ఎప్పటినుంచో అనుకుంటున్నాను కాని, నిజానికి అంత శ్రద్ధపెట్టలేదు. పెట్టేలా లేవు పరిస్థితులు, బాధ్యతలు.
ఇప్పుడు - మొట్టమొదటిసారిగా ఫిలిం మేకింగ్ ప్రొఫెషన్‌ను టాప్ ప్రయారిటీగా తీసుకొని ముందుకువెళ్తున్నాను. ఇంతకుముందులాగా కుదిరిన ఏదో ఒక సినిమా చేసేసి, మళ్ళీ ఇంకో నాలుగైదేళ్ళవరకూ ఆగకుండా... ఇప్పుడు వరుసనే సినిమాలు ప్లాన్ చేస్తున్నాను.
ఈ దిశలో నన్ను బాగా ప్రొవోక్ చేస్తున్న అంశం... ఇప్పుడు సినీఫీల్డు ప్రయాణిస్తున్న వేగం. దాంతోపాటు - ఫీల్డులో వస్తున్న కొత్త కొత్త ఆవిష్కరణలు. ఇంకా ముఖ్యంగా పెరిగిన బిజినెస్ అవెన్యూస్.
నా అవసరం కూడా...
కట్ చేస్తే -
రెగ్యులర్‌గా చేసే కమర్షియల్ ఫీచర్ ఫిలిమ్స్‌తో పాటు... ఒక వెబ్ సీరీస్, ఒక మ్యూజిక్ ఆల్బమ్ కూడా ప్లాన్ చేస్తున్నాను. వీటన్నిటి ప్రి-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
ఈ నెల నుంచే ఒక్కొక్కదానికి సంబంధించిన వివరాలు బయటికొస్తుంటాయి. నేనూ చెప్తుంటాను.
పనిచేస్తుంటేనే అంతా బాగుంటుంది. ఏవైనా చిన్న చిన్న తలనొప్పులు ఉన్నా అవే సెట్ అయిపోతాయి.
చిన్నదో, పెద్దదో... ఏదైనా సరే, ముందు పనిలో ఉండటం ముఖ్యం.
ఇప్పుడు నేను పూర్తిగా పనిలోకి దిగాను. నా టీమ్‌తో కలిసి పనిచేస్తున్నాను.
Action may not always bring happiness, but there is no happiness without action.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani