టీనేజ్‌లో నేను కూడా నాన్‌చాక్ తిప్పాను. కరాటే నేర్చుకున్నాను...
అప్పట్లో మా ఇంటిచుట్టూ అందరూ కరాటే మాస్టర్‌లే. కొత్తగా అప్పట్లో అదొక వేవ్ అనుకోవచ్చు.
ఫోటోలు తీసుకోవాలన్న ఆలోచన అప్పుడు లేదు. ఏమాత్రం ఐడియా ఉన్నా ఒక ఫోటో లాగించేవాణ్ణి.
ఈ బచ్చాలాట జోక్స్ పక్కనపెడితే... ఇక్కడ పాయింట్ కరాటే, నాన్‌చాక్ కాదు.
బ్రూస్‌లీ.
జస్ట్ 32 ఏళ్లకే తను అనుకొన్న ప్రతి ఒక్కటీ సాధించిన ఒక పెద్ద 'సక్సెస్ స్టోరీ' అతను.
32 ఏళ్లకే తన లక్ష్యాలన్నీ సాధించేసి, చెప్పాల్సినవన్నీ చెప్పేసి, ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు ఆదరా బాదరా వెళ్లిపోయాడు.
కట్ చేస్తే -
ప్రపంచం అంతా 'పర్సనల్ డెవలప్‌మెంట్' అనే ఒక ఫీల్ గుడ్ మాయలో పడికొట్టుకొంటోంది. బిలియన్లకొద్దీ డాలర్ల బిజినెస్‌గా రోజురోజుకీ కొత్తపుంతలుతొక్కుతోంది.
మనదేశంలో కూడా.
వేళ్లూనుకుపోయిన కొన్ని సోకాల్డ్ శాస్త్రాల్లాగే, సైన్స్‌కు నిలబడని 'సీక్రెట్' ఇది. క్విక్ ఫిక్స్ కోసం నిరంతరం తపించే మనిషి బలహీనతమీద డబ్బు సంపాదించుకొనే పెద్ద మాయ ఇది.
పాయింట్ ఏ నుంచి పాయింట్ బి కి వెళ్ళడానికి ఒక దారి ఉంటుంది. లేకపోతే చేసుకొంటూవెళ్లాలి, నీటి ప్రవాహంలా.
ఎదురయ్యే పరిస్థితులను బట్టి, ఏ పాత్రలోకి చేరితే ఆ పాత్ర ఆకారంలోకి మారిపోయే నీటిగా మారాలి.
మన కోరికలు, మన కృషి సింక్ అయినప్పుడు మాత్రమే ఇది సాధ్యం. సింక్ కాకుండా చెడగొట్టడానికి 101 విధాల రాక్షసులో, పరిస్థితులో నిరంతరం అడ్డుపడుతుంటాయి. అది అత్యంత సహజం.
అయితే, ఫోకస్ చెడకుండా వాటిని ఎదుర్కొంటూ ముందుకెళ్లేవాడే చివరికి విజేత అవుతాడు.
తన అసామాన్యమైన విజయాలతో, 32 ఏళ్లకే, బ్రూస్‌లీ సాధించి చూపించింది అదే.

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani