అప్పుడు ఇప్పుడు అనుకుంటూ చివరికి నిన్న మా ఇన్వెస్టర్స్ వెన్యూకి డబ్బులు కట్టడంతో నిర్ణయం సంపూర్ణమైంది.
షూటింగ్ కూడా అతి తక్కువ సమయంలో పూర్తిచేసి, ఫైనల్ కాపీ తీసుకురాబోతున్నాను. అనుకున్నట్టుగా బిజినెస్ చేసి, రిలీజ్ కూడా త్వరగా చేయాలనుకుంటున్నాను. సమ్మర్ రిలీజ్ హంగామాలో ఈ ప్రాజెక్టు కూడా ఉండొచ్చు.
కట్ చేస్తే -
సరిగ్గా మధ్యలో 9 రోజులుంది. బతుకమ్మ పండుగ, దసరా కూడా ఈ మధ్యలోనే ఉన్నాయి. ఈ హడావిడిలోనే గెస్టులను అనుకొని, ఆహ్వానించడం జరగాల్సి ఉంది. ఇంకా చాలా ఉన్నాయి పనులు.
అదేంటో గాని, సినిమా నిజంగా ప్రారంభం అవుతోంది అంటే చాలు... అన్ని పనులూ అవే చకచకా అయిపోతుంటాయి. అవ్వాలి కూడా.
అసలు ఆ కిక్కే వేరు!
- మనోహర్ చిమ్మని
- మనోహర్ చిమ్మని
Sir, when your oye movie releasing?
ReplyDeleteSir, when your YO movie releasing?
ReplyDelete