పదేళ్ళ క్రితం ఒకరోజు పొద్దున్నే మా పెద్దబాబు బయటికెళ్ళాడు. మామూలుగా రోజూలాగే ఫ్రెండ్స్ దగ్గరికో, రన్నింగ్‌కో, స్విమ్మింగ్‌కో అనుకున్నాను.
కాని కాదు.
కట్ చేస్తే -
ఒక రెండున్నర గంటల తర్వాత, చేతిలో చిన్న బ్లూ కలర్ ప్లాస్టిక్ బుట్టతో ఇంట్లోకొచ్చాడు మా పెద్దబాబు. నేను పెద్దగా పట్టించుకోకుండా నా పనిమీద నేనున్నాను. నా గదిలోకెళ్ళాను.
మెల్లగా హాల్లోంచి గుసగుసలు వినిపించసాగాయి. మా చిన్నబాబు, పెద్దబాబు, మా సుజ్జి ఏదో సీక్రెట్‌గా మాట్లాడుకుంటున్నారు.
ఇంకో నిమిషం తర్వాత చిన్న కుక్క పిల్ల కుయ్ మంటూ శబ్దం చేసింది.
అర్థమైపోయింది నాకు. పెంచుకోడానికి కుక్క పిల్లను తెచ్చాడన్నమాట!
కట్ చేస్తే -
ఆ తర్వాత కనీసం ఒక మూడు నాలుగు రోజుల పాటు నాకు, మా ఇంట్లోని మిగతా ముగ్గురికీ మధ్య యుద్ధం జరిగింది.
మూడువేల రూపాయలు పెట్టి కొనుక్కొని తెచ్చిన ఆ కుక్కపిల్లను తిరిగి అక్కడే ఇచ్చిరమ్మని నేను, లేదు పెంచుకుంటాం అని నా ఆపోజిషన్ పార్టీ!
చివరికి వాళ్ళే గెలిచారు.
నా మనసు మార్చుకున్నాను. ఆ కుక్కపిల్లకు పేరు కూడా నేనే పెట్టాను.
ఇప్పుడు అదంటే నాకు చాలా ప్రేమ. వాళ్లందరికంటే ఎక్కువ ప్రేమ. అది లేకుండా నేనుండలేను. నాకోసం కూడా అది ఎదురుచూస్తుంటుంది. నేను డల్‌గా ఉన్న సమయాల్లో నన్ను ఆడిస్తుంది, ఇన్‌స్పయిర్ చేస్తుంది, నేను మళ్ళీ యాక్టివ్ అయ్యేవరకు నా పక్కనే నన్ను ఆనుకొని పడుకొంటుంది.
నిజంగా అది లేకపోతే ఈ పదేళ్ళు నాకు ఎలా గడిచేవో అని అనుకుంటాను అప్పుడప్పుడూ. ఇది అతిశయోక్తి కాదు. నిజం.
అలా పదేళ్ళ క్రితం పొద్దున్నే ఓల్డ్ సిటీ దాకా వెళ్ళి, ఆ రోజు మా పెద్దబాబు తెచ్చిన ఆ చిన్న కుక్క పిల్లే మా లక్కీ.
దాని 10వ బర్త్ డే ఈ రోజు.
హాపీ బర్త్ డే మై డియర్ లక్కీ!
- మనోహర్ చిమ్మని
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani