ఈదేశంలో కులం నేపథ్యంలోనే ప్రతీదీ నడుస్తోంది అన్న ఉద్దేశ్యంలో, నాకత్యంత ప్రియమైన విద్యార్థుల్లో ఒకడు, "Guy On The Saidewalk" నవలా రచయిత కూడా అయిన భరత్‌కృష్ణ ఈమాట ఒకసారి నాతో అన్నాడు.
పరిచయాలు, స్నేహాలు, వ్యాపారాలు, లాబీలు, రౌడీయిజాలు, రాజకీయాలు .. అన్నిటికీ మన దేశంలో కులమే నేపథ్యం.
నిజంగా ఇది నిజమే.
అలాగని, ప్రతిచోటా ఈ కులం కార్డు పనిచేస్తుందన్న గ్యారంటీ కూడా లేదు.
ఉదాహరణకు, బాగా ఉన్న ఒక కులంవాడు, ఏమీలేని తన కులంవాడిని అసలు పట్టించుకోడు!
ఉదాహరణకు, బాగా ఉన్న ఒక కులంవాడు, ఏమీలేని తన కులంవాడిని అసలు పట్టించుకోడు!
వాస్తవానికి ఈ ప్రపంచంలో ఉన్నవి, ఉండేవి, అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ .. రెండే రెండు కులాలు:
ఉన్న కులం. లేని కులం.
ఎవరు ఒప్పుకొన్నా ఒప్పుకోకపోయినా, ఇదే నిజం.
అయితే డబ్బు! లేదంటే పవర్!!
ఈ రెంటిలో .. ఏదో ఒకటి 'ఉన్న కులం' ఒకటి. ఏదీ 'లేని కులం' ఒకటి.
మళ్లీ ఈ రెండింటికీ కూడా విడదీయరాని అనుబంధం ఉంటుంది. అది వేరే విషయం.
ఎవరు ఒప్పుకొన్నా ఒప్పుకోకపోయినా, ఇదే నిజం.
కట్ టూ నా అనుభవం -
నాకేమాత్రం ఇష్టం లేని ఈ కులం నేపథ్యంగా, నేను దారుణంగా నష్టపోయిన ఒకే ఒక్క ఎపిసోడ్ గురించి మరో బ్లాగ్ పోస్టులో రాస్తాను.
బహుశా రేపే.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani