Friday, 22 August 2025

విషయం ఎప్పుడూ సినిమానో ఇంకొకటో కాదు...


దిలీప్ మంచి ఆర్టిస్టు, స్క్రిప్ట్ రైటర్ కూడా. నేను గుంటూరులో పనిచేసినప్పుడు, మా జవహర్ నవోదయ విద్యాలయ గుంటూరు విద్యార్థి. హైద్రాబాద్‌లో కూడా నన్ను తరచూ కలిసేవాడు, నాతో చాలా క్లోజ్‌గా తిరిగాడు కూడా. 

అప్పట్లో నవనీత్ కౌర్‌తో ఒక రియల్ ఎస్టేట్ యాడ్ చాల భారీస్థాయిలో, చాలా బాగా చేశాడు. 

నవనీత్ కౌర్, రాజీవ్ కనకాల హీరోహీరోయిన్స్‌గా ఒక సినిమా చేస్తున్నప్పుడు, నానక్‌రామ్‌గూడాలోని రామానాయుడు స్టూడియోలో, నవనీత్ కౌర్ హీరోయిన్‌గా ఒక సినిమా ప్లాన్ చేస్తూ ఆమెతో చర్చించిన విషయం నాకు తెలుసు. అప్పుడు వాడికి ఒక ప్రొడ్యూసర్ కూడా ఉన్నాడు. కాని, అదెందుకో ముందుకు కదల్లేదు. 

అప్పట్లో లీడ్‌లో ఉన్న ఒక డైరెక్టర్‌కు దిలీప్ స్క్రిప్టు విషయంలో బాగా హెల్ప్ చేస్తుండేవాడు. "స్టోరీబోర్డుతో సహా స్క్రిప్టులు కూడా ఇచ్చా" అని చెప్పాడు నాతో. 


నవనీత్ కౌర్‌తో కూడా సినిమా చెయ్యాలని టచ్‌లో ఉండేవాడు. ఎలాగైనా చేస్తా అని నాతో చాలాసార్లు చెప్పాడు దిలీప్. 

నిజంగా హైలీ టాలెంటెడ్. జస్ట్ ఒక మోకా... ఒక్క చాన్స్ కోసం ఎదురుచూస్తుండేవాడు. ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తుండేవాడు.    

కట్ చేస్తే - 

నవనీత్ కౌర్ సినిమాలు తనకు సెట్ కాదు అనుకుంది. నిర్ణయం మార్చుకుంది. చూస్తుండగానే మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఇండిపెండెంట్‌గా ఎం పి అయింది. పార్లమెంట్‌లో తన స్పీచెస్‌తో దడదడలాడించింది.    


మరోవైపు తాగుడుకి బాగా అడిక్ట్ అయ్యాడు దిలీప్. దాదాపు దశాబ్దం క్రితం ఇదేరోజు చనిపోయాడు. వాడిని ఇప్పుడు గుర్తుచేసుకుంటే చాలా బాధనిపిస్తుంది.  

విషయం ఎప్పుడూ సినిమానో ఇంకొకటో కాదు. మనం. మన నిర్ణయాలు. 

Every decision we make builds the story of who we are—and every decision we avoid writes the story of who we could have been. 

- మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani