పూరీ జగన్నాధ్ సినిమా "నేనింతే!" లాంటి టైటిలే కావొచ్చు ఈ బ్లాగ్ పోస్ట్ టైటిల్. కానీ, ఇక్కడ కంటెంట్ వేరే.
పర్సనల్ డెవలప్‌మెంట్.
మైండ్‌సెట్.
ఎన్నో ఇతర రంగాల్లో, ఎన్నో విషయాల్లో తిరుగులేని విజయాల్ని సాధించిన ఒక వ్యక్తి ఒక్కచోట మాత్రం అత్యంత దారుణంగా విఫలమయ్యాడు అంటే అదేదో అందరూ అనుకొనే బ్యాడ్‌లక్ కాదు.
మనం ఎంచుకొన్న పని, లేదా ఫీల్డులో మనం సంపూర్ణంగా పనిచెయ్యడం లేదు. చెయ్యలేకపోతున్నాం. చెప్పాలంటే, ఆ ఫీల్డులో మనల్ని మనం "ఫిట్" చేసుకోలేకపోతున్నాం .. అని నా ఉద్దేశ్యం.
అవతల 100 మంది నిర్ణయాల మీద నీ సక్సెస్ ఆధారపడి ఉందంటే, తప్పకుండా ఆలోచించాల్సిందే ఎవరైనా. మనం ఇక్కడ ఫిట్ అవుతామా లేదా అనేది.
ఇది బాగా ఆలోచించాలి.
రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లాగే ఉండాలన్న సామెత మర్చిపోవద్దు. తాడిచెట్టుకిందకెళ్లి పాలు తాగుతానంటే కుదర్దు. అక్కడ కల్లే తాగాలి.
ఈ మైండ్‌సెట్‌కు షిఫ్ట్ అవ్వటం చాలా అవసరం.
కట్ టూ సక్సెస్ సైన్స్ -
మన నిత్యజీవితంలో, మనచుట్టూ, మనకు అతి దగ్గరగా ఉండే అయిదుగురిమీదే మన జయాపజయాలు ఆధారపడిఉంటాయంటే మనం నమ్మలేం. కానీ నిజం.
ఒక్కసారి చెక్ చేసుకోండి. మీ చుట్టూ మీకు అతిదగ్గరగా మెదిలే ఆ అయిదుగురు ఎవరో, వారిలో ఎవరి మైండ్‌సెట్ ఎలా ఉందో.
"నేను అది పొడుస్తా, ఇది పొడుస్తా" అని ఓ 20 నిమిషాలపాటు ఎగిరి .. ఓ గంట తర్వాత పలకరించి అదే విషయం గుర్తుచేసినప్పుడు అసలు ప్రాణం లేనట్టుగా మాట్లాడేవాడు .. ఒక్కడు నీ అయిదుగురిలో ఉన్నా .. నువ్వేం చెయ్యలేవు.
అందరూ "ఇక వీడింతే" అని నిన్ను అంటారంటే, అందులో వారి తప్పేం లేదు. అక్కడ కనిపిస్తోంది అదేగా?!
సో, ముందా ఒక్కడి మైండ్‌సెట్ మార్చు. లేదా నీ అయిదుగురి సెట్ మార్చుకో. నీకోసం. వాళ్ల కోసం.
అంతా మన చేతుల్లో ఉంది. మన చేతల్లో ఉంది. మన మైండ్‌సెట్‌లో ఉంది. అంతే తప్ప .. "వీడింతే!" అన్నది ఎప్పుడూ నిజం కాదు. కాకూడదు.
ఏదిఎలా ఉన్నా .. నేనైతే ఇది నిజం కానీయను.
ఇంక చాలు. ఇనఫ్ ఈజ్ ఇనఫ్ ...

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani