Sunday, 31 August 2025

మనుషులు మారొచ్చు, కాని...


బురదలోకి దిగిన తర్వాత, బురద అంటింది అని ఫీల్ అవ్వటం వృధా. వాడు తోశాడు, వీడు అంటించాడు అని అనుకోవడం కూడా శుద్ధ దండగ. 

కారణం ఎవ్వరైనా, ఎంతమందైనా, నిర్ణయం మనది అయినప్పుడు భారాన్ని మన భుజాలమీదకే ఎత్తుకోగల సత్తా మనకుండాలి.   

రెస్పానిసిబిలిటీ తీసుకోవాలి. అంటిన బురద కడిగేసుకొని బయటపడాలి. 

కట్ చేస్తే -

కొంతమంది ఎందుకంత ఖచ్చితంగా ఉంటారో, ఎందుకంత కఠినంగా మాట్లాడగలుగుతారో కొంచెం లేటుగా అర్థమవుతుంది. ముఖ్యంగా రిలేషన్‌షిప్స్ విషయంలో, మనీ విషయంలో ఖచ్చితంగానే ఉండాలి. అలా లేనప్పుడు, మన కారణంగా ఇంకొకరెవరో బాధపడ్డానికి మనం కారణమవుతాం. 

మనుషులు మారొచ్చు. కాని, ఆ మార్పు పాజిటివ్ కోణంలో జరిగినప్పుడు సంతోషంగా ఉంటుంది.    

Not everyone will remain the same as they were with us on day one. People change. But principles should never change. 

- మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani