చాలా ఏళ్లక్రితం ఒక ఇంటర్వ్యూలో, సత్యజిత్ రే ఒక మాటన్నారు. దీన్ని నేను ఇప్పటికే నా ఫేస్‌బుక్‌లో, బ్లాగ్‌లో ఓ మూడునాలుగు సార్లు కోట్ చేశాను.
అలా ఒకసారి నా బ్లాగ్‌లో కోట్ చేసినప్పుడు... నా మిత్రురాలు, కె రాఘవేంద్రరావు గారి శిష్యురాలు, డైరెక్టర్ ప్రియదర్శిని ఓ పంచ్ లాంటి కామెంట్ పెట్టారు: "ఆ కొటేషన్ చదివేనండీ, ఇక్కడకొచ్చి ఇలా ఇరుక్కుపోయాం!" అంటూ.
ఇంతకూ సత్యజిత్ రే చెప్పింది ఏంటంటే -
"సినిమా తీయాలన్న సంకల్పం ముఖ్యం. అదుంటే చాలు. అన్నీ అవే సమకూరతాయి!" అని.
సినిమాకయినా, జీవితంలో ఇంక దేనికయినా... అది చిన్న పనైనా, పెద్ద పనైనా... సంకల్పం అనేది చాలా ముఖ్యం.
అయితే ఇది ఈ బ్లాగ్ రాసినంత సింపుల్ కాదు. ఆల్రెడీ ఉన్న కమిట్‌మెంట్స్, అడ్డంకులకు తోడు కొత్తగా మరెన్నో అవాంతరాలొస్తాయి. ఊహించని దెబ్బలు తగుల్తాయి. తప్పదు. అది వేరే విషయం. దాని గురించి మరోసారి చర్చిద్దాం.
కట్ టూ మై న్యూ ప్రాజెక్ట్స్ -
అప్పుడప్పుడూ ఏదో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చినట్టుగా - నేనిప్పటివరకూ ఏవో రెండు మూడు సినిమాలు చేశాను.
ఇంతకుముందులా 'సినిమాలొద్దు' అని నన్ను వెనక్కిలాగే ఉద్యోగం సద్యోగం, ఇతర బాదరబందీలు కూడా ఇప్పుడేం లేవు నాకు.
ఏక్ నిరంజన్!
లాక్ డౌన్ తర్వాత, ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాను. ఇప్పుడు సినిమాలే నా ప్రధాన వ్యాపకం, వ్యాపారం కూడా.
రైటింగ్, యాడ్ ఫిలిమ్స్, సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ వంటి నా ఇతర వ్యాపకాలన్నీ సెకండరీ.
రైటింగ్, యాడ్ ఫిలిమ్స్, సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ వంటి నా ఇతర వ్యాపకాలన్నీ సెకండరీ.
నా ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం ఒక్కటే. లేటెస్ట్ డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ టెక్నాలజీ.
అతి తక్కువ బడ్జెట్‌లో సినిమాలు చేయొచ్చు. ఊహించనంత వేగంగా కూడా సినిమాలు పూర్తిచేసి రిలీజ్ చేయొచ్చు. మరోవైపు ఓటీటీల్లో రిలీజ్ చేసే సినిమాలకు దొరుకుతున్న క్రియేటివ్ ఫ్రీడమ్, వాటికి అవుతున్న బిజినెస్ కూడా నన్ను బాగా టెంప్ట్ చేస్తున్నాయి.
అతి తక్కువ బడ్జెట్‌లో సినిమాలు చేయొచ్చు. ఊహించనంత వేగంగా కూడా సినిమాలు పూర్తిచేసి రిలీజ్ చేయొచ్చు. మరోవైపు ఓటీటీల్లో రిలీజ్ చేసే సినిమాలకు దొరుకుతున్న క్రియేటివ్ ఫ్రీడమ్, వాటికి అవుతున్న బిజినెస్ కూడా నన్ను బాగా టెంప్ట్ చేస్తున్నాయి.
సో, వీటన్నిటి నేపథ్యంలో -
మైక్రో బడ్జెట్‌లో సినిమాలు, వెబ్ సీరీస్, మ్యూజిక్ వీడియోస్... గట్టి సంకల్పంతో అన్నీ ఒకేసారి ప్రారంభిస్తున్నాను. వీటన్నిటి ప్రి-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
Thanks to Satyajit Ray on the occasion of his 101th Birth Anniversary... May is gonna be a very happening month, igniting new beginnings in my film career.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani