నేననుకొన్న నా కొత్త బ్లాగ్ ప్రారంభించడానికి ఇంకా సమయం ఉంది.
బహుశా 'నమస్తే హైదరాబాద్' షూటింగ్ పూర్తయిన తర్వాతనుంచి ప్రారంభించవచ్చు.
సో, బ్యాక్ టు మై నగ్నచిత్రం.
ఎట్‌లీస్ట్ ఇంకొన్నాళ్ళు.
కట్ టూ ది గ్యాప్ -
సరిగ్గా నాలుగు నెలల ఈ గ్యాప్‌లో చాలా జరిగాయి.
కలలో కూడా ఊహించలేని స్థాయిలో పెద్ద షాకింగ్ జెర్క్ ఇచ్చిన ఒక ఆరోగ్య సమస్య. అదుపు తప్పిన ఆర్థిక సమస్యలు. ఇంటా బయటా, ఒక్క క్షణం గుర్తుతెచ్చుకోడానికి కూడా బాధించే ఎన్నో అనుభవాల గాయాలు. నమ్మించి మోసాలు. నమ్మకద్రోహాలు.
ఇలాంటి ఎంతో నెగెటివిటీ మధ్య అక్కడక్కడా, అప్పుడప్పుడూ, వేళ్లమీద లెక్కించగలిగిన ఏవో కొన్ని అద్భుత అనుభవాలు, జ్ఞాపకాలు. స్నేహ సుగంధాలు, సౌరభాలు.
జీవితం ఒక ఆట ఆడుకుంది నాతో.
ఇప్పుడు నేను చూపించదల్చుకున్నాను జీవితానికి. అసలు ఆటంటే ఎలా ఉంటుందో.
సరిగా నాలుగు నెలల క్రితం, ఈ 'నగ్నచిత్రం'లో ఇదే నా చివరి బ్లాగ్ పోస్ట్ అంటూ గుడ్‌బై చెప్పాను. ఇప్పుడు మళ్ళీ తిరిగొచ్చాను. కొత్త బ్లాగ్ ప్రారంభించేదాకా ఎప్పట్లా నాకు తోచిన ఏదో ఒక నాన్సెన్స్ ఇక్కడ రాసి పోస్ట్ చేస్తుంటాను.
వ్యక్తిగతంగా నాకు సంబంధించినంతవరకూ - బ్లాగింగ్ అనేది ఒక హాబీ. ఒక మెడిటేషన్. ఒక థెరపీ.
అన్నిటినీ మించి, చాలాసార్లు, నాలోని అంతస్సంఘర్షణకు ఒక ఔట్‌లెట్.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani