"చిత్రానువాదకుడు డార్లింగ్ స్వామి గారు అనువాదం చేసిన సుజాత రంగరాజన్ గారు రచించిన “స్క్రీన్ ప్లే“ పుస్తకం crisp గా ఆసక్తికరంగా content అందిస్తుంది. flow, రీడబిలిటీ ఉన్న ప్రాక్టికల్ పుస్తకం. కొత్తగా స్క్రీన్ ప్లే ను అవగాహన చేసుకోడానికి, రాయడానికి ఉపయోగపడే పుస్తకం. అంతా ఒక ఎత్తు… చివర్లో డార్లింగ్ స్వామి గారి తుదిపలుకులు ఒక ఎత్తు. 'ఈ భూమ్మీద మనం శాశ్వతం కాదు, మన డబ్బు శాశ్వతం కాదు, కానీ మన అలోచనలే శాశ్వతం. వాటితో ఒక మంచి సినిమా తీయండి. అది ఎంత అద్భుతంగా ఉంటే రాబోయే తరాల వారు మనల్ని అంతలా గుర్తుపెట్టుకుంటారు, రిఫరెన్స్ గా మన సినిమా చూస్తారు' అని రాశారు .
ఈ సమయం లో Manohar Chimmani గారి “సినిమా స్క్రిప్ట్ రచనా శిల్పం “ పుస్తకం గుర్తొచ్చింది. ఇప్పుడైతే online లో order పెడితే ఏ భాష పుస్తకమైనా మరుసటి రోజు కి మన చేతికి వస్తుంది . 90’లలో అలా కాదు. అలాటి రోజులలో మా జూనియర్ Srikanth Reddy Gajulapalli (స్పీల్బర్గ్ శ్రీకాంత్) దగ్గర అరువు తీసుకుని చదివి... xerox తీసుకుని పెట్టుకొన్న పుస్తకం. అప్పట్లో చాలా బాగా నచ్చింది.
తర్వాత రోజుల్లో హైదరాద్ వచ్చాక అన్ని లైబ్రరీలు తిరిగి film making పై చాలా పుస్తకాలు చదివాను. NAARM library లో గంటలు గంటలు చదివేవాడిని. Walden లో చాలా పుస్తకాలు కొన్నాను. వీటితో పాటు Kiran Indraganti gari అనల్ప బుక్ హౌస్ లో “shot by shot “, “Five C s of Cinematography “ వంటి పుస్తకాలు కొనుక్కున్న జ్ఞాపకం. “చిరిగిన చెడ్డి అన్నా తొడుక్కో, Syd field పుస్తకాలు కొనుక్కో" అనే నినాదంతో ఆ విధంగా ముందుకు వెళ్ళేవాళ్ళం.
వీటితో పాటు నేను Srinivas Tentu చాలా books share చేసుకునే వాళ్ళం. ఆ time లోనే పరచూరి గారు కూడా ఈ subject పై ఆయన thesis ని book గా publish చేసారు(తెలుగు సినిమా సాహిత్యం కథ కథనం శిల్పం). “Save the cat” - if I am not wrong, నవతరంగ్ blog లో ఆర్టికల్ చూసి చదివాను. ఈ మధ్య భాగ్యరాజా Decoded...
ఎన్ని పుస్తకాలు చదివినా, మొదట చదివిన చిమ్మని మనోహర్ గారి పుస్తకమే ఆసక్తి కి పునాది. ఆ book ఒరిజినల్ కోసం ఎంత try చేసినా దొరకలేదు. Xerox మాత్రం అలాగే ఉంది 😀.
చదివిన screenplay లు “ఎందుకు late అయ్యిందంటే “ అని భార్య కి, లీవ్ కోసం Boss లకి కథలు చెప్పడానికి ఉపయోగ పడ్డాయి 😂."
- M S Rahul
7 August 2025, Facebook.
కట్ చేస్తే -

ఆంధ్రభూమి, స్వాతి, అంధ్రజ్యోతి వీక్లీలు, సండే 'ఉదయం', సండే 'ఆంధ్రప్రభ', విపుల వంటి పత్రికలకు నా యూనివర్సిటీరోజుల నుంచి నేను కథలూ, ఆర్టికిల్సూ రాసేవాడిని.
తర్వాత, నేను ఆలిండియా రేడియో (కర్నూలు) లో పనిచేస్తున్నప్పుడు, అనుకోకుండా స్క్రిప్ట్ రైటర్ అయ్యాను. అదో పెద్ద కథ. తర్వాత, ఘోస్ట్ స్క్రిప్ట్ రైటర్‌గా అప్పట్లో కొంతమంది ప్రముఖ దర్శకులకు, కొందరు వర్ధమాన దర్శకులకు పనిచేశాను. ఆ అనుభవం నేపథ్యంగా, అప్పటి తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్క్రిప్ట్ రైటింగ్ పైన, నేనొక పుస్తకం రాశాను. అప్పటివరకు ఈ సబ్జక్టు పైన తెలుగులో పుస్తకాలు లేవని చెప్పారు.
అదే "సినిమాస్క్రిప్ట్ రచనాశిల్పం".
అప్పట్లో అదొక బెస్ట్ సెల్లర్ పుస్తకం. ఫస్ట్ ప్రింట్ తర్వాత, రెండు ప్రింట్లు వేశాను. హాట్‌కేక్స్‌లా మొత్తం 5 వేల కాపీలు "సోల్డ్ అవుట్" అయిపోయాయి.
తర్వాత మళ్ళీ అనుకోకుండానే నేను డైరెక్టర్ అయ్యాను. రెండు సినిమాలు చేశాను. ఆ రెండు సినిమాల అనుభవాన్ని కూడా చేర్చి, పుస్తకం కొంత రివైజ్ చేసి ప్రింట్ చేద్దామనుకొన్నాను అప్పట్లో.
కాని, నా రెగ్యులర్ ఉద్యోగం, ఇతర క్రియేటివ్ వ్యాపకాలు, కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల మొత్తానికి ఆ పని అలా అలా పెండింగ్‌లో పడిపోయింది.
కాని, నా రెగ్యులర్ ఉద్యోగం, ఇతర క్రియేటివ్ వ్యాపకాలు, కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల మొత్తానికి ఆ పని అలా అలా పెండింగ్‌లో పడిపోయింది.
విశాలాంధ్ర, నవోదయ వాళ్లు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ నేను ఈ పుస్తకం రీప్రింట్ చెయ్యలేకపోయాను.
ఈ పుస్తకాన్ని తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రముఖ ఫిలిం ఇన్‌స్టిట్యూట్స్ వాళ్ళు వాళ్ల స్టుడెంట్స్‌కు సిలబస్‌లో భాగంగా ఇచ్చేవారు. కాపీలు మార్కెట్లో దొరక్క, ఫిలిం నగర్‌లోని ఒక జిరాక్స్ సెంటర్లో ఈ పుస్తకం జిరాక్స్ కాపీలు స్పైరల్ బైండ్ చేసి అమ్ముతున్నట్టు విని నేనొకసారి అక్కడికి వెళ్ళాను. అనామకుడుగా నేనూ ఒక కాపీ కొనుక్కున్నాను. అదొక విచిత్రమైన ఫీలింగ్. తర్వాత, కర్నూల్లో చంద్రశేఖర్ అనే మిత్రుడు, యువ రచయిత నాదగ్గరున్న ఆ కాపీ కూడా తీసుకున్నాడు.
కట్ చేస్తే –
“సినిమాస్క్రిప్ట్ రచనాశిల్పం” పుస్తకం 'Best Book On Films' కేటగిరీలో నాకు నంది అవార్డు సాధించిపెట్టింది.
అప్పటికే నేను రాసిన “ఆధునిక జర్నలిజం” పుస్తకం, కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మే స్థాయిలో రిఫరెన్స్ బుక్స్ లిస్ట్‌లో ఉంది. ఈ విషయం, అదే యూనివర్సిటీలో నేను PhD ఇంటవ్యూకెళ్ళినప్పుడు, నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న ప్రొఫెసర్లు ఆ ఇంటర్వ్యూలో నాకు చెప్పడం విశేషం.

నేను రాసి, పబ్లిష్ చేసి, బాగా గుర్తింపు తెచ్చుకొన్న నా ఈ మొదటి రెండు పుస్తకాలు చాలా కాలంగా మార్కెట్లో లేవు. పుస్తకం కోసం ఎంతోమంది నుంచి నాకు డైరెక్టుగా మెసేజెస్, కాల్స్ ఇప్పుడు కూడా వస్తున్నాయి. కర్టెసీ – సోషల్ మీడియా!
నవోదయ అధినేతలు, విశాలాంధ్ర వాళ్ళయితే ఇంక నాకు చెప్పడం మానేశారు.
Thanks to M. S. Rahul for remembering my book, and special thanks to my music director Pradeep Chandra, who called me yesterday after seeing this post on Facebook.
Thanks to M. S. Rahul for remembering my book, and special thanks to my music director Pradeep Chandra, who called me yesterday after seeing this post on Facebook.
త్వరలో ఈ 2 పుస్తకాలు నేను రీప్రింట్ చేస్తున్నాను. మిత్రుడు గుడిపాటితో చర్చించి, వెంటనే ఎవరైనా పబ్లిషర్స్‌కు రైట్స్ కూడా ఇచ్చేస్తున్నాను.
Life isn’t about perfect decisions—it’s about fast, inspired ones. If it fails, reset, decide again, and keep moving.
Life isn’t about perfect decisions—it’s about fast, inspired ones. If it fails, reset, decide again, and keep moving.
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani