Monday, 24 August 2020

సిసలైన టర్నింగ్ పాయిట్ అదే!

"కొన్నిటికి ఏ లాజిక్కులుండవ్... అన్ని కష్టాలు ఒక్కసారిగా కట్టగట్టుకొనే వస్తాయి."

జీవితంలో అన్ని ఆటుపోట్లను అనుభవించి, ఎదుర్కొని, ప్రస్తుతం ప్రశాంతంగా రిటైర్డ్ లైఫ్ అనుభవిస్తున్న ఒక డాక్టర్ అన్నారా మాట.

ఆయన మా ఆఫీస్ ప్రెమిసెస్ యజమాని.

"జీవితం ఎవ్వర్నీ వదలదు భయ్యా. ప్రతి ఒక్కర్నీ, ఏదో ఒక టైమ్ లో ఒక చూపు చూస్తుంది. మిస్సయ్యే ప్రసక్తే లేదు."

మంచి రైజింగ్ టైంలో ఉండగానే, పడకూడని కష్టాలు పడ్డ ఫిల్మ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మాటలివి.

ఇదంతా ఈ రాత్రి  ఒంటరిగా కూర్చొని ఎందుకు రాస్తున్నానంటే, దానికో కారణం ఉంది. ప్రస్తుతానికి ఆ కారణాన్ని అలా పక్కన పెడదాం.

మనిషన్న తర్వాత, వాడి జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక కష్టం చిన్నదో పెద్దదో వస్తూనే ఉంటుంది. కానీ, జీవితంలోని ఒక అతి ముఖ్యమైన మజిలీలో, అన్ని రకాల కష్టాలూ, లేదా అగ్ని పరీక్షలు ఒకేసారి రావడం అనేది ఎంత స్థితప్రజ్ఞుడినైనా కొంతైనా జర్క్ తినేలా చేస్తుంది.

ఏ లాజిక్కులు పనిచేయని కొన్ని ఊహించని పరిస్థితుల్ని ప్రతి మనిషీ తన జీవితకాలంలో ఏదో ఒకసారి ఎదుర్కోవల్సి రావచ్చు.

తప్పదు. తప్పించుకోలేం.

అలాంటి పరిస్థితుల్లో  ఉన్నపుడే నిజమైన హితులు, సన్నిహితులు ఎవరన్నది పాలు, నీళ్ళలా తెలిసిపోతుంది.

జీవితంలో ఏది ముఖ్యమో తెలిసిపోతుంది. జీవితంలో మనం ఏం కోల్పోతున్నామో తెలిసిపోతుంది.

అప్పుడు గాని మన కళ్ళు పూర్తిగా తెర్చుకోవు. అప్పుడుగాని మన మెదడును పూర్తిగా ఉపయోగించుకోము.

అప్పుడే మనకు నిజంగా ఏం కావాలో తెల్సుకుంటాము. అప్పుడే మనం నిజంగా ఏం చేయాలో అది చేయటం ప్రారంభిస్తాము. అప్పుడే మన నిజజీవితంలో ఏ పరిస్థితి ఎదురైనా నిశ్చలంగా ఎదుర్కొంటాము.

రెట్టించిన కసితో, వందరెట్ల శక్తితో.

ఎవరి జీవితంలోనైనా సిసలైన టర్నింగ్ పాయిట్ అదే.

అసలు జీవితం అప్పుడే ప్రారంభమవుతుంది ...

కట్ చేస్తే -

ఇలాంటి పరిస్థితుల్లోనే నా సినిమా పనులవేగం పెంచాను. పని ముఖ్యం. పనిలో ఉండటం ముఖ్యం. పని క్రియేట్ చేసుకోవడం ముఖ్యం.

ప్రాణమున్నన్నాళ్లు బ్రతకటం ముఖ్యం.

కోవిడ్ దారి కోవిడ్‌దే. మనదారి మనదే.

నేను ఎంత అనుకున్నా, అతి ముఖ్యమైన డెసిషన్స్‌ కొన్ని బయటి వ్యక్తుల నిర్ణయాలమీద ఆధారపడి ఉంటాయి.

ఇష్టం లేదు.

అయినా సరే... కష్టపడాలి.

సెప్టెంబర్ 15 నాటికి అంతా సెట్ చేసేసుకొని, నవంబర్ 1 నుంచి షూటింగ్‌కి వెళ్లాలని ప్లాన్.

మరోవైపు కోవిడ్ కరాళనృత్యం మాత్రం ఇంకా ఆగలేదు... 

5 comments:

  1. Waiting for your block buster movies, ott att nee kollagottatame alasyam sir all the best

    ReplyDelete
  2. జీవితం లో ప్రతిదీ ఒక కచ్చితమైన మేలి మలుపే
    చిన్ననాటి జ్ఞాపకాల లోగిలి ఓ మేలి మలుపే
    కన్నీటితో కోన్ని పన్నీటితో కొన్ని హెయిర్ పిన్ బెండ్లు
    రెప్ప పాటులో కానరాని యూ-టర్న్ లు డైవర్షన్లు

    కాని ఈ జీవితం సకల కళల సమాహారం
    ఎన్ని అవాంతరాలున్నా జీవితం మనోహరం

    ~శ్రీత ధరణి

    ReplyDelete
    Replies
    1. జీవితం గురించి కవితాత్మకంగా చాలా బాగా, మనోహరంగా చెప్పారు.

      థాంక్యూ, శ్రీత ధరణి గారు.

      Delete
    2. వెల్కం సర్.. థ్యాంక్యూ

      Delete

Thanks for your time!
- Manohar Chimmani