హీరోలు, హీరోయిన్స్, ఆర్టిస్టులే కాదు... అసిస్టెంట్ డైరెక్టర్ చాన్స్ కోసం కూడా ఢిల్లీ, ముంబై, రాజస్థాన్, గుజరాత్, యూపీ లాంటి రాష్ట్రాల నుంచి కూడా హైద్రాబాద్‌కు రావడానికి ఎంతోమంది కొత్తవాళ్ళు రెడీగా ఉన్నారు.
అవకాశం ఇచ్చి, వెండితెరకు పరిచయం చేస్తే చాలు. పారితోషికం కూడా అక్కర్లేదు. అలా ఉంది డిమాండ్.
ఒక్క ఆర్టిస్టులు, టెక్నీషియన్సే కాదు... ముంబై నుంచి మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్ కూడా మన దగ్గర ఈ "ఒక్క ఛాన్స్" కోసం ప్రయత్నిస్తున్నారు.
కట్ చేస్తే -
కట్ చేస్తే -
నేనిప్పటివరకు చేసిన 3 సినిమాల్లో కనీసం ఒక 55 మంది వరకు కొత్త ఆర్టిస్టుల్ని, టెక్నీషియన్స్‌ను పరిచయం చేశాను. వారిలో కొందరు ఇప్పుడు ఆర్టిస్టులుగా, టెక్నీషియన్స్‌గా మంచి పొజిషన్స్‌లో ఉన్నారు.
అయితే - వాళ్ళల్లో ఇప్పుడు ఎంతమంది నాతో టచ్‌లో ఉన్నారన్నది డిఫరెంట్ కొశ్చన్.
నా గత అనుభవాల నేపథ్యంలో... కొందరు సీనియర్ డైరెక్టర్ మిత్రులు చెప్పిన మాట కూడా వినకుండా, ఇప్పుడు చేస్తున్న సినిమాలో కూడా నేను కొందరు కొత్తవాళ్ళని పరిచయం చేస్తున్నాను.
"ఒక్క ఛాన్స్, ప్లీజ్" అని అవకాశం కోసం వెంటపడుతున్నవాళ్లను పట్టించుకోకుండా, నాకు నేనుగా కొందర్ని పిలిచి అవకాశం ఇవ్వడం కూడా తప్పేమో అని ఈమధ్య అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది.

ఈ అవకాశం విలువ వీళ్లకి అర్థంకావడం లేదా? ఆ విలువని వీళ్ళు గుర్తించడం లేదా?
- మనోహర్ చిమ్మని
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani