ఇలా ట్వీట్ పెట్టడం ఆలస్యం .. మళ్లీ వెంటనే ఇంకో ట్వీట్ పెట్టాను:
"నా ఫేస్‌బుక్, బ్లాగ్‌ల డియాక్టివేషన్ ఈ అర్థరాత్రి నుంచే అమలు!"
నా టీమ్‌కు, నేను అందుబాటులో ఉండాల్సిన ముఖ్యమైనవారికి మాత్రం ఫోన్‌లో అప్పుడప్పుడూ అందుబాటులో ఉంటాను .. అని.
అదీ మ్యాటర్.
ఫేస్‌బుక్ మీద నాకు అంత విరక్తి వచ్చేసింది!
అసలు దానిమీద విరక్తి అనేకంటే, నాకే జ్ఞానోదయమైంది అనుకోడం బెటర్.
ట్విట్టర్‌తో అంత టైమ్ వేస్ట్ కాదు. అదొక్కటి మాత్రం అలా కొనసాగిస్తాను. మీడియాలో ఉన్నంతకాలం అదొక్కటయినా ఉండకపోతే కష్టం.
స్ట్రగుల్ ఫర్ ఎక్జిస్టెన్స్!
పైగా, ఫేస్‌బుక్ లాగా ట్విట్టర్ అంత బోరింగ్ కాదు.
ఒక్క ట్వీట్‌తో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చెయ్యొచ్చు. బాగా తిట్లు కూడా తినొచ్చు.
అది వేరే విషయం.
త్వరలోనే నా ఫేవరేట్ నోకియా 3310 తీసుకొని, వాట్సాప్‌లకు, యాండ్రాయిడ్‌లకు కూడా మెల్లిగా గుడ్ బై చెప్పాలని కోరిక.
ఇవన్నీలేని పాతరోజులే బాగున్నాయి. నిజానికి, అప్పుడే ఇంకా హాప్పీగా ఉన్నాను.
అసలిదంతా ఎందుకు అంటే .. నేను పూర్తిచేయాల్సిన పనులు, బాధ్యతలు చాలా ఉన్నాయి. రోజుకి ఒక 40 నిమిషాలు, గంటయినా సరే .. ఫేస్‌బుక్‌కు కెటాయించలేను.
జీవితం చాలా చిన్నది.
గొప్పది కూడా.
ఇప్పుడు నాకదే ముఖ్యం.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani