాలామంది ఆర్టిస్టుల డేట్స్ కూడా 6 నెలల నుంచి, దాదాపు 18 నెలల వరకు లేవు!
ఇదొక పెద్ద డిజప్పాయింట్‌మెంట్. వెంటనే "కొత్తవాళ్లతో అయితే" ఏంటి అని ఆలోచించాను. 10 జంటలు కాబట్టి - సాంకేతికంగా, ఆర్టిస్టులపరంగా నేను చాలా సమస్యల్ని, స్ట్రెస్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బడ్జెట్ చేయిదాటిపోయే ప్రమాదం ఉంటుంది.
సో, ఆ ఆలోచన అలా నడుస్తుండగానే నా మిత్రుడు, ఫిలాసఫర్, వీరేంద్రలలిత్‌తో ఒకసారి కూల్‌గా మాట్లాడుతున్నప్పుడు ఆయనొక మాటన్నాడు: "మీరు ఎప్పుడూ ఏదో ఒకటి రాస్తున్నట్టే, మీ సినిమాలు కూడా ఎప్పుడూ ఒకటి షూట్‌లో ఉండాలి" అని.
మా లలిత్ నుంచి వచ్చిన ఈ పాజిటివ్ వైబ్ కూడా అప్పుడు బాగా పనిచేసింది. ఏమైనా సరే, ఒక నెల రోజుల్లో సినిమా ప్రారంభించాలి అనుకున్నాను.
కట్ చేస్తే -
ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్న సినిమాకి బదులుగా అప్పటికప్పుడు ఒక కొత్త సినిమా ప్రారంభమైంది.
అదే - ఎర్ర గులాబి.
నిన్నటి బ్లాగులో రాసినట్టుగా, ఈ సినిమా షూటింగ్‌ను ఏకధాటిగా 36 రోజుల్లో పూర్తిచేశాం. ఇప్పుడు ఎడిటింగ్ జరుగుతోంది. మార్చి నుంచి ప్రమోషన్ ప్రమోషన్ ప్రారంభిస్తున్నాము. ఏప్రిల్లో కాపీ వస్తుంది. ఆ తర్వాత రిలీజ్ ఉంటుంది.
ఈ జర్నీ అంతా "ది మేకింగ్ ఆఫ్ ఎర్ర గులాబి" పేరుతో ఒక అందమైన పుస్తకంగా తీసుకురావాలని కూడా నిర్ణయించాం.
- మనోహర్ చిమ్మని
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani