నాకు అత్యంత దగ్గరి మిత్రుల్లో చాలామంది కులం ఏంటో నాకు ఇప్పటికీ తెలియదు.
వారికి కూడా నా కులం ఏంటో బహుశా తెలిసి ఉండదు.
ఒకే ఒక్క మేధావి మిత్రునితో ఒక సుధీర్ఘ చర్చా సమయంలో తప్ప, ఆ అవసరం నిజంగా మా మధ్య ఎప్పుడూ రాలేదు.
కులం ప్రాతిపదికన నేనెప్పుడూ ఏదీ చెయ్యలేదు. ఎవ్వరినుంచి ఏదీ ఆశించలేదు. ఆ ప్రాతిపదికన ఎవ్వరికీ దగ్గర కాలేదు.
కానీ ..
బహుశా ఒక సంవత్సరం క్రితం అనుకొంటాను. ఒక మిత్రుడు ఈ విషయంలో నన్ను బాగా కెలికి, బలవంతంగా ఎలాగోలా ఒప్పించి, ఒక 'కుల పార్టీ' కి నేను కదిలేలా చేశాడు.
ఆ మిత్రుడు మాత్రం కులం ప్రాతిపదికనే నాకు దగ్గరయ్యాడని తర్వాత గ్రహించాను. అది పూర్తిగా అతని వ్యక్తిగతం. తప్పో ఒప్పో నేను చెప్పలేను.
కట్ చేస్తే -
సదరు మిత్రుడు చాలా మంచి ఉద్దేశ్యంతోనే నా దగ్గరో ప్రపోజల్ పెట్టాడు.
ఇప్పుడు నేనున్న ఒక ప్రధాన ప్రొఫెషన్‌లో నాకు అత్యంత వేగంగా అవసరమైన ఒకానొక అతి చిన్న సపోర్ట్‌ను తాను కనెక్ట్ చేయగలనన్నాడు.
అది .. కులం ప్రాతిపదికన!
ఆ ఒక్క 'కులం' అనే పదానికి పెద్ద ప్రాముఖ్యం ఇవ్వకుండా, నా తక్షణ ప్రొఫెషనల్ అవసరార్థం ఓకే చెప్పాను.
ఎలాగూ రెసిప్రోకల్‌గా, నేనూ ఏదో ఒకటి వారి సపోర్ట్‌కు మించింది వారికి తప్పక చేస్తానన్నది నాకు తెలుసు. నా మిత్రునికి కూడా తెలుసు.
సో, నా మిత్రుడు ఇంక పూనుకున్నాడు.
కట్ టూ 'కులం కనెక్షన్' -
ఒక ఫైన్ సాయంత్రం నన్ను ఆ 'కుల పార్టీ'కి తీసుకెళ్లాడు నా మిత్రుడు.
మందు మస్త్‌గా నడుస్తోంది.
అక్కడే నా కులానికే చెందిన ఒక ఉన్నత స్థాయి వ్యక్తిని పరిచయం చేశాడు.
నా అవసరం చెప్పాడు. ఆయనకు నేనేం చేయగలనో చెప్పాడు. ఆయన నాకు ఇవ్వాల్సిన సపోర్ట్ గురించి చెప్పాడు.
ఎక్కడో అంతరాంతరాల్లో ఏమాత్రం ఇష్టం లేకపోయినా ఆ సంభాషణంతా ఎలాగో భరించాను. ఆ క్షణం ఆయన్నుంచి ఆ సపోర్ట్‌ను నేను నిజంగా ఆశించాను.
ఆయన ఇచ్చుకున్న బిల్డప్ అలాంటిది.
అప్పటి నా అవసరం అలాంటిది.
కట్ చేస్తే -
జస్ట్ నాలుగంటే నాలుగు రోజుల్లో పని పూర్తిచేస్తానని కనీసం నాలుగు సార్లు ప్రామిస్ చేసిన సదరు ఉన్నతస్థాయి వ్యక్తి దాదాపు సంవత్సరమయినా తన మాట నిలుపుకోలేకపోయాడు.
నో ఇష్యూస్.
ఫరవాలేదు.
అర్థం చేసుకోగలిగాను.
కట్ చేస్తే -
ఆతర్వాత కొన్ని నెలలకు, ఇలాగే కులం నేపథ్యంలో ఇంకో వ్యక్తి కూడా నాకు పరిచయమయ్యాడు.
చాలా మంచి కుర్రాడు. చాలా మంచి భవిష్యత్తుంది ఆ కుర్రాడికి. ఆ మంచి భవిష్యత్తుకోసం ఆ కుర్రాడికి కులం అవసరం అస్సలు లేదు.
ఆ కుర్రాడి దగ్గర కూడా అనుకోకుండా ఒకసారి ఇలాంటి టాపిక్కే వచ్చింది.
కట్ చేస్తే -
ఆ కుర్రాడి ద్వారా ఇంకో 'కుల మిత్రుడు' పరిచయమయ్యాడు. అతను కూడా మామూలుగానే ప్రామిస్‌ల వర్షం కురిపించాడు.
విచిత్రమేంటంటే - ఈ రెండు కేసుల్లోనూ, ఏ ఒక్కరూ, వారి ప్రామిస్‌లను నిలబెట్టుకోలేకపోయారు.
అంతవరకు ఓకే.
కానీ ..
వారి మీద గౌరవంతో వివిధ సందర్భాల్లో నేను పంపిన ఎన్నో నా రొటీన్ విషెస్‌కు, నా మెసేజెస్‌కు రిప్లై ఇవ్వాలన్న మినిమమ్ కర్టెసీని కూడా వారు పాటించలేకపోయారు!
అత్యంత బాధ్యతారాహిత్యమైన వారి ప్రామిస్‌ల కారణంగా నేను నిజంగా లక్షలు నష్టపోయినా, నా పట్ల మినిమమ్ కర్టెసీ కూడా చూపించని ఈ కులం, కులబాంధవులు నిజంగా నాకవసరమా?

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani