నేను నా మొదటి సినిమా చేస్తున్న కొత్తలోనో, ఆ తర్వాత కొన్నిరోజులకో, సరిగ్గా గుర్తులేదు. ఒకరోజు సాయంత్రం మా ఎమ్మే క్లాస్‌మేట్ యాకూబ్ (కవి యాకూబ్) ఇంట్లో ఏదో ఫంక్షన్ జరిగింది.
అది - దిల్‌షుక్‌నగర్ ప్రాంతంలో ఉన్న మారుతీనగర్.
మా ఎమ్మే మిత్రులందరం వెళ్ళాం. డాబా మీద మా మిత్రుల కోసం ఫార్మల్‌గా మా యాకూబ్ మందు కార్యక్రమం కూడా పెట్టాడు.
రెండు పెగ్గులూ, నాలుగు సిగరెట్లుగా పార్టీ మంచి ఊపులో ఉన్న ఆ సమయంలో ఇంకో ఆత్మీయ మిత్రుడు పైకి వచ్చాడు.
ఆర్జీవీ ప్రారంభకాలపు సినిమాల్లో చాలావాటికి పబ్లిసిటీ డిజైనర్ అతనే.
మాటల మధ్యలో ఆయన నోటి నుంచి ఒక మాట విన్నాను...
"ఫీల్డు వదిలేశాక లైఫ్ చాలా హాయిగా ఉంది... నేనూ, నా ఆర్ట్, నా లోకం, నా నిర్ణయాలు, నా ఇష్టం. ఇంతకంటే ఏం కావాలి మనోహర్?" అన్నాడు.
ఆ రాత్రి, ఆ డాబా మీద, అంతమంది మిత్రుల మధ్యలో నాతో మాట్లాడుతూ ఆయన చెప్పిన ఆమాట నాకెందుకు ఇప్పటివరకూ అంత స్పష్టంగా గుర్తుందో నాకిప్పుడు అర్థమవుతోంది.
ఆ ఆనందం నిజంగా వేరే.
కట్ చేస్తే -
ఆ రాత్రి నాతో అంత మంచి మాట చెప్పిన ఆ మిత్రుడు... ప్రముఖ అంతర్జాతీయస్థాయి చిత్రకారుడు, తెలంగాణ రాష్ట్ర రాజముద్ర రూపశిల్పి - లక్ష్మణ్ ఏలే.
బై ది వే, నేను నంది అవార్డ్ పొందిన నా "సినిమా స్క్రిప్ట్ రచనాశిల్పం" పుస్తకానికి కవర్ డిజైన్ చేసింది కూడా లక్ష్మణ్ ఏలేనే!
When you realize a passionate decision was wrong, drop the ego, drop the temptations, and correct it immediately. Otherwise, you’ll lose not just time and money, but the most precious part of your life.

- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani