ఇక్కడ నేను మాట్లాడుతున్నది కమర్షియల్ సినిమా గురించి...
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. చూస్తుండగానే 30 కోట్ల నుంచి 100 కోట్లు, 300 కోట్ల నుంచి 1000 కోట్లను అందుకొనే దాకా వెళ్ళింది బిజెనెస్. తర్వాతి బెంచ్ మార్క్ 2000 కోట్లు. అది కూడా త్వరలోనే చూస్తాం.
2021 లో, బాలీవుడ్‌ను కూడా బీట్ చేసి, దేశంలోనే అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన సినిమా... తెలుగు సినిమా! ఇప్పుడు బాలీవుడ్‌లోని టాప్ ప్రొడ్యూసర్స్ తెలుగులో తీస్తున్న ప్రతి ప్యానిండియా సినిమాతో అసోసియేట్ అవుతున్నారు. కొత్తవి ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతాయా అని ఎదురుచూస్తున్నారు.
రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్‌కు వచ్చే కొందరు బాలీవుడ్ హీరోలు, నిర్మాతలు తెలుగులో హిట్ అయిన చిన్న సినిమాలను కూడా తెప్పించుకొని మరీ చూస్తున్నారు. ఏ కొంచెం బాగుంది అనిపించినా, వెంటనే ఆ సినిమా రైట్స్ కొనేసుకుంటున్నారు.
ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ అదీ.
ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ అదీ.
ఈ నేపథ్యంలో - ఏపీలో టికెట్ రేట్స్ వ్యవహారం ఒక రేంజ్‌లో దుమ్ము రేపుతోంది అంటే తప్పదు. వందల కోట్ల వ్యవహారం అక్కడ! కాని, వినిపించాల్సినవారి గొంతులే అసలు వినిపించలేదు.
సడెన్‌గా "ఎంటర్ ది డ్రాగన్"లా ఆర్జీవీ ఎంట్రీ బహుశా ఎవరూ ఊహించలేదు. ఒక్క దెబ్బకి ఇష్యూ మొత్తం అరటిపండు వొలిచి చేతిలోపెట్టినట్టు, కామన్ మ్యాన్‌కి కూడా అర్థమైపోయింది.
కరోనాకు ముందు, కరోనాకు తర్వాత లాగా... ఈ టికెట్ రేట్స్ వ్యవహారంలో కూడా "ఆర్జీవీ ఎంట్రీకి ముందు, ఆర్జీవీ ఎంట్రీకి తర్వాత" అని చెప్పాల్సి ఉంటుంది.
కట్ చేస్తే - మినిస్టర్ ఆహ్వానం అందుకొని, రేపు పదో తేదీ ఏపీ మినిస్టర్‌ను కలవడానికి వెళ్తున్నాడు ఆర్జీవీ!
కరోనాకు ముందు, కరోనాకు తర్వాత లాగా... ఈ టికెట్ రేట్స్ వ్యవహారంలో కూడా "ఆర్జీవీ ఎంట్రీకి ముందు, ఆర్జీవీ ఎంట్రీకి తర్వాత" అని చెప్పాల్సి ఉంటుంది.
కట్ చేస్తే - మినిస్టర్ ఆహ్వానం అందుకొని, రేపు పదో తేదీ ఏపీ మినిస్టర్‌ను కలవడానికి వెళ్తున్నాడు ఆర్జీవీ!
వాస్తవానికి ఇది - టికెట్ కొనేవాడు, అమ్మేవాడు, చూపించేవాడు, గవర్నమెంట్... ఈ నలుగురికి సంబంధించిన వ్యవహారం. కాని, ఈ రెండు రాష్ట్రాల్లో దీనికి మించిన సమస్య ఏదీ లేదు అన్నట్టుగా, టీవీ చానెల్స్ ప్రస్తుతం ఈ బ్రేకింగ్ న్యూస్‌ల మీదనే బ్రతుకుతున్నాయి. విధిలేక ప్రేక్షకులు ఆ న్యూస్‌నే చూస్తూ విసిగిపోతున్నారు. యూట్యూబ్ చానెల్స్, సోషల్ మీడియా నిండా కూడా ఇదే గొడవ.
ఈ టికెట్ రేట్స్ ఇష్యూ కారణంగా, గత కొద్దిరోజులుగా ఎంతో విలువైన సమయం, మ్యాన్ పవర్, ఇంటర్నెట్ డేటా ఊహించని స్థాయిలో వృధా కావడం అనేది అత్యంత విషాదం. వాస్తవం ఏంటన్నది ఏపీ ప్రభుత్వానికి, ఇండస్ట్రీవారికీ స్పష్టంగా తెలుసు. మధ్యలో పిచ్చి పుల్లయ్యలు ఎవరో చిన్న పిల్లాడినడిగినా చెబుతాడు. 😊
***
#Cinema #BigBusiness #TeluguCinema #Tollywood #TicketsIssue #RGV #RamGopalVarma #ManoharChimmani #NagnaChitram #MyBlog #TeluguBlog
#Cinema #BigBusiness #TeluguCinema #Tollywood #TicketsIssue #RGV #RamGopalVarma #ManoharChimmani #NagnaChitram #MyBlog #TeluguBlog
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani