Thursday, 7 August 2025

చిన్న సినిమా ఎందుకు ఆగిపోతుంది?


రాయాలంటే భారతం అవుతుంది కాని, క్లుప్తంగా ఒకటి రెండు పాయింట్స్‌లో చెప్పే ప్రయత్నం చేస్తాను...

ఆర్టిస్టులు, టెక్నీషియన్లను బుక్ చేసుకునేటప్పుడు చాలా స్పష్టంగా మేమివ్వగలిగిన పేమెంట్ గురించి చెప్పి ఒప్పించుకొంటాం. అదనంగా ఒక్క పైసా ఇవ్వటం సాధ్యం కాదు, అన్నీ అందులోనే అని చెప్తాం. ఓకే అంటారు.

ఒక రెండురోజుల షూటింగ్ తర్వాత "కన్వేయన్స్ కావాలి" అని, "ఇంకో అసిస్టెంట్ కావాలి", "ఇది కావాలి, అది కావాలి" అని ఎలాంటి సంకోచం లేకుండా, చాలా నిర్దయగా ఒక్కోటి మొదలవుతుంది.

సినిమా మధ్యలో ఆపలేం. ఒక్కోటీ ఒప్పుకోవాల్సి వచ్చేలా సిచువేషన్స్ క్రియేట్ అవుతాయి.  

బడ్జెట్ కనీసం ఒక 30 శాతం పెరుగుతుంది. 

సినిమా అదే ఆగిపోతుంది. 

ప్రొడ్యూసర్, డైరెక్టర్‌లకు తప్ప దాదాపు ఏ ఒక్కరికీ కొంచెం కూడా పెయిన్ ఉండదు. కర్టెసీకి కూడా మళ్ళీ ఆ ప్రొడ్యూసర్-డైరెక్టర్స్ వైపుకి చూడరు. కనీసం హాయ్ చెప్పరు. 

నేను జస్ట్ శాంపిల్‌గా ఒక చిన్న అంశం చెప్పాను. దీన్నిబట్టి టోటల్ సినిమా అర్థం చేసుకోవచ్చు.       

కట్ చేస్తే - 

అసలు 30 కోట్ల నుంచి 300 కోట్లు, 1000 కోట్లు ఖర్చుపెట్టే భారీ బడ్జెట్ సినిమాల్లో పనిచేసే సిబ్బందికి ఇచ్చే యూనియన్ వేతనాన్ని, కేవలం కోటి నుంచి 4, 5 కోట్ల లోపు చిన్న బడ్జెట్లో చేసే ఇండిపెండెంట్ సినిమాల్లో కూడా ఎలా ఇవ్వగలుగుతారు? ఎలా అడగగలుగుతారు? 

అసలు యూనియన్‌తో సంబంధం లేకుండా, పనిచేయడానికి ఎందరో పనిలేకుండా ఉన్నారు. అలాంటివారికి అవకాశం ఇచ్చి పనిచేయించుకొంటే 30 శాతం బడ్జెట్ తగ్గుతుంది. ఉన్నంతలో మరింత నాణ్యంగా సినిమా చేయడానికి వీలవుతుంది. 

ఇలా రాశానని నేను యూనియన్స్‌కు, సిబ్బందికి వ్యతిరేకం కాదు. కాని, బడ్జెట్ లేని చిన్న సినిమాలనూ, వందల కోట్ల బడ్జెట్ ఉండే పెద్ద సినిమాలనూ ఒకే విధంగా ట్రీట్ చేయడం వల్ల చిన్న సినిమాలు భారీగా నష్టపోతున్నాయన్నది గుర్తించాలి. 

కట్ చేస్తే - 

ఏదో సినిమా తీయాలన్న ప్యాషన్‌తో ఎవరో ఒకరు, లేదా ఓ నలుగురయిదుగురు లైక్-మైండెడ్ వ్యక్తులు కొన్ని డబ్బులు పూల్ చేసుకొని సినిమా చేస్తున్నప్పుడు - వాళ్ళకి ఇష్టమైన టీమ్‌తో వాళ్ళు స్వతంత్రంగా సినిమా చేసుకోగలగాలి.

మీరు ఫలానా క్రాఫ్ట్‌లో "ఖచ్చితంగా యూనియన్ వాళ్లనే తీసుకోవాలని" రూల్స్ పెట్టడం, అలా తీసుకోలేనప్పుడు యూనియన్ వాళ్ళు మధ్యలో వచ్చి సినిమా షూటింగ్స్ ఆపడం ఎంతవరకు సమంజసం? 

చిన్న సినిమాల విషయంలో - ఆల్రెడీ ఇలాంటి లాజిక్ లేని రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. ఇక మీదట అసలు ఈ రూల్స్‌ను ఎవ్వరూ పాటించరు, పట్టించుకోరు. 

Independent filmmaking is pure freedom — no rules, no brules, just raw vision unleashed. 

- మనోహర్ చిమ్మని

*** 
(మలయాళంలో కోటిరూపాయల్లో తయారవుతున్న అద్భుతమైన సినిమాల్లాంటివి తెలుగులో చేయడానికి 5 నుంచి 30 కోట్లు ఎందుకవుతున్నాయి? రేపు... ఇక్కడే.)   

2 comments:

  1. // అసలు యూనియన్‌తో సంబంధం లేకుండా, పనిచేయడానికి ఎందరో పనిలేకుండా ఉన్నారు. //

    అవును కొందరు స్నేహితులు కలిసి నిర్మిస్తున్న వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిల్మ్స్ బడ్జెట్ లేకుండానే ఎంతో విజయం పొందుతున్నాయి. వాటి క్వాలిటీ నేటి సినిమాలకు తీసిపోకుండా ఉంటోంది.
    అదే స్పూర్తితో సినిమాలు తీయొచ్చు .. కానీ ఇలాంటి సినిమాలకు థియేటర్లు దొరకకుండా చేస్తున్నారు. అందుకే ఒటీటీ, యూట్యూబ్ లను నమ్ముకుంటున్నారేమో అని సందేహం !

    ReplyDelete
    Replies
    1. మీ సందేహంలో కూడా నిజముంది. థాంక్యూ.

      Delete

Thanks for your time!
- Manohar Chimmani