చాలా ఏళ్ల క్రితం నేనో ఇంటర్వ్యూ చదివాను.
అది తమ్మారెడ్డి భరద్వాజ గారిది.
ఆ ఇంటర్వ్యూలో నేను చదివిన ఒక ఆసక్తికరమైన విషయం నాకిప్పటికీ గుర్తుంది.
"తెల్లవారితే సినిమా ఓపెనింగ్. జేబులో వంద కాగితం మాత్రమే ఉంది!"
నమ్ముతారా?
నమ్మితీరాలి.
అంతకుముందు నేనూ పెద్దగా నమ్మలేదు. అంతా ఉట్టి డ్రామా అనుకున్నాను. కానీ, అది డ్రామా కాదు, 100% నిజం అని ఇప్పుడు నేను నమ్ముతున్నాను.
ఏదిగానీ తనదాకా వస్తేగానీ తెలీదు కదా!
కట్ టూ మన పాయింట్ -
ప్రొడ్యూసర్, డైరెక్టర్‌గా భరద్వాజ గారు సుమారు 30 సినిమాలు తీశారు. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సార్లు ఎన్నో పదవుల్ని చేపట్టారు. ఇప్పటికీ ఇండస్ట్రీలో చాలా యాక్టివ్‌గా ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఎవరో ఒకరికి ఏదో సహాయం చేస్తూనే ఉంటారు.
ఇంతకూ ఏమయింది? తెల్లవారిందా మరి??
తెల్లవారింది. అన్నీ వాటంతటవే సమకూరాయి. ఆ సినిమా ఓపెనింగ్ కూడా బ్రహ్మాండంగా జరిగింది.
సినిమా పేరు నాకు గుర్తులేదు. బహుశా అది హిట్ కూడా అయ్యే ఉంటుంది.
మరో ఇంటర్వ్యూలో సత్యజిత్ రే ఒక మాటన్నారు. దీన్ని నేను ఇప్పటికే ఫేస్‌బుక్‌లో ఓ మూడునాలుగు సార్లు కోట్ చేశాను.
మొన్నీమధ్యే లేటెస్టుగా దీన్ని కోట్ చేసినప్పుడు .. నా మిత్రురాలు, కె రాఘవేంద్రరావు గారి శిష్యురాలు, కాబోయే డైరెక్టర్ ప్రియదర్శిని ఓ పంచ్ లాంటి కామెంట్ పెట్టారు: "ఆ కొటేషన్ చదివేనండీ ఇక్కడకొచ్చి ఇలా ఇరుక్కుపోయాం!" అని.
ఇంతకూ సత్యజిత్ రే చెప్పింది ఏంటంటే - "సినిమా తీయాలన్న సంకల్పం ముఖ్యం. అదుంటే చాలు. అన్నీ అవే సమకూరతాయి!" అని.
భరద్వాజ గారి సంకల్పమే ఆరోజు వారి సినిమా ఓపెనింగ్ సాఫీగా జరిగేట్టు చేసిందన్నది నా వ్యక్తిగత నమ్మకం.
సినిమాకయినా, జీవితంలో ఇంక దేనికయినా .. అది చిన్న పనైనా, పెద్ద పనైనా .. సంకల్పం అనేది చాలా ముఖ్యం.
కట్ టూ ఫినిషింగ్ టచ్ -
"భరద్వాజ గారి ఆ సినిమా పేరు .. 'ఊర్మిళ'. మాలాశ్రీ తో చేశారు" అని తర్వాత చందు తులసి గారు గుర్తుచేశారు.
సినిమా తీయడానికి కావల్సింది డబ్బు ఒక్కటే కాదు. గట్స్ కూడా!
అది అందరివల్లా అయ్యే పని కాదు.

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani