నాకు ఫిలిం ఓపెనింగ్ వంటి కార్యక్రమాలు అసలు ఇష్టం ఉండదు. కాని, కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో, కొందరి కోసం చెయ్యాల్సివచ్చినప్పుడు తప్పదు. నిన్న జరిగిన నా తాజా సినిమా ఓపెనింగ్ కార్యక్రమం అలాంటిదే.
కట్ చేస్తే -
ఓపెనింగ్ కార్యక్రమమైనా, ఇంకే కార్యక్రమమైనా చుట్టూవున్నవాళ్ళ అంచనాలు, ఊహలమేరకు చెయ్యడానికి ఎప్పుడూ ప్రయత్నించవద్దు. వాళ్ళెవ్వరూ మనకు, మన పనికి ఉపయోగపడరు. పైగా ఎప్పుడూ నాలుగు రాళ్ళేయడానికి రెడీగా ఉంటారు.
మనకేది ఇష్టమో, మనకేది వర్కవుట్ అవుతుందో అది మాత్రమే చెయ్యాలి. మనం దేనివల్ల సంతోషపడతామో, దేనివల్ల మరింత ఉత్సాహంగా పనిచేస్తామో, దేనివల్ల మరింత శక్తివంతంగా ఫీలవుతామో అదే చెయ్యాలి.
నిన్న జరిగిన మా ఓపెనింగ్ కారయక్రమం కోసం ముందు పొలిటీషన్స్, బిగ్ స్టార్స్, బిగ్ డైరెక్టర్స్ గెస్టులుగా చెయ్యాలని ప్లాను. ముందు పొలిటీషన్స్ కొట్టిపడేశాను. వీళ్ళతో నానా టెన్షన్. ఎదురుచూడాలి, వాళ్ళ వెనుక ఆ మందీ మార్బలం భరించాలి. నో అనుకున్నాను.
తర్వాత స్టార్స్, స్టార్ డైరెక్టర్స్ కూడా వద్దనుకున్నాను. వాళ్ళను రప్పించడం కోసం, వస్తాను అని వాళ్ళు ఒప్పుకోవడం కోసం, ఇష్టం లేకుండా చాలా కష్టపడాలి. లాస్ట్ మినట్లో వీళ్ళు ఏదో కారణం చేత, ఈవెంట్‌కు రాకుండా మిస్ అయ్యే ప్రమాదమే ఎక్కువ. కొట్టేశాను. అవసరం లేదు అనుకున్నాను.
కట్ చేస్తే -
మా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్ గారిని ముఖ్య అతిథిగా పిలిచాను. దర్శక మిత్రులు బాబ్జీ, చంద్రమహేశ్, ప్రియదర్శిని లను అతిథులుగా పిలిచాను. మన కోసం కొంత సమయం సంతోషంగా కెటాయించగలిగే మనవాళ్ళను పిల్చుకోవడంలో ఉన్న ఆనందం వేరు.
ఈవెంట్ కూల్‌గా, ఎలాంటి టెన్షన్ లేకుండా బాగా జరిగింది. పాజిటివ్ ఆరా కమ్మేసింది. దీనికి మా ఇతర మిత్రులు, శ్రేయోభిలాషుల అభిమానం తోడయ్యింది.
ఈవెంట్ కూల్‌గా, ఎలాంటి టెన్షన్ లేకుండా బాగా జరిగింది. పాజిటివ్ ఆరా కమ్మేసింది. దీనికి మా ఇతర మిత్రులు, శ్రేయోభిలాషుల అభిమానం తోడయ్యింది.
ఇంకేం కావాలి?
సినిమా బాగా చెయ్యాలి. అనుకున్న స్థాయి విజం సాధించాలి. అదొక్కటే ఇప్పుడు మా టీమ్ లక్ష్యం.
- మనోహర్ చిమ్మని
- మనోహర్ చిమ్మని
Yo yo
ReplyDeletePromotion kosam opening link share cheyandi ikkada yo yo
ReplyDelete