అనుకోకుండా ఇవ్వాళ ట్విట్టర్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తుంటే - ఫీడ్‌లో ముందుగా నాకు కనిపించింది... మినిస్టర్ కేటీఆర్ గారి ట్వీట్.
మధ్యాహ్నం 12 కి #AskKTR ట్యాగ్‌తో Q&A ఉంది.
టైమ్ చూశాను... అప్పటికే 12.01 అయింది.
ఏం ఆలోచించకుండా వెంటనే ఒక ట్వీట్ పెట్టాను.
30 సెకన్లలోపే నోటిఫికేషన్స్ మీద రెడ్ డాట్ కనిపించింది. క్లిక్ చేశాను.
అది... నా ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ కేటీఆర్ ఇచ్చిన రిప్లై!
కట్ చేస్తే -
నేను ఎప్పటినుంచో అనుకుంటున్న ఈ పుస్తకాన్ని త్వరలో పబ్లిష్ చేయబోతున్నాను.
ఇది కేసీఆర్ బయోగ్రఫీ కాదు. ఆయనమీద చేసిన రిసెర్చి కూడా కాదు. కేవలం ఆయన మీద నేను రాసిన ఎడిట్ పేజ్ ఆర్టికిల్స్, నా బ్లాగులో రాసిన పోస్టుల్లో ఎన్నిక చేసిన కొన్నింటి సంకలనం.
సక్సెస్ సైన్స్ పాయింటాఫ్ వ్యూలో కేసీఆర్‌ది ఒక పెద్ద సక్సెస్ స్టోరీ. నా కళ్ళముందు జరిగిన కథ. మనందరి కళ్ళముందు జరిగిన కథ.
2001 ఏప్రిల్ 27 నాడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ టీఆరెస్ పార్టీ స్థాపించినప్పుడు ఆయనవెనుక పట్టుమని ఒక 100 మంది కూడా లేరనుకుంటాను. ఆయనేం ఆకాశం లోంచి ఊడిపడలేదు. మామూలుగా మనలాంటి మనిషే. కాని, ఒక గట్టి సంకల్పంతో ముందుకు దూకాడు. రాష్ట్రాన్ని సాధించాడు.
ఇప్పటివరకు తెలంగాణలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని ఎన్నెన్నో పనులు రికార్డ్ టైమ్‌లో చేసి చూపించాడు.
ఎర్రటి ఎండాకాలంలో ఇప్పుడు తెలంగాణ పల్లెపల్లెల్లో చెరువులు బావుల్లో నిండా నీళ్ళున్నాయి. పిల్లలు, పెద్దలు ఈతకొడుతున్నారు. ఇలాంటి దృశ్యం గతంలో ఎప్పుడూ లేదు.
ఎర్రటి ఎండాకాలంలో ఇప్పుడు తెలంగాణ పల్లెపల్లెల్లో చెరువులు బావుల్లో నిండా నీళ్ళున్నాయి. పిల్లలు, పెద్దలు ఈతకొడుతున్నారు. ఇలాంటి దృశ్యం గతంలో ఎప్పుడూ లేదు.
నిన్న నేను కరీంనగర్ వెళ్తుంటే ఒక మల్టినేషనల్ కార్పొరేట్ ఆఫీస్ లాంటిది ఒకచోట కనిపించింది. చూస్తే - అది ప్రభుత్వ గురుకుల సంక్షేమ పాఠశాల!
ఇలాంటి అభివృద్ధి వందలాది విషయాల్లో విస్తృతంగా ఉంది.
తెలంగాణ పట్ల ఎంతో ప్రేమ ఉండాలి. కొంచెం తెలివి కూడా ఉండాలి. తెలంగాణ కోసం ఏదైనా చెయ్యాలన్న తపన ఉండాలి. ఇవన్నీ కేసీర్‌లో పుష్కలంగా ఉన్నాయి. ఎంత పుష్కలంగా ఉన్నాయంటే... మరే వ్యక్తిలో మనం ఇప్పటివరకూ చూడనంత స్థాయిలో!
విజన్ అంటే ఏదో పేపర్ల మీద చూపే విజన్ కాదు. ఇలా చేతల్లో కనిపించాలి.
విజన్ అంటే ఏదో పేపర్ల మీద చూపే విజన్ కాదు. ఇలా చేతల్లో కనిపించాలి.
మేము కేసీఆర్‌ను దించుతాం... మేము కేసీఆర్‌ను జైలుకు పంపుతాం అని ఎప్పుడూ వదిరే నాయకుల్లో ఎంతమందికి అసలు తెలంగాణలో ఎక్కడ ఏముందన్న విషయం తెలుసు?
అసలు కేసీఆర్ స్థాయి నాయకుడు ఆయా పార్టీల్లో కనీసం ఒక్కరైనా ఉన్నారా?
అసలు కేసీఆర్ స్థాయి నాయకుడు ఆయా పార్టీల్లో కనీసం ఒక్కరైనా ఉన్నారా?
ఉన్నారని నేననుకోను.
ఉంటే ఎవరాపుతున్నారు? ప్రజస్వామ్యంలో ఏదైనా సాధ్యమే.
ఉద్యమం ప్రారంభించినప్పుడు కేసీఆర్ కూడా ఒక్కడే కదా!
తెలంగాణకు మీరేం చేయగలరో చెప్పండి. ప్రజల్ని నమ్మించండి. చేసి చూపించండి.
ఉంటే ఎవరాపుతున్నారు? ప్రజస్వామ్యంలో ఏదైనా సాధ్యమే.
ఉద్యమం ప్రారంభించినప్పుడు కేసీఆర్ కూడా ఒక్కడే కదా!
తెలంగాణకు మీరేం చేయగలరో చెప్పండి. ప్రజల్ని నమ్మించండి. చేసి చూపించండి.
"దేశానికి ఒక లక్ష్యం ఉండాలి" అన్న వాక్యం ఎప్పుడైనా మీ నాయకుల నోటి నుంచి విన్నారా?
అసలా వాక్యం ఎంతమందికి అర్థమవుతుంది?... ముఖ్యంగా, ఈ అరుపులు కేకల బ్యాచ్‌లకు, ఈ థంబ్‌నెయిల్ బ్యాచ్‌లకు?!
కేసీఆర్ నా బంధువు కాదు. ఆయనను ఇంప్రెస్ చేయాల్సిన అవసరం నాకేం లేదు. కాని, ఆయన పనితీరు పట్ల నేను ఇంప్రెస్ అయ్యాను. ఒక అభిమానినయ్యాను.
అలా ఇంప్రెస్ అయిన ఒక అభిమానిగా - అప్పుడప్పుడూ నేను పెట్టిన బ్లాగ్ పోస్టులూ, రాసిన ఎడిట్ పేజి ఆర్టికిల్స్ సంకలనంతో నేను పబ్లిష్ చేస్తున్న పుస్తకమే "KCR - The Art of Politics".
త్వరలో ఈ బుక్ రిలీజ్ ఉంటుంది.
D y n a m i s m U n l i m i t e d !!
అలా ఇంప్రెస్ అయిన ఒక అభిమానిగా - అప్పుడప్పుడూ నేను పెట్టిన బ్లాగ్ పోస్టులూ, రాసిన ఎడిట్ పేజి ఆర్టికిల్స్ సంకలనంతో నేను పబ్లిష్ చేస్తున్న పుస్తకమే "KCR - The Art of Politics".
టైటిల్ ఒక్కటే ఇంగ్లిష్‌లో ఉంటుంది. పుస్తకమంతా తెలుగులోనే.
నా బుక్ మీరు రిలీజ్ చెయ్యాలని, ఈ రోజు నేను అనుకోకుండా #AskKTR ద్వారా మినిస్టర్ కేటీఆర్‌ను కోరాను. దానికి ఆయన ట్విట్టర్ ద్వారానే సెకన్లలో ఓకే చెప్పడం ఆయన గొప్పతనం, ఆయన స్టైల్ కూడా.
D y n a m i s m U n l i m i t e d !!
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani