సరిగ్గా సంవత్సరం క్రితం ఈరోజు... సుమారు 2 వారాల మానసిక, శారీరక సంఘర్షణ తర్వాత కోవిడ్ నుంచి తేరుకున్నాను.
నా ఫేస్‌బుక్ మెమొరీస్ ఇవ్వాళ ఉదయం ఈ విషయం గుర్తుచేసినప్పుడు, చెప్పలేని ఒకరకమైన ఫీలింగ్‌తో కాసేపు బ్లాంక్ అయిపోయాను.
ఓ రెండు నిమిషాల తర్వాత నన్ను నేను రెండు ప్రశ్నలు వేసుకున్నాను:
1. ఒకవేళ నేను కోవిడ్ నుంచి కోలుకోకపోయుంటే ఏమయ్యేది?
2. సరే, బార్డర్ దాకా వెళ్ళొచ్చావనుకుందాం. వొళ్ళుదగ్గర పెట్టుకొని గత 365 రోజుల్లో ఏదైనా సాధించావా?
మొదటి ప్రశ్నకు నాదగ్గర సమాధానం లేదు. ఉన్నా చెప్పలేను.
రెండో ప్రశ్నకు సమాధానం ఉంది. చాలా సాధించాను. నేను చేయాలనుకొన్న ప్రతి ఒక్క పనినీ చేశాను. కొన్ని ఫెయిలయ్యాయి. కొన్ని వేస్ట్ అనుకొని నేనే మానేశాను. కొన్ని ఊహించని రేంజ్‌లో సక్సెస్‌ను అందించాయి.
ఇకనుంచీ రెగ్యులర్‌గా సినిమాలు చేసేపనిలో ఒక మిడ్‌లెవల్ భారీ ప్రొడక్షన్ హౌజ్ రూపకల్పనలో ప్రధాన భాగస్వామినయ్యాను. సినిమాలు, వెబ్ సీరీస్, మ్యూజిక్ వీడియోల ప్రి-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఎప్పటినుంచో పెండింగ్‌లో పెట్టిన నా పుస్తకాల ప్రచురణ కూడా త్వరలో మొదలవబోతోంది.
ముఖ్యంగా కొన్ని తలనొప్పుల నుంచి ఒక నెలరోజుల్లో నేను పూర్తిగా ఫ్రీ కాబోతున్నాను. నేను కోల్పోయిన ఫ్రీడమ్ తిరిగి సంపాదించుకోబోతున్నాను.
ఈ సిల్‌సిలా ఇక ఇలాగే కొనసాగుతుంది.
ఈ సిల్‌సిలా ఇక ఇలాగే కొనసాగుతుంది.
Picture abhi baaki hai mere dost...
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani