ఒకటి రెండు రోజుల్లో వైజాగ్ ప్రయాణం. ముఖ్యమైన మీటింగ్స్, పనులు చాలా ఉన్నాయి. రాజమండ్రి, కాకినాడ ట్రిప్స్ కూడా ఉంటాయి కాబట్టి, బహుశా సంక్రాంతి వరకూ అక్కడే. అటువైపే.
వైజాగ్‌లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, నా స్టుడెంట్స్ కూడా ఉన్నారు.
కాని, ఎవ్వరినీ కలిసే అవకాశం లేదు ఈసారి. షెడ్యూల్ అంత టైట్‌గా ఉంది.
కాని, ఎవ్వరినీ కలిసే అవకాశం లేదు ఈసారి. షెడ్యూల్ అంత టైట్‌గా ఉంది.
పైగా, ఆడిషన్స్ కూడా ఉన్నాయి. ఎక్కడికీ కదిలే పరిస్థితి లేదు.
ఒకరిద్దరు ఆత్మీయ మిత్రుల్ని మాత్రం నేనే హోటల్‌కి లంచ్‌కు ఆహ్వానిద్దామనుకొంటున్నాను.
కట్ చేస్తే -
కట్ చేస్తే -
గత సంవత్సరం, ఏప్రిల్ మూడోవారంలో అనుకుంటాను... సెకండ్ వేవ్‌లో పడిన దెబ్బ నుంచి నేనింకా కోలుకోలేదు. అడ్వాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ వెనక్కిపోయాడు. ఇంకో ష్యూర్ ఫైర్ ప్రొడ్యూసర్ అనుకొన్న మిత్రుడు సాగదీసీ తీసీ చివరికి చెయ్యిచ్చాడు.
ఏది ఎలా ఉన్నా, మూడో వేవ్ వచ్చినా, ఈ నెల్లో మాత్రం ఒక్కొక్కటిగా అన్నీ కదిలిస్తున్నాను.
దాదాపు మూడేళ్ళుగా 'బండ కింద ఇరికిన' నా చేతిని బయటికి లాక్కొంటున్నాను.
బై ద వే, సినిమాలొక్కటే కాదు... యాడ్స్ ఎట్సెట్రా ఇంకా చాలా పనులున్నాయి వైజాగ్‌లో.
కట్ చేస్తే -
ముందు ఒకటి-రెండు మైక్రో బడ్జెట్ సినిమాలతో ప్రారంభించి, తర్వాత ఒక బిజీ & భారీ ప్రొడక్షన్ హౌజ్ నడిపించే దిశలో ఒక్కో స్టెప్ వేసుకుంటూ ముందుకెళ్తున్నాను.
ఒక చిన్న కిక్‌స్టార్టర్ కోసం వెయిటింగ్. అది ఈ ట్రిప్‌తో అయిపోతుంది.
ఇదంతా ప్యాషన్ కాదు, అవసరం.
కట్ చేస్తే -
జనవరి 13... సుమారు నాలుగేళ్ల క్రితం అనుకుంటాను. వైజాగ్‌లో ఒక మిరాక్యులస్ డీల్ సెట్ అయింది. మైత్రి రిసార్ట్స్, యూనివర్సిటీ గెస్ట్ హౌజ్‌ల్లో ఆ డీల్‌కు సంబంధించి జరిగిన బిజినెస్ మీటింగ్స్ ఇప్పటికీ నా మైండ్‌లో ఫ్రెష్‌గా ఉన్నాయి.
అదే డీల్ ఈ జనవరి 13 కు కూడా మళ్లీ ప్లాన్‌లో ఉంది. అవసరమైతే కొంచెం తగ్గి అయినా, అదే యాడ్ డీల్‌ను ఇప్పుడు మళ్ళీ సక్సెస్ చేయాలనుకొంటున్నాను.
Q: సక్సెస్ అవుతుందా మరి?
A: అంత ఈజీ కాదు. కాని, అవుతుంది.
Q: ఏంటంత నమ్మకం?
A: అవతల 'పార్టీ' పైకి బండలా కనిపించినా, మనసు వెన్న.
కొన్నిటికి కారణాలుండవు. లాజిక్కులుండవు. అలా జరిగిపోతాయ్.
అంతా ఒక మాయలా, ఒక మహాద్భుతంలా అనిపిస్తుంది.
"ఎందుకలా?"... అంటే చెప్పడానికి నాదగ్గర కారణాల్లేవు.
ఏదో 'స్పిరిచువల్ కనెక్షన్' అనుకుంటాను... అంతే.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani